వారఫలాలు (26 ఏప్రిల్‌ నుంచి 02మే వరకు)

26 Apr, 2020 06:18 IST|Sakshi

మేషం: ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. కష్టానికి ఫలితం కనిపించదు. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు నెలకొని సహనాన్ని పరీక్షిస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు మరింత శ్రమ తప్పదు. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో  స్వల్ప లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. రుణఒత్తిడులు కాస్త తొలగుదతాయి.  ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు శుభవార్తలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా  పాల్గొంటారు. వ్యాపారాలలో మరింత లాభపడతారు. ఉద్యోగాలలో  హోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకుల నుంచి విముక్తి లభిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. నేరేడు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మిథునం: కొత్త పనులు చేపట్టి్ట సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా మరింత మెరుగుపడుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం కలిగే సూచనలు. బంధువుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల  మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: మొదట్లో కొన్ని  సమస్యలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి.  మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.  విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సంఘంలో  పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో  సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో  ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం: ఎంతటి పనినైనా పట్టుదలతో సా«ధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటì  మిత్రుల  నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఒక సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల యత్నాలలో కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. అనుకోని ప్రయాణాలు. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: ఉద్యోగయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. బంధువుల నుంచి కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇంటిలో శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో  భాగస్వాములవుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు దక్కవచ్చు.  కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ప్రయాణాలు వాయిదా. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో వివాదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

తుల: వ్యయప్రయాసల నుంచి బయటపడతారు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. వ్యతిరేకులను సైతం మాటలతో ఆకట్టుకుంటారు.  ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో  లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవం.  రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. సోదరులతో కలహాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగిపోతుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. వాహనాలు, ఇళ్లు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సన్నిహితుల నుంచి ధన సాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో తగినంత లాభాలు రాగలవు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. కళారంగం వారికి వారం మధ్యలో  ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. పసుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకున్న కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలలో  లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో  అనుకోని హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు కీలక సమాచారం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: మొదట్లో కొన్ని వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. అయితే ఆత్మవిశ్వాసంతో అ«ధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఊహలు నిజం కాగలవు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో క్రమేపీ లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కుంభం: కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భూములు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వ్యాపారాలు మరింత లా¿ సాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు విధులు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బం«ధువుల నుంచి ఒత్తిడులు. నేరేడు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. కొత్త పనులు చేపడతారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో  ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఊహించని విజయాలు సాధిస్తారు.కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.  వ్యాపారస్తులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

>
మరిన్ని వార్తలు