వారఫలాలు

27 May, 2018 01:11 IST|Sakshi

27 మే నుంచి 2 జూన్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలిం^è దు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత నిరాశ. తీర్థయాత్రలు చేస్తారు. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయకుని అర్చనలు చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక ప్రగతి  ఉంటుంది. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. గులాబీ, నేరేడురంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సా«ధిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. విద్యార్థుల  శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు  పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.  కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. తెలుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్న పనుల్లో ఆటంకాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. తీర్థయాత్రలు చేస్తారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు  చేజారవచ్చు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. కళారంగం వారికి కొత్త ప్రయత్నాలలో అవాంతరాలు. వారం ప్రారంభంలో విందువినోదాలు. ఆస్తి లాభ సూచనలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు ఏర్పడి కొంత చికాకు పరుస్తాయి. ధైర్యంగా ఎదుర్కోండి. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది, కొంత జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. విస్తరణయత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువర్గం నుంచి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనలాభం. విందువినోదాలు. ఎరుపు, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న పనులు పూర్తయ్యే వరకూ విశ్రమించరు. కొత్త మిత్రుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.  కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. కొన్ని నిర్ణయాలు కుటుంబసభ్యుల ఆమోదం పొందుతాయి.  వ్యాపారాలలో అనుకోని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం చివరిలో అనారోగ్యం. శ్రమ తప్పదు. నలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేతనీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు. కళారంగం వారికి నిరుత్సాహం. వారం చివరిలో విందువినోదాలు. ఆకస్మిక ధనలాభం. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (27 మే నుంచి  2 జూన్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈ వారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడుపుతారు. కొన్ని అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటారు. ఇది మీకు ఏమాత్రం మంచిది కాదని తెలుసుకోండి. జీవితాశయానికి సంబంధించి ఓ కీలక∙నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి పడుతుంది. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న చిన్న గొడవలు జరిగినా, వాటికి ఎదురెళ్లి నిలబడి సంతోషాన్ని వెతికి పట్టుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : నీలం 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మనకెంతో ఇష్టమైన కొన్ని విషయాలకు ఈరోజు దూరంగా ఉన్నా, ఏదోక రోజు దగ్గరవుతామని కష్టపడటమే జీవితం. మీ ఇష్టాన్ని వెతుక్కుంటూ ఉత్సాహంగా ఉంటారు. ఈవారం నుంచే అందుకు తగ్గ ప్రయత్నాలు మొదలుపెడతారు. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నా, మీరు ప్రేమించే వ్యక్తిని పూర్తిగా నమ్మి ముందుకెళతారు. కాలం మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న సమాధానాలను మెల్లిగా చెబుతూ వస్తుంది. వృత్తి జీవితం బాగుంటుంది. కొత్త బాధ్యతలు మీద పడతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ఓ శుభవార్త వింటారు. ఏ పని చేయడానికైనా ఆత్మవిశ్వాసంతో వేసే మొదటి అడుగు గొప్పదని తెలుసుకోండి. కొన్ని సందర్భాల్లో మీ స్థాయికి తగ్గ విజయం అందకపోయినా నిరాశలో కూరుకుపోకుండా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉండండి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. కొన్ని అనవసర ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది. వ్యాయామానికి ఎప్పుడూ దూరం కాకండి. 
కలిసివచ్చే రంగు : గులాబి 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
చాలాసార్లు కాలం మన స్థాయికి తగ్గ అవకాశాలను ఇవ్వకుండానే ముందుకెళ్లిపోతుంది. అయినప్పటికీ మీ పని మీరు చేస్తూ పోవడమే గొప్పదనం. ఆర్థిక సమస్యలు తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మీకిష్టమైన వ్యక్తి మీ పక్కనే ఉండటం ఈ సమయంలో ఒక గొప్ప ఊరట. ప్రేమ జీవితం బాగుంటుంది. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ చుట్టూ ఉండటం మీ అదృష్టం. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు.
కలిసివచ్చే రంగు : వెండి 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఈవారం ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఒక్కోసారి ఏ అవసరం లేకుండా లెక్కలేనన్ని దూరాలు ప్రయాణిస్తాం మనం. ఆ దూర ప్రయాణాలన్నీ వ్యక్తిత్వాన్ని బలపరిచేవి, ముందుకు నడిపించేవి. త్వరలోనే మీకిష్టమైన వ్యక్తితో మీరు సాగించే ప్రేమ ప్రయాణం మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తి జీవితం బాగుంటుంది. ప్రతిరోజూ వ్యాయామం, ధ్యానం చేస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈవారం మీ జీవితాన్ని మలుపు తిప్పే ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. అతికొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తికి బాగా దగ్గరవుతారు. ఆర్థిక పరిస్థితి కాస్తంత గందరగోళంగా ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ప్రేమ జీవితం ఎప్పట్లానే బాగుంటుంది. మీకిష్టమైన వ్యక్తి అన్ని సందర్భాల్లో మీ పక్కనే ఉండటం మీ అదృష్టం. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బరువు తగ్గడానికి కూడా ఇదే సరైన సమయమని తెలుసుకోండి. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఈవారం వృత్తి జీవితంలో ఒక కొత్త మార్పును చూస్తారు. ఊహించని స్థాయిలో మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న పదవిని అలంకరిస్తారు. కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురైనా అన్నింటికీ నిలబడి విజయం సాధిస్తారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మిమ్మల్ని ఇష్టంగా ప్రేమించే వ్యక్తిని ఎప్పటికీ వదులుకోకండి. ఈవారం వారి దగ్గర్నుంచి అందే ఓ బహుమతి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : గులాబి 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ప్రేమ మిమ్మల్ని నిరంతరం మీలా ఉంచే ఒక గొప్ప అదృష్టం. ఆ ప్రేమను ఎప్పటికీ మీ చుట్టూనే ఉంచుకోండి. కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురైనా ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాదాసీదాగా ఉంటుంది. వారం చివర్లో ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. యోగా, ధ్యానం లాంటివి దినచర్యగా అలవాటు చేసుకోండి. మీ గురించి తప్పుగా మాట్లాడేవాళ్లు మీ చుట్టూ ఉన్నారు. వాళ్లకు వీలైనంత దూరంగా ఉండండి. 
కలిసివచ్చే రంగు : బూడిద 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
కొన్ని విషయాలు మీరెంత బాగా చేయగలరన్న నమ్మకం ఉన్నా, అతివిశ్వాసం పనికిరాదని తెలుసుకోండి. మీదైన స్థాయికి తగ్గ ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. జాగ్రత్తగా, చిత్తశుద్ధితో పనిచేయండి. ప్రేమ జీవితంలో కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. వాటికి ఎదురెళ్లి నిలబడి మీ ప్రేమను నిలుపుకుంటారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : ఎరుపు 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
జీవితంలో చాలాసార్లు ఒక దగ్గర ఆగిపోయి, ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారోనని ఆలోచిస్తాం. ఆ ఆలోచనకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీదైన ఆత్మవిశ్వాసంతో విజయంపై ధీమాతో, చేసే ప్రతిపనినీ ఇష్టంగా చేస్తూ వెళ్లండి. వారం చివర్లో ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు శారీరక శ్రమ చాలా అవసరమని గ్రహించండి. ఆర్థిప పరిస్థితి బాగుంటుంది. కొత్త పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తారు. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మీ చుట్టూ ఉండేవాళ్లను ఎప్పుడూ సంతోషంగా ఉంచే స్వభావం మీది. అది మీకు ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్నిచ్చే అంశం. దానికి ఎప్పుడూ దూరం కాకండి. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఇంత సంతోషంగా ఇంకెప్పుడూ ఉండరేమో అన్నట్టుగా మీకిష్టమైన వ్యక్తితో సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. వారం చివర్లో విహారయాత్ర సూచనలు కనిపిస్తున్నాయి. 
కలిసివచ్చే రంగు : గోధుమ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ప్రేమ జీవితం మిమ్మల్ని నిత్య నూతనంగా ప్రపంచానికి ఆవిష్కరించి చూపుతుంది. సంతోషంగా బతకాలంటే ముందు ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్లేందుకు మార్గాన్ని అన్వేషించాలని తెలుసుకోండి. వారం చివర్లో కొన్ని అనవసర ఖర్చులు చేస్తారు. కొన్నిసార్లు గతాన్ని గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదని తెలుసుకోండి. ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ సమయానికి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మీరూ సిద్ధంగా ఉండండి. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’