వారఫలాలు(జూన్‌ 14 నుంచి 20 వరకు)

14 Jun, 2020 07:52 IST|Sakshi

మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఏ కార్యక్రమం చేపట్టినా కొంత జాప్యంతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతారు. అయితే ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. రుణయత్నాలు సాగిస్తారు. కాంట్రాక్టుల కోసం యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు అంచనాలలో పొరపాట్లు దొర్లుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అష్టలక్ష్మీస్తోత్రాలు పఠించండి.

వృషభం : (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. కొన్ని వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. మిత్రులు, బంధువుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మిథునం : (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు ఎవరి తోడ్పాటు లేకుండానే పూర్తి చేస్తారు.  ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా కొనసాగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై ఊపిరిపీల్చుకుంటారు. మీ నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణాలు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగయత్నాలు కాస్త అనుకూలిస్తాయి. వ్యాపారాలు గతంతో పోలిస్తే లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి కాస్త ఊరట లభిస్తుంది. వారం  చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం : (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల సహాయం అందుతుంది.ఆర్థిక విషయాలలో కాస్త ఊరట లభించే సమయం. కొన్ని వివాదాలు కుటుంబసభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. శుభకార్యాలపై పెద్దలతో చర్చిస్తారు. వ్యాపార లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

సింహం : (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక వ్యవహారాలో కొద్దిపాటి ఆటుపోట్లు ఎదురై చికాకు పరుస్తాయి. కొన్ని పనులు చికాకు పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా సాగక డీలా పడతారు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి ఊహించని అవకాశం దక్కవచ్చు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కన్య : (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని బాకీలు వసూలవుతాయి.  సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెంచుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సమాజసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలలో కొంత కదలికలు కనిపిస్తాయి. ప్రముఖులు పరిచయమవుతారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆదరణ పెరుగుతుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల : (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరి ఊరట చెందుతారు. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి చిక్కులు కొన్ని తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం : (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. మీ ఆశయాలు నెరవేరే సమయం. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబసభ్యుల నుంచి తగు ప్రోత్సాహం అందుతుంది. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. పారిశ్రామికవర్గాలకు చికాకులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవిస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని విషయాలలో తీసుకునే నిర్ణయాలు కుటుంబసభ్యులు హర్షిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. విద్యార్థుల దీర్ఘకాలిక యత్నాలు సఫమవుతాయి. పాత సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు గతం కంటే లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురుకావచ్చు. ఆస్తి విషయంలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులు మీ పట్ల కొంత వ్యతిరేకత చూపుతారు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమ పడ్డా ఫలితం అంతగా కనిపించదు. దైవదర్శనాలు చేసుకుంటారు. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఇంటాబయటా కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో ధనప్రాప్తి. కుటుంబంలో శుభకార్యాలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కుంభం : (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధుమిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కాస్త అనుకూలిస్తుంది. అయితే రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం కాస్త ఊరటనిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి ఉంటుంది. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో ధనలాభం. శుభవార్తలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం : (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పలుకుబడి మరింత పెరుగుతుంది. అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ వ్యూహాలు అమలు చేసి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారి కృషి కొంత ఫలించే సమయం. వారం మధ్యలో అనుకోని ధన వ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా