వారఫలాలు (మార్చి1 నుంచి 7వరకు)

1 Mar, 2020 06:55 IST|Sakshi

మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మీరు తీసుకునే నిర్ణయాలు నూతన అధ్యాయానికి నాంది కాగలవు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాహాది వేడుకల నిర్వహణ బాధ్యతలు చేపడతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరతాయి. ఉద్యోగాలలో మరింత సానుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

వృషభం : (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. మీ ఆలోచనలు ఇతరులకు సైతం ఉపయోగపడతాయి. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. చిరకాల ప్రత్యర్థులను సైతం మీవైపునకు ఆకట్టుకుంటారు. వాహనయోగం. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
చేపట్టిన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. రుణబాధలు కొంత తీరతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కోర్టు వ్యవహారం సైతం మీకు సానుకూలమవుతుంది. నూతన ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఎరుపు, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరూ ఆమోదిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక లావాదేవీలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. పనులలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. మీ సలహాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ప్రారంభంలో చేపట్టే పనులలో ప్రతిష్ఠంభన. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవసరాలకు లోటు రాదు. కుటుంబంలో ఒత్తిడులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అయితే క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఒక సంఘటన మీలో మార్పు తీసుకువస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కరించుకుంటారు. ఓర్పుగా ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు కొంత నెమ్మదించినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. నిరుద్యోగుల ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు హోదాలు లభించే అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష పేరుప్రతిష్ఠలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరించి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు చకచకా పూర్తి చేయడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగు పడతాయి. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు, పదవీయోగాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మొదట్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరతాయి. స్వల్ప అనారోగ్యం కలిగినా ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. పసుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్యహృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఎటువంటి పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అందుతుంది. భూవివాదాలు పరిష్కార  దశకు చేరుకుంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో  ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వారం మధ్యలో వృథా ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయ, వ్యయాలలో వ్యత్యాసంతో కొంత ఇబ్బంది పడతారు. కొత్తగా రుణాలు చేస్తారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా కొనసాగవు. బంధువులతో అకారణంగా తగాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. సోదరులు, మిత్రుల నుంచి కొన్నివిషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు చికాకులు, విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. 

మరిన్ని వార్తలు