వారఫలాలు : 19 జూన్ నుంచి 25 జూన్, 2016 వరకు

19 Jun, 2016 02:34 IST|Sakshi
వారఫలాలు : 19 జూన్ నుంచి 25 జూన్, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఒక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూలం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆదాయం కొంత తగ్గి రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు సంభవం. కళాకారులకు ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఓర్పు, నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవివాహితులకు వివాహ యత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవర్గాలకు ఆశించిన పదవులు దక్కుతాయి. నేరేడు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరిగినా, కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తీరతాయి. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొన్ని సమస్యలు, వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ప్రతిభ చాటుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సన్మానయోగం. ఎరుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు సన్మానాలు. గులాబి, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు. సంఘంలో గౌరవం. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఎరుపు, పసుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక ప్రగతి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ యత్నాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు కలిసొస్తాయి. కళాకారులకు సన్మానాలు దక్కుతాయి. ఆకుపచ్చ, గులాబి రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కార్యజయం. కుటుంబసభ్యులతో వివాదాలు తీరుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కవచ్చు. కళాకారులకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత తీరుతాయి. కొత్తగా భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అవివాహితులకు వివాహ యత్నాలు, నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. నలుపు, చాక్లెట్ రంగులు, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశాలు ఉన్నాయి.. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. గులాబి, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు