వారఫలాలు (మే 17 నుంచి 23 వరకు)

17 May, 2020 06:58 IST|Sakshi

 వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల సలహాలు, సహాయం అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు సాధిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో  బంధువిరోధాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహి ణి, మృగశిర 1,2 పా.)
వ్యూహాత్మకంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.  వాహనయోగం. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం.  కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వీరికి అన్నింటా విజయాలు  చేకూరతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూముల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త  పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు.  పారిశ్రామికవర్గాలకు విశేషంగా రాణిస్తుంది. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం.  బంధువులతో వివాదాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. గృహం, వాహనాలు S కొనుగోలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది.  వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు. వారం ప్రారంభంలో స్వల్ప వివాదాలు. శారీరక రుగ్మతలు.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థికంగా మరింత బలపడతారు.  బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త  పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. ధనవ్యయం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
బం«ధువుల నుంచి కీలక విషయాలు గ్రహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. ముఖ్యమైన పనుల్లో  విజయం సాధిస్తారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో  లాభాలు ఆర్జిస్తారు.  ఉద్యోగాలలో ప్రశంసలు అందుతాయి. కళారంగహం వారికి  ఆహ్వానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి. 

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని సమస్యలు పరిష్కారంలో చొరవ చూపుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు.  ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో  లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త ప్రయత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. 

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. రావలసిన సొమ్ము కూడా అందుతుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. పోటీపరీక్షల్లో  నిరుద్యోగులకు విజయం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. దైవదర్శనాలు చేస్తారు.  వ్యాపారాలలో  భాగస్వాములతో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో విధుల్లో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి గందరగోళం తొలగుతుంది. వారం ప్రారంభంలో  మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని సమస్యలు, వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సలహాలు స్వీకరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్య నిర్ణయంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.  ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో  బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనుల్లో  ఆటంకాలు కొంత చికాకు పరుస్తాయి. అయితే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అధిగమిస్తారు. శ్రమ మరింత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. నిరుద్యోగులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యభంగం. బంధువర్గం నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలలో  లాభాలు స్వల్పంగా అందుతాయి. ఉద్యోగాలలో  పనిఒత్తిడులు. రాజకీయవర్గాలకు నిరాసక్తత. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది.   స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు. కళారంగం  వారికి మరింత ఉత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులలో  పురోగతి కనిపిస్తుంది. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. కళారంగం వారికి అంచనాలు నిజమవుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి. 

- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా