వారఫలాలు (జూలై 12 నుంచి జూలై 18 వరకు)

12 Jul, 2020 06:18 IST|Sakshi

వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా  సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల  సహాయంతో  కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. . వ్యాపారాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది.  వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు మరింత  ఉత్సాహంగా కొనసాగుతాయి. ఆప్తుల  సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు కాస్త అనుకూలత ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు ఆశించిన విధంగా  పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో స్వల్ప  అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి..

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలో మరింత పురోగతి కనిపిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగయత్నాలు కాస్త అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి వస్తులాభాలు. ఆశ్చర్యకరమైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి.  ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  పనిభారం కొంత తగ్గే సూచనలు. రాజకీయవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. సోదరులతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. పాతమిత్రులతో సరదాగా గడుపుతారు. కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది.  వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు చాలావరకూ తగ్గుతాయి. రాజకీయవర్గాలకు వ్యవహారాలలో విజయం.  వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక విషయాలు క్రమేపీ అనుకూలించి అవసరాలు తీరతాయి. ముఖ్యమైన  వ్యవహారాలలో విజయం సాధిస్తారు.  శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. నిరుద్యోగులకు నూతనోత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు సంస్థల ఏర్పాటులో అనుకూలత. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. బంధువుల నుంచి మాటపడతారు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. 

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.. పాతబాకీలు కొన్ని వసూలై మీకున్న ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. సంఘంలో విశేషమైన గౌరవప్రతిష్ఠలు పొందుతారు. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. వాహన, గృహయోగాలు కలుగుతాయి.  వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో  పైస్థాయి నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. ధనవ్యయం. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎరుపు, పసుపు రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతమేర మెరుగ్గా ఉంటుంది. ఒక ప్రకటన విద్యార్థులను సంతోషపరుస్తుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.  ప్రముఖ వ్యక్తులు ఊహించని రీతిలో సహకరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు సంతృప్తినిస్తాయి.  ఉద్యోగాలలో గందరగోళం నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యారాధన మంచిది..

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు  చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. రుణబాధలు తొలగుతాయి.. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది.  వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై పెద్దలతో సంభాషిస్తారు. వ్యాపారాలలో ఊహించని విధంగా  పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. రాజకీయవర్గాలకు మరింత గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఉత్సాహంగా ముఖ్యమైన  పనులు పూర్తి చేస్తారు. అనుకున్న విధంగా సమయానికి  డబ్బు అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు మీలో ధైర్యాన్ని నింపుతాయి.  ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి ఆకస్మిక ధనలబ్ధి.  వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. కొత్త  పెట్టుబడులు సమీకరిస్తారు. ఉద్యోగాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది.  పారిశ్రామికవర్గాలకు సంస్థల ఏర్పాటులో వివాదాలు పరిష్కారం.  వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి అప్పులు తీరుస్తారు. సన్నిహితులతో మరింత ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తి చేస్తారు. మీ సత్తా పదిమందీ గుర్తిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనయోగం. వివాహయత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో  కొత్త హోదాల యత్నాలు సఫలం.  కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. రుణాల కోసం యత్నిస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో  అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత నత్తనడకన సాగినా చివరిలో స్వల్ప లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఇష్టం లేకున్నా మార్పులు తప్పవు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి. వారం మధ్యలో వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. శుభవార్తలు. నీలం, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.  పరిచయాలు పెరుగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే సంతృప్తినిస్తుంది.  ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యతిరేక పరిస్థితులను సానుకూలపర్చుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది.  వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారికి ఆహ్వానాలు, పిలుపులు అందుతాయి. వారం  చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పార్వతీదేవికి కుంకుమార్చన చేయండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

మరిన్ని వార్తలు