వారఫలాలు : 14 ఫిబ్రవరి నుంచి 20 ఫిబ్రవరి, 2016 వరకు

13 Feb, 2016 23:07 IST|Sakshi
వారఫలాలు : 14 ఫిబ్రవరి నుంచి 20 ఫిబ్రవరి, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. పాత బాకీలు వసూలవు తాయి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలలో లాభాలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. పసుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
సంఘంలో గౌరవం. మీ ప్రతిభను పదిమందీ గుర్తిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు తొలగుతాయి. ఆదాయం కొంత పెరిగే అవకాశం. ఒక సమస్య పరిష్కారమవుతుంది. స్థిరాస్తి లాభం. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సహకారం. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. నీలం, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. కొన్ని వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. భూములు, వాహనాల కొనుగోలు. ఇంటిలో శుభకార్యాలు. కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంమందగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కళా కారులకు ప్రయత్నాలలో పురోగతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వీరికి పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. తెలుపు,లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆదాయం కొంతపెరిగే సూచనలు. పనులు అనుకున్న రీతిలో పూర్తి కాగలవు. కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఇంతకాలం పడిన కష్టాలు కొంతవరకూ తొలగుతాయి. వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు సత్కారాలు. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట. గృహ నిర్మాణయత్నాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆరోగ్యంపై అశ్రద్ధ తగదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులు సమర్థత చాటుకునే సమయం. కళాకారులకు పురస్కారాలు. చాక్లెట్, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు. నిరుద్యోగుల ప్రయత్నాలలో కొంత పురోగతి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు. తెలుపు, లేతనీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనాలు, భూముల కొనుగోలు. సంఘంలో గౌరవ  మర్యాదలు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు. ఎరుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. కాంట్రాకు ్టపనులు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. అయితే క్రమేపీ అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆదాయం సమకూరుతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనసౌఖ్యం. స్వల్ప అనారోగ్య సూచనలు. దూరప్రాంతాల నుంచి శుభ వార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు అందుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది. నలుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువులు, మిత్రులతో అకారణ వివాదాలు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. కష్టపడ్డా ఫలితం కనిపించని పరిస్థితి. ఇంటా బయటా ఒత్తిడులు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలలో మార్పులు. గులాబీ, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు
 జ్యోతిష్య పండితులు

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు