వారఫలాలు

19 Aug, 2018 01:27 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు వ్యవహారాలలో అవాంతరాలు చికాకు పరుస్తాయి. విద్యార్థులు , నిరుద్యోగులు ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో అకారణంగా తగాదాలు. కాంట్రాక్టర్లకు ఒత్తిడులు పెరుగుతాయి. నిర్ణయాలు కొన్ని మార్చుకోవల్సివస్తుంది. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరాశాజనకంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నారింజ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి మాటపడాల్సిన పరిస్థితి. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. రహస్య విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవం. రాజకీయవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం ప్రారంభంలో విందువినోదాలు. ధన, వస్తులాభాలు. నేరేడు, నీలం రంగులు.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పనుల్లో విజయం. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వాహనాలు, భూముల కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కళారంగం వారికి నూతన అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఆకుపచ్చ. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. ఒక దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారాల విస్తరణలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగాలలో మరింత పురోగతి. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వపరంగా చేయూత. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక విషయాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు ఎదుర్కోవల్సి ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో అనుకున్న అంచనాలు తప్పుతాయి. నిరాశ చెందకండి. విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన సమయం. మీ ప్రతిపాదనలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కాస్త మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. వారం ప్రారంభంలో శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో మెలకువ పాటించండి. ఇంటి నిర్మాణయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మార్పులకు అవకాశం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. వారం ప్రారంభంలో ధనలాభం. ప్రముఖుల పరిచయాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. కాంట్రాక్టర్లకు అవకాశాలు చేజారతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి శ్రమాధిక్యం. వారం మధ్యలో విందువినోదాలు. నూతన ఉద్యోగావకాశాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఒక వివాదం నుంచి చాకచక్యంగా బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. పసుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామిని పూజించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. బంధువుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు తప్పవు. ఆరోగ్యపరంగా చికాకులు. వాహనచోదకులు మెలకువ పాటించాలి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. కళారంగం వారికి అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల ఆదరణ పొందుతారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. వాహనయోగం. ఒక సమాచారం ఊరటనిస్తుంది.  ప్రముఖులతో చర్చలు జరుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో వివాదాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. గులాబీ, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చన మంచిది.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అనుకున్న పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో మంచీచెడ్డా విచారిస్తారు. సంఘంలో విశేష  గౌరవం. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాల విస్తరణ యత్నాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఎంతటి పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీ ఊహలు నిజం కాగలవు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. బంధువులతో వివాదాలు తీరి ఉపశమనం పొందుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు అనుకోని విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సోదరులతో తగాదాలు. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(19 ఆగస్టు నుంచి  25 ఆగస్టు, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఆశ్చర్యకరమైన కొత్త అనుభవాలు ఎదురవుతాయి. కలలను సాకారం చేసుకుంటారు. కొత్త దిశలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. సౌందర్య పోషణపై, అలంకరణపై శ్రద్ధ చూపుతారు. శరీరాకృతిని మెరుగుపరచుకునేందుకు వ్యాయామం ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆశించిన లక్ష్యాలను అందుకోవడంతో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. కీలకమైన అంశాల్లో సన్నిహితుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. 
లక్కీ కలర్‌: ఊదా

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పాత్రలో రాణిస్తారు. పితూరీలు చెప్పేవారిని దూరం పెడతారు. వ్యతిరేక ప్రచారాలను తిప్పికొడతారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల నుంచి బయటపడటానికి ఆచి తూచి అడుగులు వేస్తారు. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి అనుబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మొండితనం వీడి పట్టు విడుపులు ప్రదర్శించడం మంచిది. సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు.
లక్కీ కలర్‌: నారింజ

మిథునం (మే 21 – జూన్‌ 20)
స్తబ్దత తొలగిపోతుంది. తలపెట్టిన పనుల్లో వేగం పుంజుకుంటుంది. ఏకకాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో దూకుడు కొనసాగిస్తారు. వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. సన్నిహిత వర్గాల చర్చల్లో మీరే కేంద్ర బిందువుగా ఉంటారు. ప్రగాఢంగా మార్పును కోరుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాయామంపై శ్రద్ధ పెంచుకుంటారు. ధ్యానంతో సేదదీరుతారు.
లక్కీ కలర్‌: ముదురు ఎరుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
వారమంతా సంతోషభరితంగా సాగుతుంది. నవ్వుతూ తుళ్లుతూ మిత్రులతో కాలక్షేపం చేస్తారు. పరిమితులను పట్టించుకోకుండా ఇతరులను ఆదుకుంటారు. ఔదార్యాన్ని చాటుకుంటారు. ప్రియతముల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. ఆస్తుల అమ్మకాల్లో ఊహించని స్థాయిలో లాభాలను అందుకుంటారు. పిల్లలు సాధించిన విజయాలు మీ పేరు ప్రతిష్ఠలను మరింతగా పెంచుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను స్వీకరిస్తారు. నాయకత్వ పాత్రలో సత్తా నిరూపించుకుంటారు. ఆర్యోగంపై శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు.
లక్కీ కలర్‌: లేత ఊదా

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. సమస్యల చిక్కులన్నీ ఒక్కొక్కటే విడిపోతాయి. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారరంగంలోని వారికి భవిష్యత్తులో లాభసాటి కాగల కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు పంతాలు వదులుకొని, అహాన్ని పక్కనపెడితే సమస్యలు వాటంతట అవే చక్కబడతాయి.
లక్కీ కలర్‌: గులాబి

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మీ నిర్ణయాలను, విశ్వాసాలను సమర్థించుకుంటారు. మీదైన వైఖరికి కట్టుబడి ఉంటారు. శక్తికి మించిన భారం మోస్తున్నట్లుగా భావిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. పని ఒత్తిడి ఉన్నా, పనికీ కుటుంబానికి మధ్య సమతుల్యత సాధించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో తలెత్తిన అపార్థాలను తొలగించుకుంటారు. మార్పులను స్వీకరిస్తారు. ప్రశాంతత కోరుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణం చేసే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. సద్గురువుల అనుగ్రహం పొందుతారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ సహనానికి పరీక్ష ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించడం మంచిది. ఘన విజయాలు సాధించి, పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. సహచర వర్గంలో విశ్వసనీయత పెంచుకుంటారు. సత్కారాలు పొందుతారు. కలలు నెరవేర్చుకుంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ఊదా

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆత్మప్రబోధానుసారం నడుచుకుంటారు. చేపట్టాల్సిన పనుల మీద పూర్తి స్పష్టత కలిగి ఉంటారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోని వారు సాహసోపేతమైన నిర్ణయాలతో ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో దూకుడు కొనసాగిస్తారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించి చాలాకాలంగా కొనసాగుతున్న వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రేమికుల మధ్య అనుబంధంలో స్తబ్దత చోటు చేసుకుంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
లక్కీ కలర్‌: ముదురు నారింజ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
పనులు నిదానంగా సాగుతున్నా, పురోగతి నిలకడగానే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో కొత్త పనులు చేపడతారు. ఒంటరిగా గడపాలనుకుంటారు. గత సంఘటనలపై ఆత్మావలోకనం చేసుకుంటారు. వృథా కాలక్షేపాలకు దూరంగా ఉండటమే మంచిది. అభివృద్ధికి ఓర్వలేని కొందరు మీ గురించి చెడు ప్రచారం సాగిస్తారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో మార్పులు అవసరమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల అనవసరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: వెండి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి లావాదేవీలు కలసివస్తాయి. విద్యార్థులు గొప్ప విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పాత్రలో రాణిస్తారు. పదోన్నతులు, సత్కారాలు అందుకుంటారు. విలువైన వస్తువులను పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. కోరుకుంటున్న వ్యక్తి నుంచి మీ ప్రేమకు ఆమోదం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి ఉద్యోగాల్లో అదృష్టం కలిసొచ్చే కాలం ఇది. ఘన విజయాలతో జనాలను ఆశ్చర్యపరుస్తారు. జనాకర్షణ రెట్టింపవుతుంది. ఎక్కడ ఉన్నా జనాల దృష్టి మీ మీదే ఉంటుంది. ఒక అద్భుతమైన వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు. ఊహా శక్తికి పదునుపెడతారు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు సంచలనాత్మక విజయాలు సాధిస్తారు. ఈ వారంలో ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. ప్రత్యర్థుల ఎత్తుగడలను ముందుగానే పసిగట్టి వాటిని విజయవంతంగా తిప్పికొడతారు. ఆధ్యాత్మిక గురువులను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు పసుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
సంపదను పెంచుకుంటారు. లాభసాటిగా నడిచే కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణ కోసం కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకుంటారు. చాలాకాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. మిత్రులను ఆర్థికంగా ఆదుకుంటారు. కార్యాలయాన్ని కొత్తగా అలంకరిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. విదేశాల నుంచి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులను పెంచుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పూసిందే ఆ పూల మాను నీ దీపంలో...

నిత్య సుమంగళి మండోదరి

ఉద్యోగ ధర్మం

తాత గొప్పలు

వారఫలాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శ్రమశిక్షణ

విద్యా వ్యవస్థలోని వాస్తవాలతో..

ఆలిమ్‌ ఆగయా

లోఫర్‌ప్రేమకథ

ఎంత తీపి ప్రేమయో!

కలుసుకోని ఆత్మీయులం