వారఫలాలు : 10 ఏప్రిల్ నుంచి 16ఏప్రిల్, 2016 వరకు

10 Apr, 2016 01:18 IST|Sakshi
వారఫలాలు : 10 ఏప్రిల్ నుంచి 16ఏప్రిల్, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో అవాంతరాలు తప్పక పోవచ్చు. సోదరులు, సోదరీలతో స్వల్ప వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. స్వల్ప అనారోగ్యం. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు శ్రమాధిక్యం. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీనృసింహ స్తోత్రాలు పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులకు శ్రీకారం. కొన్ని నిర్ణయాలు కుటుంబసభ్యుల ప్రశంసలు అందుకుంటాయి. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, అదనపు బాధ్యతలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. లేతనీలం, నేరేడు రంగులు, దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమ మరింతగా పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. మిత్రులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. కొన్ని నిర్ణయాలపై పునరాలోచన. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు ఉండవచ్చు. కళాకారులకు ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. తెలుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థికంగా గతవారం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. సోదరులు, మిత్రులతో అకారణ తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో అవరోధాలు. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యసమస్యలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రం. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు నిరాశాజనకం. పసుపు, లేత గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఊహించని అరుదైన ఆహ్వానాలు రాగలవు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు నూతనోత్సాహం. ఎరుపు, చాక్లెట్ రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకోని విధంగా డబ్బు అంది అవసరాలు తీరతాయి.  శ్రేయోభిలాషులు సహాయపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగానే దక్కుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. పనుల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీ సూచనలు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తప్పవు. నలుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ఛాలీసా పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు. గులాబీ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేయండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు