వారఫలాలు : 20 ఆగస్టు నుంచి 26 ఆగస్టు 2017 వరకు

20 Aug, 2017 00:36 IST|Sakshi
వారఫలాలు : 20 ఆగస్టు నుంచి 26 ఆగస్టు 2017 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఇంటాబయటా మీకు అనుకూలమైన కాలం. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చనలు చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కష్టానికి తగిన ఫలితం లేక నిరాశ చెందుతారు. ఆత్మీయులు, బంధువులతో విభేదాలు తప్పకపోవచ్చు. నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. మీ పట్ల కుటుంబసభ్యులే వ్యతిరేకత చూపుతారు. అకాల ఆహార విహారాదులతో ఆరోగ్యపరంగా చికాకులు. విద్యావకాశాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళాకారులు ఒత్తిడులకు లోనవుతారు.  వారం మ«ధ్యలో శుభవార్తా శ్రవణం. ధనలబ్ధి. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వీరికి పట్టింది బంగారమే. అన్నీ శుభసూచకాలే. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీపై కుటుంబసభ్యుల వైఖరి మారుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, భూములు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబసమస్యలు. తెలుపు, గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఎంతటి సమస్యనైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. మీ నైపుణ్యం, ధైర్యసాహసాలు వెలుగులోకి వస్తాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. విద్యార్థులకు కొత్త ఆశలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు యత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆశించిన రీతిలో పనులు పూర్తి కాగలవు. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గే అవకాశం. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. నీలం, లేత గులాబి రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రావలసిన సొమ్ము అందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపార లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఒత్తిడులు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మొదట్లో నెలకొన్న సమస్యలు, వివాదాలు క్రమేపీ సర్దుబాటు కాగలవు. కొన్ని ఒప్పందాలపై చొరవ చూపుతారు. ఆత్మీయుల నుంచి సలహాలు అందుతాయి. ఆశించిన రాబడి కనిపిస్తుంది. ఎవరేమన్నా మీదారిని వీడరు. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు ప్రయత్నాలలో అనుకూలత. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చరంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఫర్వాలేదనిపిస్తుంది. బంధువులు మీపై ఒత్తిడులు పెంచుతారు. ముఖ్య నిర్ణయాలలో జాగ్రత్తలు పాటించండి. మిత్రులు, శ్రేయోభిలాషులు కొంత సహాయపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు కాస్త నిరాశ తప్పకపోవచ్చు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగులకు పని ఒత్తిడులు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో శుభవార్తలు, వాహనయోగం.  నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. అనుకున్న ఆదాయం సమకూరినా ఖర్చులు కూడా పెరుగుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరకు చేరుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. విద్యార్థులకు సానుకూలమైన సమయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి మార్పులు అనివార్యం. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో «దనవ్యయం. మానసిక ఆందోళన. గులాబీ, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మరిన్ని వార్తలు