వారఫలాలు

5 Aug, 2018 02:47 IST|Sakshi

5 ఆగస్టు నుంచి 11 ఆగస్టు 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కార్యదీక్ష, ఉత్సాహంతో ముందడుగు వేసి కొన్ని విజయాలు సాధిస్తారు. ప్రముఖ వ్యక్తులు సహాయపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు, హోదాలు లభించవచ్చు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. కుటుంబసమస్యలు. తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
పూర్వపు మిత్రులు తారసపడతారు. యుక్తితో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో రాజీపడతారు. కుటుంబంతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. బంధువుల నుంచి ధనలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఇబ్బందులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. పనులు ముందుకు సాగవు. లేత ఎరుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆశ్చర్యపరుస్తాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊహించని రీతిలో లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. బంధువులతో వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. ఒక సమస్య నుంచి చాకచక్యంగా బయటపడతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో సోదరులతో కలహాలు. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. ఆప్తులు మరింతగా సహకరిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. చాకచక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వేడుకలు,సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఊహించిన ప్రగతి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు చకచకా సాగుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. తెలుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. జీవితాశయం సాధించే దిశగా ముందడుగు వేస్తారు. వాహనయోగం. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలం. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో కలహాలు. పసుపు, లేత ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. అరుదైన ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు తథ్యం. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త విషయాలు గ్రహిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. దీర్ఘకాలిక ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహన, గృహయోగాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. చిన్ననాటి మిత్రులు తారసపడతారు. వారితో ఆనందాలను పంచుకొంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఊహించని విధంగా ప్రమోషన్లు స్వీకరిస్తారు. కళారంగం వారికి శుభవార్తలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని పూజించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే క్రమేపీ అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. రావలసిన డబ్బు అందుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థుల చిరకాల కోరిక నెరవేరే సమయం. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు, భూములు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని నిర్ణయాలు మీ సమర్థతను చాటుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి విషయాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఒక ఆహ్వానం మరింత సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాల యత్నాలు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిడులు. నేరేడు, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ధైర్యంగా ఇబ్బందులను ఎదుర్కోవాలి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. బంధువులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో విందువినోదాలు. ధన, వస్తులాభాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(5 ఆగస్టు నుంచి  11 ఆగస్టు, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
చేపట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. గొప్ప సంతృప్తిని, సంతోషాన్ని అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయులపై మీరు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదు. అదృష్టం నీడలా మిమ్మల్నే అనుసరిస్తుంది. మనసులో ఏ మాటా దాచుకోని మీ అలవాటు కారణంగా చాలామంది మీకు సన్నిహితులవుతారు. నాయకత్వ లక్షణాలను చాటుకుంటారు. ఇతరులను ప్రభావితం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆనందం అంచులు చూస్తారు. 
కలిసివచ్చే రంగు : తెలుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
వృత్తి ఉద్యోగాల్లో మీ ఎదుగుదలకు వయోధిక వ్యక్తి ఒకరు లేదా ఒక ఉన్నతాధికారి బాగా దోహదపడతారు. మీ శక్తి సామర్థ్యాలతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముందస్తు ప్రణాళికలేవీ లేకుండానే దూర ప్రయాణాలు చేస్తారు. పని ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందుతారు. అంచనాలకు మించిన ఆర్థిక లాభాలు పొందుతారు. చాలాకాలంగా నలుగుతూ వస్తున్న ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సేవా కార్యక్రమాలకు సాయం చేస్తారు. కొత్త ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేస్తారు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. 
కలిసివచ్చే రంగు : ముదురు నారింజ

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఇదివరకు మీరు చేసిన పనులకు సంబంధించిన ఆదాయం త్వరలోనే చేతికి అందుతుంది. ఆస్తులు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఊహించని అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. ఇంట్లోను, కార్యాలయంలోను మార్పులు చేపడతారు. ప్రేమ వ్యవహారాల్లో ప్రియతముల మధ్య అపార్థాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అనూహ్యమైన ఆదాయ అవకాశాలు లభిస్తాయి. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. దేవాలయాలను సందర్శిస్తారు.
కలిసివచ్చే రంగు : బంగారు రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. జీవితాన్ని మార్చేయగల అద్భుతమైన అవకాశం లభిస్తుంది. అనుకున్న పనులన్నీ అనుకున్నట్లే పూర్తి చేస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల్లో పెట్టబడులు పెడతారు. అదనపు వసతులు ఉన్న కొత్త ఇంటికి మారే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మందగించడం వల్ల తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. వైద్యుల సూచనలపై ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కలిసివచ్చే రంగు : ముదురు ఊదా

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
దూర ప్రాంతాల నుంచి ఒక సమాచారం అందుతుంది. దానివల్ల అకస్మాత్తుగా ప్రయాణానికి సిద్ధపడాల్సి రావచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఉన్నతా«ధికారుల ప్రశంసలు పొందుతారు. అధికారంతో కూడిన పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం కలిగే సూచనలు ఉన్నాయి. వినోదాలకు దూరంగా ఉండటం క్షేమం. మితిమీరిన పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగంలోని వారికి ప్రత్యర్థుల నుంచి సవాళ్లు ఎదురవుతాయి. ఆచి తూచి అడుగేయడం మంచిది.
కలిసివచ్చే రంగు : ముదురు పసుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
విదేశాల్లో ఉంటున్న ఒక వ్యక్తితో భాగస్వామ్యం ఏర్పరచుకుంటారు. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యం లాభసాటిగా ఉంటుంది. పని ఒత్తిడితో బాగా అలసట చెందుతారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. విమర్శలు తప్పకపోవచ్చు. దూకుడు తగ్గించుకోవడం మంచిది. చేజారిపోయే పరిస్థితుల్లో ఉన్న ప్రేమానుబంధాన్ని నిలుపుకోవడానికి త్యాగానికి సిద్ధపడాల్సి వస్తుంది. అహానికి పోవడం వల్ల లేనిపోని చిక్కులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. పాత జ్ఞాపకాలు వేధిస్తాయి. కాలమే గాయాలను మాన్పుతుంది. 
కలిసివచ్చే రంగు : ముదురు నీలం

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
వేడుకల్లో, విందు వినోదాల్లో ఉత్సాహభరితంగా పాల్గొంటారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన బాధ్యతలను నెరవేర్చుకుంటారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు. మార్పును స్వీకరించక తప్పదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను అధిగమిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. విహార యాత్రలకు వెళతారు. రుణభారం తీర్చుకుంటారు. నటనా రంగంలోని వారికి అద్భుతమైన అవకాశాలు కలసి వస్తాయి. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.
కలిసివచ్చే రంగు : ఊదా

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
చిరకాలం నాటి ఆకాంక్షలు నెరవేరుతాయి. సుదూర ప్రయాణాలకు వెళతారు. స్వయం అభివృద్ధి కోసం అహరహం శ్రమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కోసం ఆచి తూచి అడుగులు వేస్తారు. కొందరి ప్రవర్తన వల్ల మనస్తాపం చెందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రియతములకు కానుకలు ఇస్తారు. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు. పని ఒత్తిడి పెరిగి ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు పొందుతారు. విదేశాల నుంచి అనుకూల సమాచారం అందుకుంటారు.
కలిసివచ్చే రంగు : ఖాకీ రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆశించిన లక్ష్యాలను సాధించడానికి ఆచరణాత్మకంగా ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో నిక్కచ్చిగా వ్యవహరించి, ఫలితాలను రాబడతారు. ముక్కుసూటి ధోరణి కారణంగా రహస్య శత్రువులు తయారయ్యే అవకాశాలు లేకపోలేదు. ప్రేమికుల మధ్య అనుబంధాలు బలపడతాయి. పిల్లల కోసం సమయం కేటాయిస్తారు. కళా రంగంలోని వారికి సవాళ్లు ఎదురవుతాయి. పెట్టుబడులు పెట్టే ఆలోచనను ఈ వారం వాయిదా వేసుకోవడం మంచిది. బాకీలను వసూలు చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు.
కలిసివచ్చే రంగు : లేత ఊదా

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
నిరాశా నిస్పృహలను అధిగమిస్తారు. కార్యాచరణపై దృష్టి సారిస్తారు. మిత్రులను ఆదుకుంటారు. చాలాకాలం కిందట తలపెట్టిన గొప్ప సృజనాత్మక కార్యక్రమాన్ని ఆచరణలోకి తీసుకొస్తారు. ఇదివరకు మీరు ప్రేమించిన వ్యక్తి మీకు మళ్లీ తారసపడతారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. సహోద్యోగుల్లో ఒకరి కారణంగా చిక్కులు తప్పకపోవచ్చు. రహస్య శత్రువులు మిమ్మల్ని నేరుగా ఎదిరించలేక దొంగచాటుగా వదంతులు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మంచిది. పని ఒత్తిడి వల్ల అలసట పెరిగి, విశ్రాంతి కోరుకుంటారు. పెట్టుబడులకు అనుకూలమైన కాలం. ఆర్థిక పరిస్థితులు యథాతథంగా కొనసాగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. ప్రియతములతో నెలకొన్న అపార్థాలను పరిష్కరించుకుంటారు. ఓరిమితో ముందుకు సాగడం తప్ప వేరే మార్గం లేదని తెలుసుకుంటారు. ఒక దుర్వార్త ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పవిత్ర క్షేత్రాలను దర్శించుకుంటారు. దైవబలాన్ని నమ్ముకుంటారు. భావి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు.
కలిసివచ్చే రంగు : ముదురు ఎరుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అహంకారుల వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు. సర్దుకుపోయే లక్షణమే మిమ్మల్ని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇదివరకటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. విలువైన విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. చాకులు, కత్తులు వంటి పదునైన వస్తువులు వాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఇంటి అలంకరణలో మార్పులు చేపడతారు. కీలకమైన పనుల్లో మిత్రుల సాయం పొందుతారు. పలుకుబడి గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి.
కలిసివచ్చే రంగు : పసుపు
ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు