వారఫలాలు : 14 జనవరి నుంచి 20 జనవరి 2018 వరకు

14 Jan, 2018 01:19 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి అనుకూలించినా రుణదాతల ఒత్తిడులు తప్పవు. మీ వ్యూహాలకు ప్రత్యర్థులు కంగుతింటారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. విద్యార్థులకు నూతన సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలలో అడుగు ముందుకేస్తారు. ఉద్యోగస్తులు సత్తా చాటుకుంటారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అనుకోని ఆహ్వానాలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. పసుపు, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రో ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఏర్పడినా అవసరాలు తీరతాయి. నిరుద్యోగుల యత్నాలలో కదలికలు. వివాహాది శుభకార్యాలపై చర్చలు. ఇంటి నిర్మాణం, వాహనాల కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయ, కళారంగాల వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. సోదరులతో వివాదాలు. గులాబి, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. ఐటీ, కళారంగాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కార్యోన్ముఖులై అనుకున్నది సాధిస్తారు. అందరి ప్రశంసలు అందుకుంటారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యుల ఆమోదం పొందుతాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. నీలం, ఎరుపు రంగులు దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు కుదురుతాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు అనూహ్యమైన రీతిలో అవకాశాలు రాగలవు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. ఎరుపు, ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. నిర్ణయాలలో కుటుంబసభ్యుల సలహాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. ఒక కోర్టు వ్యవహారం పరిష్కారమవుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు పదవులు రావచ్చు. వారం చివరిలో అనారోగ్యం. వ్యయప్రయాసలు. గులాబి, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆలోచనలు కలసిరావు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు. విద్యార్థులు మరింత శ్రమపడాలి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి. వ్యాపారులకు పెట్టుబడుల్లో నిరుత్సాహం. ఉద్యోగవర్గాలకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి కొంత గందరగోళమైన పరిస్థితి ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నీలంరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్టలు పెరుగుతాయి. స్తిరాస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు భారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న విధంగానే పనులు పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. మీ అంచనాలు, ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థులు కార్యసాధకులై ముందడుగు వేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగులకు శుభవార్తలు. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. శ్రమాధిక్యం. గులాబి, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వ్యవహారాలు కొంత జాప్యమైనా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలలో చికాకులు అధిగమిస్తారు. మీలోని ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు రాగలదు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగలాభం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందవచ్చు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కార్యజయంతో ముందుకు సాగుతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సూచనలు పాటించి విజయాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. నలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే సమయం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఒక లేఖ ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు మీ గమ్యాన్ని మారుస్తాయి. విద్యార్థుల ప్రతిభ బయటపడుతుంది. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు తొలగుతాయి. ఇష్టమైన వ్యక్తులు మరింత దగ్గరవుతారు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో అనుకోని ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు

ఎవరో చూస్తుంటారు

వేడి ఆవిర్లు వస్తున్నాయి

చక్రపాణి ఇంద్రలోక యాత్ర

మూగపిల్ల

సహజమైన సౌందర్యం

దాస్యభక్తితో తరించిన ధన్యులు

చిత్రకుటీర్‌

చందమ్మమ్మ

ప్రేమ పునరుత్థానం

ఐకమత్యమే జాతికి శ్రీరామరక్ష...

ఐస్‌క్రీమ్‌ ర్యాగింగ్‌

అతడు సర్వాంతర్యామి

బొంగరాలకళ్ల బాపు బొమ్మా!

వారఫలాలు

పిస్టోలు దొంగ

నీటి  బుడగల వల్లేనా... 

కోటమామ కూతురు

భారత వర్షం

సాయి సన్నిధిలో శరీరత్యాగం చేసిన ముభక్తులు

కళ్లు చెదిరే అందం

మేడ

ఆశ్రిత  వత్సలుడు

శిశిరానికి సెలవిచ్చా...

మహా అమరవీరుడు

కవర్‌ స్టోరీ : జై భీమ్‌..

ఛత్తీస్‌గఢ్‌ ఎఫెక్ట్‌!

ఈ రెండు కోరికలు తక్క!

ఆపరేషన్‌ కాదంబిని

మేమేం చేయాలి?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు రిషి, రైటర్‌ స్వాతిల నిశ్చితార్థం

అక్కడా మీటూ కమిటీ

మరోసారి జోడీగా...

కాపాడేవారెవరు రా?

రాణి పూంగుళలి

గ్యాంగ్‌ వార్‌