వారఫలాలు : 9 జూలై నుంచి 15 జూలై 2017 వరకు

9 Jul, 2017 02:06 IST|Sakshi
వారఫలాలు : 9 జూలై నుంచి 15 జూలై 2017 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు వరిస్తాయి. నీలం, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువర్గంతో నెలకొన్న వివాదాలు తీరతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు శుభవార్తలు. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వివాహయత్నాలు కలసివస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. పసుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు కొంత వరకూ పరిష్కారం. ఆశించిన ఆదాయం పొందుతారు. వాహనయోగం. నిరుద్యోగులకు కొత్త ఆశలు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. పసుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామిని పూజించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
 ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. కళాకారులకు ప్రయత్నాలలో ప్రగతి కనిపిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు కొంత వరకూ అనుకూలిస్తాయి.  నూతన విద్యావకాశాలు దక్కుతాయి. గృహం,వాహనాల కొనుగోలు యత్నాలలో పురోగతి ఉంటుంది. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వృథా ఖర్చులు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. అనుకున్న పనుల్లో జాప్యం. నిరుద్యోగులు, విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పైస్థాయి నుంచి ఒత్తిడులు. కళాకారులకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ఛాలీసా పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారుల యత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. గులాబీ, పసుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. మీపై వచ్చిన అభాండాలు తొలగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. నేరేడు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వీరికి పట్టింది బంగారమే. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారతారు. వాహనయోగం. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. నలుపు, నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభం. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో  చికాకులు. గులాబీ, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి.

మరిన్ని వార్తలు