వారఫలాలు : 4 మార్చి నుంచి 10 మార్చి 2018 వరకు

4 Mar, 2018 09:09 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యల నుంచి విముక్తి.  భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనసౌఖ్యం. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. మీ నీతినిజాయితీలకు తగిన గుర్తింపు రాగలదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. పరిశోధకులు కొత్త ఆవిష్కరణలతో ముందడుగు వేస్తారు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా మెలిగి అందరికీ ఆత్మీయులుగా మారతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వ్యయప్రయాసలను సైతం లెక్కచేయకుండా ముందడుగు వేస్తారు. అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారవర్గాలకు కొత్త పెట్టుబడులు సమకూరి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కార్యోన్ముఖులై విజయాల బాటలో నడుస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తిలాభాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. కళాకారులు, పరిశోధకులు సన్మానాలు అందుకుంటారు. వారం మధ్యలో వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. రుణదాతల నుంచి ఒత్తిడులు. అనుకున్న పనులు నెమ్మదిస్తారు. శక్తికి మించి బాధ్యతలు చేపట్టి సతమతమవుతారు. హామీల విషయంలో తొందరపాటు వద్దు. సోదరులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. అకాల ఆహారవిహారాదులకు స్వస్తి చెప్పండి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
వీరికి అన్ని శుభశకునాలే. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. బంధువులు మీపై వేసిన నిందలు ఉపసంహరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో మీ శ్రమ వృథా కాదు. ఉద్యోగస్తులు పైస్థాయి అధికారుల గుర్తింపు పొందుతారు. కళాకారులకు అవార్డులు. వారం చివరిలో అనారోగ్యం. చోరభయం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం.  మీ ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం.  రాబడి సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థతను చాటుకుంటారు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త పదవులు దక్కే సూచనలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. పసుపు, ఆకుపచ్చ రంగులు.  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వాహనయోగం. కోర్టు వ్యవహారాలలో అనుకూలత. వ్యాపార విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిళ్లు. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. కొన్ని రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. పసుపు, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. జీవితభాగస్వామి ద్వారా ధనలాభం. వాహన, గృహయోగాలు. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు. మరపురాని సంఘటన ఎదురుకానుంది. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. వివాదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆదాయం సమకూరినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆత్మీయులు మీ పట్ల మరింత అభిమానం చూపుతారు. మీలో దాగిన ప్రతిభ వెలుగుచూసే వీలుంది. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి కలుగుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనయోగం. సోదరులు, సోదరీలతో సఖ్యత నెలకొంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కే ఛాన్స్‌. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మరిన్ని వార్తలు