వారఫలాలు

10 Jun, 2018 02:21 IST|Sakshi

10 జూన్‌ నుంచి 16 జూన్‌ 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉత్సాహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో గతం నుంచి నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబి, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధల నుంచి బయటపడతారు. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న కోర్సులు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఉత్సవాలకు హాజరవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. గులాబి, నేరేడు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. పరపతి పెరుగుతుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా కొనసాగుతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. వ్యూహప్రతివ్యూహాలతో ఎదుటవారిని విస్మయపరుస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారి ఆశయాలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబి, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసహకారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో కలహాలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వాహనయోగం. బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. రాజకీయవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి సమస్యలు. గులాబి, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యస్తుతి మంచిది.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యవహారాలలో  విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో కుటుంబసమస్యలు. ఆరోగ్యభంగం. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. 

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనులు క్రమేపీ పుంజుకుంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. శ్రమ పెరుగుతుంది. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే కాస్త మెరుగుపడుతుంది. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. శుభకార్యాల నిర్వహణపై బంధువులతో చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి అవార్డులు రావచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. నేరేడు,పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (10 జూన్‌ నుంచి 16 జూన్, 2018 వరకు)

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారం మీ వృత్తి జీవితంలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఒక గొప్ప అవకాశాన్ని సొంతం చేసుకుంటారు. ఎప్పట్నుంచో మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చెయ్యాలని కలలుగంటున్న మీకు ఇప్పుడిప్పుడే అందుకు వేదిక దొరుకుతుంది. విహార యాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. అయితే చివరి నిమిషంలో వాయిదా వేసుకునే పరిస్థితులు వస్తాయి. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : ఎరుపు 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే ఒక్కోసారి మనం వేసే అడుగులు మనల్ని ముందుకు నడిపిస్తాయి. మిమ్మల్ని మీరు నమ్మి ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. మీ శ్రమనంతా వెచ్చించి మీకిష్టమైన పని చేసుకుంటూ వెళ్లండి. విజయం మీకు దగ్గర్లోనే ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా అన్నివిధాలా సహకరిస్తుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరిష్టపడే వ్యక్తి దగ్గర్నుంచి అందే ఓ బహుమతి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. వృత్తి జీవితంలో కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఈవారమంతా ఉత్సాహంగా గడుపుతారు. మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అవకాశాలు మీ ముందొచ్చి వాలిపోతాయి. ఆ అవకాశాల్ని అలా అందిపుచ్చుకొని మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఏది జరిగినా మన మంచికే జరుగుతుందన్న ఆలోచనను ఎప్పటికీ మరిచిపోకండి. ఒక కొత్త వ్యక్తి పరిచయమవుతారు. ఆ వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : పసుపు 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
కొన్నిసార్లు అంతా సజావుగా సాగిపోతోంది కదా అని చెప్పి గొప్ప అవకాశాలను కోల్పోతాం మనం. ఈవారం మీరు ఊహించని ఒక అవకాశం మీ తలుపు తడుతుంది. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. అందుకు మీకొక వేదిక కూడా దొరుకుతుంది. వారం చివర్లో ఒక శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితిలో గొప్ప మార్పులేం కనిపించడం లేదు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. వ్యాయామాన్ని ఎలాంటి సందర్భాల్లోనూ దూరం చేసుకోకండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తితో, మీకిష్టమైన ప్రదేశానికి విహారయాత్రకు వెళ్లే ఆలోచన చేస్తారు. 
కలిసివచ్చే రంగు : పీచ్‌ 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఈ వారమంతా చాలా ఉత్సాహంగా గడుపుతారు. జీవితమంటే మనం అన్నీ అనుకున్నట్టు జరగడం కాదని తెలుసుకుంటారు. ఈ ఆలోచన మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. ఒక కొత్త వ్యక్తి పరిచయమవుతారు. ఆ వ్యక్తికి తక్కువ కాలంలోనే బాగా దగ్గరవుతారు. ప్రేమ మిమ్మల్నొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి వదిలిపెడుతుంది. వారం చివర్లో కొన్ని అనుకోని సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సవాళ్లకు ఎదురెళ్లి నిలబడి పోరాడతారు. కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : వయొలెట్‌ 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈవారం కొన్ని అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. చేపట్టిన పనులు కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి. ఇలాంటి పరిస్థితి జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుందన్నది మీరు తెలుసుకోవాలి. వీటికి ఎదురెళ్లి నిలబడితేనే అది జీవితమని నమ్మండి. మీకిష్టమైన వ్యక్తి అన్ని సమయాల్లోనూ అండగా నిలబడతారు. అది మీకు కొండంత ధైర్యాన్నిస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ప్రేమ జీవితం ఎప్పట్లానే సజావుగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : బూడిద 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
గొప్ప జీవితానికి ఒక్కొక్కరూ ఒక్కొక్క నిర్వచనం ఇస్తారు. మనకేది గొప్పదన్న విషయం మనకు మాత్రమే తెలుసు. ఈ ఆలోచనను నమ్మి, మీకిష్టమైన పనిచేసుకుంటూ ముందుకెళతారు. ఇది మీకు గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుంది. వరుసగా అవకాశాలను కూడా తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు విజయాన్ని ఆస్వాదించడానికి కూడా మన ఆలోచనలకు ఒక నిర్మాణం ఉండాలి. మీరెంతగానో ఇష్టపడ్డ వ్యక్తికి మీకు అన్ని విషయాల్లోనూ అండగా నిలబడతారు. వారి సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
కొద్దికాలంగా మీ జీవితం ఒకే దగ్గర ఆగిపోయినట్టు, మీరు కోరుకున్న ప్రపంచాన్ని అది ఆవిష్కరించి చూపనట్టు భావిస్తున్నారు. ఇలాంటి ఒక పరిస్థితిని దాటొచ్చాక పొందే విజయానికి గొప్ప విలువ ఉంటుందని తెలుసుకోండి. మీ శక్తినంతా కూడగట్టుకొని జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటికీ ఎదురెళ్లి నిలబడతారు. వారం చివర్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వ్యాయామాన్ని ఎప్పుడూ దూరం చేసుకోకండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : వయొలెట్‌ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
మీరెప్పటికైనా చేరుకొని తీరాల్సిన గమ్యం ఎప్పటికీ ఒకటి ఉంటూనే ఉండటమే జీవితం. అలాంటి గమ్యానికి చేరువయ్యే క్రమంలో ఈ ప్రయాణాన్నంతా ఆస్వాదించడం మీకు అలవాటవ్వాలి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రేమ జీవితం మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. మీరెప్పట్నుంచో కంటున్న ఒక కల ఈవారమే సాకారమయ్యే దిశగా వెళుతుంది. 
కలిసివచ్చే రంగు : నలుపు 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారమంతా ఊహించనంత సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం మిమ్మల్నొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించండి. కష్టపడి పనిచేస్తే ఎలాంటి పరిస్థితులున్నా విజయాన్ని చేరుకోవచ్చని నమ్మండి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. గతాన్ని గురించి ఎంత ఆలోచించినా అది మిమ్మల్ని వెనక్కే తప్ప ముందుకు తీసుకెళ్లదని తెలుసుకుంటారు. మీరెప్పట్నుంచో చూడాలని కలలుగంటున్న చోటుకు వెళ్లి మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటారు. 
కలిసివచ్చే రంగు : తెలుపు 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఒక్కోసారి ఎంత గొప్ప విజయమైనా ఇవ్వాల్సిన ఆనందాన్ని ఇవ్వదు. అదంతా మన ఆలోచనలకు సంబంధించిన విషయం అన్నది మీకు తెలియాలి. మన ఆలోచన గొప్పదైదే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషంగా బతకడాన్ని అలవాటు చేసుకుంటాం. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీలో ఇలాంటి ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. ఆ వ్యక్తికి మీకే తెలీకుండా ఊహించనంత దగ్గరవుతారు. మీ ప్రతిభకు తగ్గ అవకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఆత్మవిశ్వాసంతో చేసే పనులు కొన్నిసార్లు విజయతీరాలకు చేరకున్నా, ఆత్మసంతృప్తిని ఇస్తాయి. జీవిత ప్రయాణంలో ఇలాంటివే మనల్ని నిరంతరం సంతోషంగా ఉంచే విషయాలు. ఈవారం ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త వ్యాపార ఆలోచన చేస్తారు. మిమ్మల్ని సంతోషంగా ఉంచే వ్యక్తుల్లో ముందు ఎవరైనా ఉన్నారంటే అది మీరే అని నమ్మండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు ప్రేమించే వ్యక్తితో అన్ని సందర్భాల్లోనూ నిజాయితీగా ఉండండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : నీలం 
ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’