వారఫలాలు(18 ఫిబ్రవరి నుంచి 24 ఫిబ్రవరి 2018 వరకు)

18 Feb, 2018 01:36 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కళాకారుల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పసుపు, లేత ఎరుపు రంగులు,  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
రాబడి ఆశాజనకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఖర్చులు. అనారోగ్యం. గులాబి, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారం. పాతమిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. వ్యాపారాలలో కొత్త పెటుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఒత్తిడులు. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ శక్తిసామర్థ్యాలు అందరూ గుర్తిస్తారు. ఆస్తి విషయాలు కొలిక్కి వస్తాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు, ఆరోగ్యభంగం. తెలుపు, గులాబి రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ æచేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. సోదరులు, సోదరీలతో విభేదాలు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కాస్త నిరాశాజనకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తల అంచనాలు తప్పుతాయి. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ఎరుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
శ్రమ మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆదాయం అంతగా కనిపించక అప్పులు చేయాల్సివస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళాకారులకు చికాకులు. వారం ప్రారంభంలో వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. శు¿¶ కార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం పొందుతారు. విద్యార్థుల యత్నాలు సఫలం. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబి రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వీరికి అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. శత్రువుల్లా భావించే వారు కూడా మిత్రులుగా మారతారు. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని వ్యవహారాలలో చర్చలు సఫలం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. కళాకారులకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆప్తులతో కలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి విషయంలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి ఒక కీలక సమాచారం రావచ్చు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం.  గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. రుణదాతల నుంచి ఒత్తిడులు. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ప్రాణస్నేహితులు కొంత వ్యతిరేకత చూపుతారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
రాబడికి మించిన ఖర్చులు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. మీపై ఉంచిన బాధ్యతల నిర్వహణలో జాప్యం. సోదరులు, మిత్రులతో అకారణంగా వైరం నెలకొంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. శ్రమాధిక్యంతో కొన్ని పనులు పూర్తి కాగలవు. మీరు తీసుకునే నిర్ణయాలు మనస్పర్థలకు కారణం కాగలవు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగవర్గాలకు మరిన్ని బాధ్యతలు తప్పవు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. వారం మ«ధ్యలో విందువినోదాలు. కార్యజయం. నలుపు, లేత పసుపు రంగులు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూరపు బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, గోధుమరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు 

టారో (18 ఫిబ్రవరి నుంచి  24 ఫిబ్రవరి, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
గతంలో జరిగిన పొరపాట్లను గురించే నిరంతరం ఆలోచిస్తూ కూర్చోకండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరన్న విషయాన్ని గ్రహించండి. వృత్తిరీత్యా కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వనిస్తోంది. ధైర్యంగా ఆ వైపుకు అడుగులు వేయండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. 
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఈ వారమంతా కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మీకు బాగా దగ్గరైన వారొకరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తోంది. జీవితాశయానికి చాలా దూరంలో ఉన్నట్లైతే, ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించి ఆ వైపు అడుగులు వేయండి. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. వృత్తిరీత్యా కొత్త పదవులను అలంకరిస్తారు. ప్రేమ విషయంలో మాత్రం మొండిగా ఉన్న మీ ఆలోచనా తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
కలిసివచ్చే రంగు : ఊదా

మిథునం (మే 21 – జూన్‌ 20)
గతాన్ని గురించి ఆలోచిస్తూ అద్భుతమైన భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ప్రస్తుతాన్ని బాగా ఆస్వాదించాల్సిన సమయం ఇది. మీ శక్తినంతా కూడగట్టుకొని భవిష్యత్‌ను నిర్మించుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆత్మ విశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. మీదైన శైలిని నమ్ముకొని ముందుకు వెళ్లండి. కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వల్ల కొత్త ఉత్సాహం పొందుతారు. మీకోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి. విహారయాత్ర సూచనలు కనిపిస్తున్నాయి.
కలిసివచ్చే రంగు : నారింజ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
పరిస్థితులు కొన్ని మీకు ప్రతికూలంగా మారిపోయే అవకాశం ఉంది. జీవితమంతా చీకట్లో గడిచిపోతున్నట్లు ఉంటుంది. అయితే ఇదేమీ శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలి. మీ జీవితంలో వెలుగులు నింపడానికి ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు. మీదైన ఆలోచనా విధానమే మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళుతుంది. అందరినీ ఒకేలా చూడాలన్న ఆలోచన కూడా మీకు ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. 
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఇప్పటివరకూ ఏ చెడు జరిగినా అదంతా మంచికే అని గ్రహించాల్సిన సమయం ఇది. కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి మిమ్మల్ని సిద్ధం చేసే ఆలోచన ఇదే. మీకు ఏది అవసరమో, మీ ఆలోచనలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతున్నాయో అటువైపే మీ అడుగులు వేయండి. మీకు పెద్దగా ఉత్సాహం లేని పనులు మాత్రం అస్సలు మొదలుపెట్టకండి. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయండి. త్వరలోనే మీ సమస్యలన్నీ సద్దుమణిగి జీవితం కొత్తగా మళ్లీ మొదలవుతుంది.
కలిసివచ్చే రంగు : పసుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీదైన ఆలోచనా విధానాన్ని ఎప్పటికీ మార్చుకోవద్దు. విజయం మీవైపే ఉంది. కష్టపడి దాన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనను బలంగా నమ్మండి. పోటీ ప్రపంచంలో మీకొక గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు త్వరలోనే లభిస్తుంది. ఎక్కువ పనులు మీద వేసుకొని ఒత్తిడికి లోనుకావద్దు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ప్రేమ జీవితం మిమ్మల్ని కొన్నాళ్లుగా బాగా ఇబ్బంది పెడుతోన్న అంశం. ఈ వారంలో అన్నీ చక్కబడతాయి. ఈ విషయంలో మీరు కోరుకుంటున్న రీతిలోనే ఒక పూర్తి అవగాహన వస్తుంది. కొత్త జీవితం మొదలుపెడతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక విహారయాత్రకు వెళ్లే ఆలోచన చేస్తారు. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వృత్తిరీత్యా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రేమ జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య సమన్వయం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది. 
కలిసివచ్చే రంగు : పసుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
పరిస్థితులకు ఎదురెళ్లి ధైర్యంగా ముందడుగు వేయాల్సిన సమయం ఇది. ఊహలకు, వాస్తవ ప్రపంచానికి ఉన్న దూరాలను తగ్గించాలంటే, మీరు ఊహా ప్రపంచాలను వీడి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి సమాధానంగా ఓ గొప్ప విజయం చేకూరుతుంది. వృత్తి జీవితంలో మంచి రోజులు కనిపిస్తున్నాయి. ఉన్నత పదవులు అలంకరిస్తారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : లేత గులాబి

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం మానండి. మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. ఫలితం దానంతట అదే వస్తుందని నమ్మండి. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని, వారితో ప్రేమగా మెలగండి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. 
కలిసివచ్చే రంగు : లేత గోధుమ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు అలాగే ఉంటాయి. అయితే నమ్మకంతో, కాస్త విరామం తీసుకొని మీ జీవిత భాగస్వామికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేయండి. వృత్తి జీవితం కూడా ఊహించినంత ఆశాజనకంగా ఉండటం లేదు. కొద్దిరోజులు అన్నింటికీ దూరంగా ఒక విహారయాత్రకు వెళ్లే ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే ఆలోచనా∙విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. 
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
జీవితాన్ని నిరంతరం ఆస్వాదించడమే మన ఉన్నతికి పాటుపడే అంశమని గ్రహించి పనిచేయడం అలవర్చుకోండి. అనవసరమైన విషయాలను గురించి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విషయాలను గురించి ఎక్కువ ఆలోచించకండి. జీవితం మీద మీకున్న అభిప్రాయాలను చిన్న చిన్న అంశాలేవీ ప్రభావితం చేయకుండా చూసుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. అందులో మీ స్థాయికి తగ్గవాటినే ఎంచుకోండి. మీ చుట్టూనే కొందరు మీ అభివృద్ధికి అడ్డు పడుతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. 
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
జీవితమంతా నిరాశాజనకంగా సాగుతుందని భావిస్తారు. ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన సమయం ఇదే. అపజయాలు సర్వ సాధారణమనీ, వాటికి ఎదురెళ్లి నిలబడే ధైర్యం ఎప్పుడూ కోల్పోవద్దని తెలుసుకోండి. ఏది జరిగినా దానికి మూల కారణం మీరేనన్న విషయాన్ని నమ్మండి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : తెలుపు
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

మరిన్ని వార్తలు