వారఫలాలు

8 Jul, 2018 01:16 IST|Sakshi

8 జూలై నుంచి 14 జూలై 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల ఆశలు ఫలించే సమయం. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఇతరులకు సైతం సాయపడతారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సహాయంతో అనుకున్న పనులు చక్కదిద్దుతారు. మీలోని సేవాభావం అందరూ గుర్తిస్తారు. ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు కలసివస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఎరుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. మాటలతో అందర్నీ ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కాస్త బయటపడతారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులు పరిచయమవుతారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అంది ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబి, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సా«ధిస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి సత్కారాలు, అవార్డులు. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో తగాదాలు. ఎరుపు, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఇబ్బందులు అధిగమించి ముందడుగు వేస్తారు. అనుకున్న విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి మాటసహాయం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ప్రముఖుల పరిచయం. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి ఊరట లభిస్తుంది. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో సోదరులతో కలహాలు. అనారోగ్యం. గులాబి, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభవెలుగులోకి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువర్గంతో తగాదాలు. గులాబి, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ప్రారంభంలో వ్యతిరేక పరిస్థితులు క్రమేపీ మారతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అందరిలోనూ మంచి గుర్తింపు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి  మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. నీలం, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఇంటి నిర్మాణంపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. పనులు నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగులకు కాస్త నిరాశ తప్పకపోవచ్చు. వాహన  కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పసుపు, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు 

టారో(8 జూలై నుంచి  14 జూలై, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఉత్సాహంతో ఉరకలేస్తారు. వారం ప్రారంభం నుంచే శుభసూచనలు మొదలవుతాయి. దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వగల కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా దేనికీ లోటు లేని పరిస్థితిని ఆస్వాదిస్తారు. ఇంటా బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల నడుమ అనుబంధాలు బలపడతాయి. సృజనాత్మక రంగాల్లో కొనసాగే వారి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికే కొత్త అవకాశాలు అనూహ్యంగా అందివస్తాయి. కొత్తగా నేర్చుకునే విద్యలు మెరుగైన భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
గందరగోళ పరిస్థితుల్లో భావోద్వేగాలకు లోనవుతారు. అగమ్యంగా గోచరించే సమస్యలపై మరింత స్పష్టత కోరుకుంటారు. భవిష్యత్తుపై నమ్మకం సడలిపోయిన స్థితిలో తలపెట్టిన పనులకు రాబోయే ఫలితాలను ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. అనవసర గందరగోళ పరిస్థితులను అధిగమించి, అంతరాత్మ ప్రబోధం మేరకు ముందుకు సాగడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో కృషికి తగిన గుర్తింపు రాకపోవడం కుంగదీస్తుంది. అయితే, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కీలకమైన ఆస్తి లావాదేవీలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు.
లక్కీ కలర్‌: మీగడ రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
గెలుపు చేరువలోనే ఉన్నదన్న భావన మిమ్మల్ని ఊరిస్తూనే ఉంటుంది. ఆశించిన విజయం సత్వరమే అందిరాకపోవడం చికాకు కలిగిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి ప్రణాళికాబద్ధంగా తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి నుంచి తగిన ప్రోత్సాహం కరువవుతుంది. ఆశాభంగాలు ఎదురైనంత మాత్రాన కుంగిపోకుండా ముందుకు సాగండి. తలపెట్టిన పనులను పట్టుదలతో కొనసాగించండి. పరిస్థితులు వాటికవే సర్దుకుంటాయి. వారాంతానికల్లా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో కొంత సాంత్వన కలుగుతుంది.
లక్కీ కలర్‌: నీలం

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఆత్మీయులతో అనుబంధాలు బలపడతాయి. తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటారు. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా సంయమనంతో పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. చిరకాలంగా కోరుకుంటున్న విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కాలం శరవేగంగా పరుగులు తీస్తోందా అన్నట్లుగా సాగుతుంది. ఇంటా బయటా కార్యక్రమాలతో బాగా తలమునకలవుతారు. తీరిక కోసం ఆరాటపడతారు.
లక్కీ కలర్‌: నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ప్రేమను కోరుకుంటారు. కొత్త అనుబంధాల కోసం అర్రులుచాస్తారు. మిమ్మల్ని ఆశ్చర్యపరచే సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆచి తూచి ముందుకు సాగినట్లయితే ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు తోడవుతారు. ఈ పరిణామం మీ జీవితంలోనే కీలకమైన మార్పులకు దారితీస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో తొందరపడకుండా సంయమనం పాటించడం మంచిది. పిల్లలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఆహార విషయాల్లో మార్పులు అవసరమవుతాయి.
లక్కీ కలర్‌: లేత నారింజ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నమ్మకమైన ఒక వ్యక్తి తోడు కోరుకుంటారు. అలాంటి నమ్మకమైన మిత్రుల్లో ఒకరి నుంచి మీకు సకాలంలో గట్టి సాయం లభిస్తుంది. సమస్యలు గట్టెక్కడానికి తగిన సలహాలు ఇచ్చే తోడు దొరుకుతారు. అనుకూలత లేనప్పుడు ఒక అడుగు వెనక్కు వేసినంత మాత్రాన కోల్పోయేదేమీ ఉండదని, అదను చూసి ముందుకు సాగడం మంచిదని తెలుసుకుంటారు. ఆత్మ పరిశీలనకు తగిన సమయం కేటాయించుకుంటారు. పరిస్థితులను ఆకళింపు చేసుకుని ఆచి తూచి వ్యవహరిస్తారు. త్వరలోనే ఒక శుభవార్త తెలుసుకుంటారు.
లక్కీ కలర్‌: నారింజ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
కష్టించి నిర్మించుకున్న కలల ప్రపంచం కుప్పకూలిపోవచ్చని దిగులు చెందుతారు. ఆకస్మికంగా తలెత్తే మార్పులను, అంతరాయాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక గందరగోళంలో కూరుకుపోతారు. అప్రమత్తంగా లేకుంటే వెన్నుపోట్లు, నమ్మకద్రోహాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. సమస్యలన్నీ సమసిపోతే బాగుంటుందని భావిస్తారు. అయితే, అన్నీ అనుకున్నట్లే జరగవు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి కీలక నిర్ణయాలూ తీసుకోవద్దు. కాల పరీక్షను తట్టుకుని ధైర్యంగా నిలవండి. నెమ్మదిగా సమస్యలు దూరమవుతాయి. పరిస్థితులు తిరిగి అదుపులోకి వస్తాయి.
లక్కీ కలర్‌: నలుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
చిరకాల వాంఛ ఒకటి నెరవేరుతుంది. అదృష్టం కలసి వస్తుంది. జీవితంలో కొత్త మార్పులు మొదలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూలమైన మార్పులు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. సుదూర ప్రాంతాల్లో విహార యాత్రలు చేస్తారు. ఇల్లు, స్థిరాస్తులు, వాహనాలు, ఆభరణాల కొనుగోలుకు పూర్తిగా అనుకూలమైన కాలం. వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు బాగుంటాయి. ఉత్సాహంతో కొత్త కొత్త పనులు చేపడతారు. సహజమైన మీ ఆకర్షణ శక్తితో ఇతరులను ప్రభావితం చేస్తారు. 
లక్కీ కలర్‌: ఎరుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
శక్తికి మించిన లక్ష్యాలను పెట్టుకుంటారు. వీటి వల్ల విజయ సాధనలో విపరీతమైన ప్రయాస, కొంత జాప్యం తప్పకపోవచ్చు. పూర్తి సానుకూల దృక్పథంతో, సడలని పట్టుదలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అధికార దుర్వినియోగానికి పాల్పడితే సమస్యలు తప్పకపోవచ్చు. ఆచి తూచి అధికారాలను ఉపయోగించడం మంచిది. పలుకుబడి గల వ్యక్తులు మీ సాయం కోరి వస్తారు. వారిని నిరాశపరచకండి. అలాగని వారికి మీపై పెత్తనం చలాయించే అవకాశం కూడా ఇవ్వకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరమవుతాయి. విశ్రాంతి కోసం పరితపిస్తారు.
లక్కీ కలర్‌: పసుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
పరిస్థితులను సింహావలోకనం చేసుకోవలసిన సమయం ఇది. జీవితంలోని ఒక క్లిష్టమైన దశ ముగిసిపోతుంది. సరికొత్త అవకాశాలు మీకు స్వాగతం పలుకుతాయి. నిరాకరించ వీలులేని ఒక మహత్తర అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అద్భుత విజయాలను సాధిస్తారు. కలలు కన్న ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ధ్యానం ద్వారా మానసిక ఉద్వేగాల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో భవిష్యత్తుపై దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుంటారు.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఏకాంతం కోరుకుంటారు. ఏకాంతంలో జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటారు. ప్రశాంతంగా ఆత్మవిమర్శ చేసుకుంటారు. మరేమీ ఫర్వాలేదు. అపరిష్కృత సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. ఆందోళనలు, ఉద్వేగాల నుంచి ఊరట లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటిస్తే చాలు. జీవితం తిరిగి గాడిలో పడుతుంది. ఒంట్లో నలతగా ఉండవచ్చు. విశ్రాంతి తీసుకోవడం తప్పకపోవచ్చు. కొత్త విద్యలను నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు.
లక్కీ కలర్‌: లేత గోధుమ రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీ అంతట మీరే చిక్కులు కొని తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. ఇతరులకు మీపై పెత్తనం చలాయించే పరిస్థితులను మీరే కల్పిస్తారు. స్వయంకృతాపరాధాల ఫలితంగా మానసిక వేదనకు లోనవుతారు. మరీ స్వార్థపూరితంగా వ్యవహరించడం గాని, ఇతరులను మభ్యపెట్టే ప్రయత్నాలు గాని చేసినట్లయితే సమస్యలు రెట్టింపవుతాయి. పారదర్శకత పాటించండి. సంయమనాన్ని కోల్పోకండి. ఇంట్లో మార్పులు చేపడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో దక్కే స్వల్ప విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
లక్కీ కలర్‌: ఊదా
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం