వారఫలాలు : 5 జూన్ నుంచి 11జూన్, 2016 వరకు

5 Jun, 2016 01:02 IST|Sakshi
వారఫలాలు : 5 జూన్ నుంచి 11జూన్, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనులు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ కలిగించవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. పసుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. గతం నుంచి ఎదుర్కొంటున్న కొన్ని  సమస్యలు  పరిష్కారవుతాయి. వాహనయోగం. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబి, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆదాయం కొంత పెరిగే అవకాశం. బంధువులు, మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. దైవదర్శనాలు చేసుకుంటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళాకారులను విజయాలు వరిస్తాయి. లేత ఎరుపు, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు సహకరిస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. తెలుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రావ లసిన సొమ్ము అందుతుంది.  చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేజారిన విలువైన సామగ్రి తిరిగి దక్కించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. ఎరుపు, గులాబి రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని ఇబ్బందులు ఎదురైనా అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆకుపచ్చ, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో చికాకులు  సర్దుబాటు కాగలవు. చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు.  భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది.  వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు సన్మానాలు. నీలం, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన కార్యక్రమాలను నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. ఒక పెండింగ్ వ్యవహారంలో అనుకూలత. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. కళాకారులకు ప్రయత్నాలలో పురోగతి. ఎరుపు, లేత గులాబి రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. వాహనయోగం. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. పసుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కార్యజయం. ఆప్తులు,సన్నిహితులను కలుసుకుంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. కళాకారులకు సన్మానాలు. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. భూ, వాహనయోగాలు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన కార్యక్రమాలను కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు