వారఫలాలు (మే31 నుంచి జూన్‌ 6 వరకు)

31 May, 2020 08:56 IST|Sakshi

మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆసక్తికర సమాచారంతో ఊరట చెందుతారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులు మీకు చేదోడుగా నిలుస్తారు. ఆస్తుల వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటì  నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం : (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
క్రమేపీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగినా అవసరాల మేరకు సొమ్ము అందుకుంటారు. ఆస్తి విషయంలో సోదరుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థుల శ్రమ కొంత ఫలిస్తుంది. ఇళ్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు, సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మిథునం : (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి క్రమేపీ అనుకూలిస్తుంది. కొత్త పనులు చేపట్టి కుటుంబసభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి ఊహించని శుభవార్తమానాలు అందుతాయి. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలు కొంత సఫలమవుతాయి. మీ నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. వ్యాపారాలలో మరింత పురోభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి కాస్త అనుకూల వాతావరణం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కర్కాటకం : (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితిలో మార్పులు లేక నిరాశ చెందుతారు. రావలసిన బాకీలు ఆలస్యమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాతజ్ఞాపకాలు నెమరువేసుకుంటారు. ఆస్తుల విషయంలో సోదరులతో ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలు కొన్నింటిని మార్చుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగవర్గాలకు శ్రమాధిక్యం. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం : (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. భూవివాదాలు తీరి ఊరట చెందుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. కళారంగం వారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య : (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి  కొంత వరకు మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కొన్ని వివాదాలు, సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలలో కాస్త అనుకూలత ఉండవచ్చు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభాలు చేకూరుస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాత స్తోత్రాలు పఠించండి.

తుల : (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు కొంత ఊపిరిపీల్చుకునే సమయం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై పెద్దలతో చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. పనిభారం. నీలం, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీదత్త స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం : (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
వీరికి అంతటా అనుకూలమే. ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు సైతం పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూవివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు చివరిలో దక్కించుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు కలిగే అవకాశం. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు : (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలకు లోటు రాదు. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగి లబ్ధి పొందుతారు. వివాహయత్నాలు కొలిక్కి వస్తాయి. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. విద్యార్థులు కొంత ఊరట పొందే సమయం. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. బంధువుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి. పారిశ్రామికవర్గాలకు అనుకూల సమయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

మకరం : (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మొదట్లో నెలకొన్న సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. రుణబాధలు కాస్త తగ్గే సూచనలు. దూరపు బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఒప్పందాలు కొన్ని ఎట్టకేలకు ఖరారు కాగలవు. వ్యతిరేకులను సైతం విధేయులుగా మార్చుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకునే సమయం. రాజకీయవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కుంభం : (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల సహాయం తీసుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. పాతమిత్రులు తారసపడతారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. భూములు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం. మీ అనుభవాలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మీనం : (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఏ వ్యవహారమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీరే సమయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. విద్యార్థులకు ఒక ముఖ్య సమాచారం అందవచ్చు. ఇంటి నిర్మాణాలు కొనసాగిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు తప్పవు. కళారంగం వారికి తగిన ప్రోత్సాహం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. 

మరిన్ని వార్తలు