వారఫలాలు

6 May, 2018 00:49 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కష్టసాధ్యమైన పనులైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు కీలక సమాచారం అందుతుంది. వారం చివరిలో అనారోగ్యం. « కుటుంబంలో సమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
మీలోని నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో పైస్థాయికి చేరుకుంటారు. రాజకీయవర్గాలకు పదవీయోగం కలుగుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. బంధువర్గంతో అకారణంగా విభేదాలు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్య, కుటుంబసమస్యలు తప్పకపోవచ్చు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. పనులు ముందుకు సాగవు. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా కొనసాగవు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. కళాకారులకు చికాకులు. వారం చివరిలో విందువినోదాలు. ఆకస్మిక ధనలాభం. పసుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆర్థిక ఇబ్బందులు. బాధ్యతలు మీదపడి ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు. వారం ప్రారంభంలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త విషయాలు లె లుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. రుణబాధలు తొలగి, ఆనందంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు యత్నకార్యసిద్ధి. శుభకార్యాలలో పాల్గొని, సంతోషంగా ఉంటారు.  ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళాకారులకు సత్కారాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. బంధుమిత్రుల నుంచి కొన్ని వివాదాలు. ఆస్తుల ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి. పసుపు, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంతగా కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య,కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులు కొంత నిరాశకు గురవుతారు. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు తప్పవు. పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితి. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖాంజనేయస్వామిని పూజించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. ఆస్తి విషయాలలో చికాకులు నెలకొంటాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. వారం మధ్యలో విందువినోదాలు. శుభకార్యాలలోపాల్గొంటారు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి. ఆలోచనలు అమలు చేస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. కోర్టు కేసుల నుంచి ఉపశమనం. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. లేత ఎరుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి రుణాలు చేస్తారు. పనులలో ప్రతిబంధకాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ మరింత పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటారు. సోదరులు, మిత్రులతో కలహాలు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కళాకారులకు సమస్యలు ఎదురవుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని ఇబ్బందులు. వివాదాలు తొలగుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో అనారోగ్యం. బంధువిరోధాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.
-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

 టారో (6 మే నుంచి 12 మే, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
పాత గాయాలను తలుచుకుంటూ, గతాన్ని తవ్వుతూ పోతే మిగిలేది ఏమీ ఉండదని గ్రహించండి. ఆ ఆలోచనల నుంచి బయటికొస్తేనే కొత్త జీవితం మొదలుపెడతారు. గొప్ప కలల్ని కనండి. మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపే ఓ అవకాశాన్ని సొంతం చేసుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. జీవితాన్ని మలుపుతిప్పే ఓ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కొన్ని సవాళ్లు ఎదురైనా వాటికి ఎదురెళ్లి నిలబడతారు. 
కలిసివచ్చే రంగు : నీలం 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ప్రకృతిని అమితంగా ప్రేమించే మీకు, ఆ ప్రకృతి నుంచే ఒక సందేశం అందుతుంది. అది మీ ఆలోచనల్ని మీరు మార్చుకోవాలని చెప్పే సందేశం. అనవసరమైన విషయాలను గురించి ఎక్కువ ఆలోచించకుండా మిమ్మల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించే విషయాల వైపుకు నడవండి. కొత్త వాహనం కొలుగోలు చేస్తారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
కొంతకాలంగా చేపట్టిన పనులేవీ ముందుకు కదలడం లేదన్న నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. అయితే ఒక గొప్ప విజయానికి ముందు పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయని గ్రహించండి. త్వరలోనే మీరు ఊహించని అవకాశం మీ తలుపు తడుతుంది. కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు కూడా మెల్లిగా సద్దుమణుగుతాయి. జీవితాశయం వైపు అడుగులు వేస్తారు. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
జీవితం కొన్నిసార్లు లెక్కలేనన్ని పరీక్షలు పెడుతూంటుంది. గెలిపిస్తుంది. ఓడిపోయేలా చేస్తుంది. ఎన్నిచేసినా, ఎలా ఉన్నా జీవితాన్ని అలాగే ఆస్వాదించడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లేదు. మీరు ఈ విషయం తెలుసుకున్న క్షణం నుంచే ఒక కొత్త జీవితాన్ని చూస్తారు. అనూహ్యంగా కొత్త కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం కూడా ఇదేనన్న ఆలోచన చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది.
కలిసివచ్చే రంగు : వయొలెట్‌ 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
వృత్తి జీవితం ఊహించనంత సంతోషంగా ఉంటుంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఓ గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. కొన్నిసార్లు జీవితమంటే ఇంతేనేమో అనే నైరాశ్యం వెంటాడొచ్చు. ఇవి అందరి జీవితాల్లోనూ ఏదోక సందర్భంలో ఎదురయ్యే పరిస్థితులను తెలుసుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రకృతిని ప్రేమించే మీ స్వభావం కూడా మిమ్మల్నెప్పుడూ ఉత్సాహంగా ఉంచుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : ఎరుపు 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈవారమంతా ఉత్సాహంగా ఉంటారు. కొత్త ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. నిరంతరం మీ చుట్టూ తిరిగే గొప్ప ఆలోచనలే మీ జీవితానికి అతిపెద్ద బహుమతి అని గ్రహించండి. వృత్తి జీవితం ఎప్పట్లానే బాగుంటుంది. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు ఒక వేదికను దొరికి పట్టుకుంటారు. కొత్త అవకాశాలు వాటంతట అవే వస్తాయని కూర్చోకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : పసుపు 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఈవారం ఒక గొప్ప విజయం మీ సొంతమవుతుంది. ఎప్పట్నుంచో కలలు కంటున్న జీవితం వైపుకు తొలి అడుగులు వేస్తారు. గతాన్ని గురించి ఎంత ఆలోచిస్తూ కూర్చున్నా దానివల్ల ఫలితం ఉండదని తెలుసుకోండి. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తి అన్ని సందర్భాల్లో మీ తోడుండటం గొప్ప ఉత్సాహాన్నిస్తుంది. జీవితాన్ని మలుపుతిప్పే ఓ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అన్నీ ఆలోచించి, మీకు సరైనదిగా కనిపించే నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఈవారమంతా చాలా సంతోషంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళతారు. జీవితంలో ఏ విషయానికైనా పరిమితి ఉంటుందేమో కానీ, చుట్టూ ఉండేవాళ్లతో పాటు మనమూ సంతోషంగా ఉండాలనుకోవడానికి పరిమితి ఉండదు. ఈ ఆలోచనే మిమ్మల్ని విజయం వైపుకు నడిపిస్తుంది. త్వరలోనే ఓ గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీదైన ప్రతిభ ప్రపంచానికి పరిచయమవుతుంది. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఈవారమంతా మీరు కోరుకున్న విధంగా చాలా సంతోషంగా గడుపుతారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పోరాడే మీ స్వభావమే మిమ్మల్ని విజయం వైపుకు నడిపించే శక్తి అని నమ్మండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అప్పులన్నీ తీర్చేసి ప్రశాంతతను దక్కించుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తి నుంచి అందే ఒక బహుమతి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
కొన్ని విషయాలు ఎప్పుడూ చికాకు పెడుతుంటాయి. అది మీకు మీరే కొని తెచ్చుకున్న సమస్యల వల్లేనని తెలుసుకోండి. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయండి. బద్ధకంగా జీవితమంతా దొర్లిపోతే, ఆ జీవితాన్ని చూసుకొని మీకే అసహ్యం కలుగుతుందని గ్రహించండి. అంతకుముందే మీదైన శ్రమనంతా వెచ్చించి ఒక దారిని ఏర్పరచుకోండి. ప్రేమ జీవితం బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : వెండి 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈవారమంతా చాలా సంతోషంగా గడుపుతారు. ఊహించని విజయమొకటి మీ సొంతమవుతుంది. ఈ విజయం కోసమే చాలాకాలంగా ఎదురుచూస్తున్న మీకు రాబోయే రోజులన్నీ ఓ కలలా కనిపిస్తాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. గతంలో జరిగిన తప్పుల గురించి ఈరోజు ఎంత ఆలోచించినా అది వృథా అని తెలుసుకోండి. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే అవకాశమొకటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : పీచ్‌ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
జీవితం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఒక బలమైన పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని తెచ్చిపెడుతుంది. ఇలాంటి పరీక్షలను ఎదుర్కొంటేనే ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుందని తెలుసుకోండి. వృత్తి జీవితం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరంతరం ఖాళీ అన్నదే లేకుండా గడపాల్సిన పరిస్థితి వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఈవారంలో మీ జీవితానికి ఎంతో కీలకమైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని తెలుసుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : గులాబి 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు

కుడి ఎడమైతే

ఆ సమయంలో నొప్పి రాకుండా ఉండాలంటే...

మా ఆయన అపరిచితుడు

లైట్‌ హౌస్‌

ద్వారకామాయి

చక్కటి చుక్కలా

బ్యాంకులో ఓ రోజు

దేశ విభజనని శపించిన రాజర్షి

గ్రాముల్లో తిని.. కేజీల్లో పెరుగుతున్నారా?

కరెంట్‌ తీగ

నాకు ఈ యుద్ధం వద్దు బావా!

3ఎస్‌

అత్తమ్మ

జీవితం

తల్లి

అనుమానాస్పదం

తల్లి మనసు

దోదో!

సదాశివా...చంద్రమౌళి!

బిడ్డ చాటు తల్లి

మిల మిల మెరిసే మీనాక్షి!

 వారఫలాలు

హత్యా?ఆత్మహత్యా?

ఈ సమయంలో బరువు పెరగొచ్చా?

రెండ్రూపాయలు

ప్రేమికుడు

సాయి వాణి యదార్థ భవిష్యవాణే

మృదువైన మెరుపు

డాడీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ

ఆ బాధ ఇంకా వెంటాడుతోంది: కాజల్‌

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే