వారఫలాలు : 17 ఏప్రిల్ నుంచి 23ఏప్రిల్, 2016 వరకు

16 Apr, 2016 22:17 IST|Sakshi
వారఫలాలు : 17 ఏప్రిల్ నుంచి 23ఏప్రిల్, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్ర లాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. పసుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)

ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సోదరులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగించవచ్చు. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

పనులలో కొంత జాప్యం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. సోదరులు, మిత్రులతో మాట పట్టింపులు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు నిరుత్సాహం. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. లేత పసుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆదిత్య హృదయం పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటా బయటా కూడా మీదే పైచేయిగా ఉంటుంది. రావలసిన బాకీలు సమయానికి అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. దైవదర్శనాలు చేస్తారు. నేరేడు, లేత ఎరుపు రంగులు, ద క్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే సూచనలు ఉన్నాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారు విదేశీ పర్యటనలు చేస్తారు. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఎరుపు, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు. తండ్రి తరఫు వారి నుంచి ధన, వస్తులాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానాలు. తెలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు సకాలంలో పూర్తయి ఊపిరి పీల్చుకుంటారు. శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీపడతారు. చర, స్థిరాస్తుల వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. సన్మానయోగం. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులు, నిరుద్యోగులు అసంతృప్తి చెందుతారు. బంధువులను కలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం, తెలుపు రంగులు,  ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. నలుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆంజనేయ దండకం పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఎరుపు, బంగారు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.
సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు