వారఫలాలు (మే 10 నుంచి 16 వరకు)

10 May, 2020 06:26 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థుల్లో నైరాశ్యం తొలగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న పనులు మొదట్లో నెమ్మదించినా క్రమేపీ పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మరింత పెరుగుతాయి. వివాహయత్నాలు సానుకూలం. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. తెలుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
సమస్యల పరిష్కారంలో వ్యక్తిగత చొరవ తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహవంతంగా గడుపుతారు. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో ముందడుగు వేస్తారు. ఒక సంఘటన మలుపు తిప్పుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాలకు ఉన్నత స్థాయి నుంచి పిలుపు అందుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో పురోగతి సా«ధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు. ఆరోగ్యభంగం. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదాలు తొలగి లబ్ధి చేకూరుతుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. యుక్తి, మేధస్సుతో సమస్యలను అధిగమిస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. పాత అనుభవాల రీత్యా నిర్ణయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యంతో ఫలితాలు కనిపిస్తాయి. ఒక మరపురాని సంఘటన ఎదురవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిం^è ండి. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కళారంగం వారికి చికాకులు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు,సోదరీలతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. విద్యార్థులకు ఫలితాలు సంతోషం కలిగిస్తాయి. సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ప్రముఖులు సహాయసహకారాలు అందిస్తారు. ఏ పని చేపట్టినా  విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. బంధువర్గంతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబంలో గౌరవిస్తారు. వ్యాపారాల విస్తరణలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
సన్నిహితులతో వివాదాలు తీరి ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు, కోర్టు కేసులు పరిష్కారానికి నోచుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఒక సంఘటన మిమ్మల్ని మరింతగా ఆకట్టుకుంటుంది. ఆస్తుల విషయంలో జ్ఞాతులతో ఒప్పందాలు చేసుకుంటారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. నలుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు తీరతాయి. ఉద్యోగార్థుల యత్నాలు సానుకూలం. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా