వార్నింగ్ డబ్బాలు!

12 Jun, 2016 01:27 IST|Sakshi
వార్నింగ్ డబ్బాలు!

ఇంట్లోని పప్పుల డబ్బాలు.. కేవలం వాటిని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఆ డబ్బాలే ఓ మిషన్లలా పని చేయడం ఎక్కడైనా చూశారా? అలాగే అందులోని దినుసులు ఎన్ని గ్రాములున్నాయో.. వాటిలోని పోషకాలేంటో.. అవి ఎన్ని రోజుల్లో పాడవుతాయో చెప్పటం విన్నారా? ఈ చిత్రాలన్నీ చేసేవే ఈ ‘స్మార్ట్ జార్స్’.. వీటిలోని సెన్సర్స్, బ్లూటూత్ ఆప్షన్లే అందుకు కారణం. ఈ రీచార్జిబుల్ జార్లలోని దినుసుల వివరాలను మనం ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్‌లో చెక్ చేసుకోవచ్చు. అలా దినుసుల ఎక్స్‌పైరీ డేట్ దగ్గర్లోనే ఉందని తెలుసుకోవచ్చు.

దాంతో వాటిని పడేయాల్సిన పరిస్థితి రాదు. అలాగే వీటిని శుభ్రం చేయడం కూడా ఈజీ. జార్ల మూత, బేస్‌లను తొలగించి హాయిగా కడగొచ్చు. అందులోని పదార్థాల్లో ఎన్ని క్యాలరీలు, ప్రొటీన్లు ఉన్నాయో తెలిస్తే.. మనం ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు కదా!

మరిన్ని వార్తలు