వారఫలాలు : 5 మార్చి నుంచి 11 మార్చి 2017 వరకు

5 Mar, 2017 01:46 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆదాయానికి మించిన ఖర్చులు. అనుకున్న పనులు శ్రమానంతరం పూర్తి. బంధువర్గంతో విభేదాలు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపండి. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగవర్గాలకు కొద్దిపాటి చికాకులు. పారిశ్రామికవర్గాలకు కొంత అసహనం. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. పసుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఉద్యోగలాభం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాల సందర్శనం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలం. చేపట్టిన కార్యాలలో విజయం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీరు చెప్పిందే శాసనంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారుల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామిని పూజించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. మిత్రులతో కలహాలు. పసుపు, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
శ్రమానంతరం పనులు పూర్తి. ఆర్థిక వ్యవహారాలలో క్రమేపీ పురోగతి కనిపిస్తుంది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వాహన, గృహయోగాలు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. నలుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగ యత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణాలు, వాహనం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. తెలుపు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఏ పని చేపట్టినా విజయమే. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని విధంగా పదోన్నతులు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరతాయి. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
మొదట్లో కొద్దిపాటి చికాకులు, సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. నలుపు, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. అయితే అవసరాలకు డబ్బు అందుతుంది. బంధువులు, మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

>
మరిన్ని వార్తలు