వారఫలాలు : 13 మార్చి నుంచి 19 మార్చి, 2016 వరకు

13 Mar, 2016 00:27 IST|Sakshi
వారఫలాలు : 13 మార్చి నుంచి 19 మార్చి, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు. గులాబీ, లేత పసుపు రంగులు,పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
పనుల్లో విజయం. ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆదాయం సమకూరు తుంది. ఆరోగ్య సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమా చారం. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆర్థిక విషయాలు సంతృప్తికరం. కొత్త పనులు చేపట్టి విజయ వంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. శ్రమ ఫలించే సమయం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం. భూములు, వాహనాల కొనుగోలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఒక సమాచారం ఊరటనిస్తుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలో దాగిన నైపుణ్యం వెలుగు చూస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహన యోగం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వివాదాల నుంచి బయట పడతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు సన్మానాలు. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనుల్లో విజయం. నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలు ఫలించే సమయం. వివాదాలు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుసు కుంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు తథ్యం. ఎరుపు, చాక్లెట్‌రంగులు, ఉత్తర దిశప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ప్రారంభంలో చికాకులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ అనుకూలిస్తుంది. కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. బంధుమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. సంఘంలో గౌరవం. వాహన యోగం. విద్యార్థులకు నూతనోత్సాహం. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు ప్రోత్సాహవంతం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పనుల్లో పురోగతి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
భూవివాదాలు తీరతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం.  ఇంత కాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు.  పసుపు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
బంధువుల ద్వారా ఆస్తి లేదా ధనలాభం. కార్యక్రమాలు విజయ వంతంగా సాగుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి యథాతథం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.  తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నూతన వస్తు, వస్త్ర లాభాలు. వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు కొంత తగ్గే అవకాశం. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. నీలం, చాక్లెట్ రంగులు,ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగ మిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహా రాలలో ఒడిదుడుకులు కొంత తొలగుతాయి. చిరకాల మిత్రులు తారస పడతారు. ఇంటి నిర్మాణయత్నాలు నిదానంగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చు కుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఊరిస్తాయి. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పనులు ముందుకు సాగవు. మిత్రులు, బంధువులతో వివాదాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. గులాబీ, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
 
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు