వారఫలాలు : 30 జూలై నుంచి 5 ఆగస్టు 2017 వరకు

30 Jul, 2017 00:27 IST|Sakshi
వారఫలాలు : 30 జూలై నుంచి 5 ఆగస్టు 2017 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
రాబడి, ఖర్చుకు పొంతన ఉండదు. రుణాలు చేయాల్సిన పరిస్థితి.  కుటుంబసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. శ్రమ పడ్డా పనులు ముందుకు సాగవు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగవర్గాలకు అదనపు పనిభారం. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. లేత ఆకుపచ్చ, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే ఛాన్స్‌. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నలుపు, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.  స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. విద్యార్థుల కలలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు అనుకున్న అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. పని ఒత్తిడులు. ఆకుపచ్చ, లేతనీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు కొంత నెమ్మదిస్తాయి. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు తప్పకపోవచ్చు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా పడతాయి. వారం చివరిలో ధనలాభం. శుభవార్తలు. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆదాయానికి మించిన ఖర్చులు. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించక నిరాశ చెందుతారు. విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలోపాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవర్గాలకు చికాకులు. వారం ప్రారంభంలో వాహనయోగం. వివాదాల పరిష్కారం. గులాబీ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం.గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బంది పడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదువుతాయి. సోదరులు, మిత్రులతో విభేదాలు. కొన్ని కార్యక్రమాలు చివరిక్షణంలో వాయిదా వేస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు బదిలీ సూచనలు. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో విందువినోదాలు. ఆస్తిలాభం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, పశ్చిమదిశ  ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పాతబాకీలు కూడా వసూలై అవసరాలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. కొత్త పదవులు దక్కుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగించవచ్చు. ఇంటాబయటా సమస్యలు ఎదురై సహనాన్ని పరీక్షిస్తాయి. నిబ్బరంగా ముందుకు సాగడం మంచిది. బంధువర్గం నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. కళాకారుల యత్నాలు మందగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకున్న రాబడి సమకూరుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. కొన్ని వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీపా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆరోగ్యసమస్యలు తీరతాయి. పలుకుబడి కలిగిన వారితో ఉత్తరప్రత్యుత్తరాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళాకారులకు కార్యసిద్ధి. సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. వృథా ఖర్చులు. నలుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులకు తీపి కబురు అందుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. నీలం, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలపై ^è ర్చిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. కొన్ని విలువైన పత్రాలు జాగ్రత్త. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

>
మరిన్ని వార్తలు