వారఫలాలు : 15 మే నుంచి 21మే, 2016 వరకు

15 May, 2016 00:10 IST|Sakshi
వారఫలాలు : 15 మే నుంచి 21మే, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఒక ముఖ్య వ్యవహారం  సానుకూలమవుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. ఎరుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)

వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు.  ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. వాహన, గృహ కొనుగోలు యత్నాలలో కదలికలు రావచ్చు. పాతమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు. ఆకుపచ్చ, నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజకనంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. భూములు,  వాహనాలు కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబంలో చర్చలు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. బంధువర్గంతో అకారణంగా వివాదాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకునే సందర్భంలో తొందరపాటు వద్దు. విలువైన సామగ్రి చేజారే సూచనలు. వ్యాపారాలలో భాగస్వాములతో ఇబ్బందులు. ఉద్యోగులకు అదనపు విధులు తప్పకపోవచ్చు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలై అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు, సన్మానాలు. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి. సంఘంలో విశేష గౌరవం. చాకచక్యంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములవుతారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.  క్రీడాకారులకు అవార్డులు, పురస్కారాలు అందుతాయి. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం. వాహనాలు, భూముల కొనుగోలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పట్టింది బంగారమే. సంఘంలోనూ, కుటుంబంలోనూ మీదే పైచేయి. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. అనుకున్న పనులలో విజయం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూ, వాహనయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్తహోదాలు. కళాకారులకు అప్రయత్నంగా అవకాశాలు. గులాబీ, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశస్తోత్రాలు పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లావాదేవీలు గతం కంటే అనుకూలిస్తాయి. బంధువులు, మిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పనులు కొంత నిదానంగా పూర్తి కాగలవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. విద్యార్థులు చేసే యత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ప్రారంభంలో చికాకులు నెలకొన్నా క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. రావలసిన సొమ్ము అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సజావుగానే సాగుతాయి. శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు కొంతవరకూ తీరతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు. నీలం, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. స్వల్ప అనారోగ్యం. వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నలుపు, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఒక సమస్య చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారుల యత్నాలు సఫలం. ఎరుపు, లేత పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు