వారఫలాలు : 31 జూలై నుంచి 6ఆగస్టు, 2016 వరకు

31 Jul, 2016 02:24 IST|Sakshi
వారఫలాలు : 31 జూలై నుంచి 6ఆగస్టు, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. దూరపు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. గులాబి, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. మిత్రులు, కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. ఆకుపచ్చ, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు చికాకులు తొలగుతాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పసుపు, నేరేడు రంగులు, ఆదిత్య హృద యం పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. లేత ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. లేత ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. కళాకారులకు అవార్డులు. తెలుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన కొన్ని పనులు అనుకున్న రీతిలో పూర్తి కాగలవు. ఆలోచనలు కలసి వస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎరుపు, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దొరుకుతాయి. రాజకీయవర్గాలకు సన్మానయోగం. గులాబి, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. నీలం, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పదు. కళాకారులకు నిరుత్సాహం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కీలక అంశాల్లో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారుల యత్నాలలో పురోగతి. ఎరుపు, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు