టారో వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు)

4 Aug, 2019 08:24 IST|Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
విదేశాల నుంచి శుభవార్తలను వింటారు. వృత్తి ఉద్యోగాల్లో చిరకాలంగా ఆశిస్తున్న పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. అనవసరంగా శ్రమించకుండా, తెలివిగా లక్ష్యాలను సాధిస్తారు. మిమ్మల్నే నమ్ముకున్న బృందానికి న్యాయం జరిగేలా చూస్తారు. సగంలోనే విడిచిపెట్టిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ కోసం వినూత్న పథకాలను అమలు చేస్తారు. అసూయాపరులు కొందరు మిమ్మల్ని ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. దూర ప్రాంతాల్లోని మిత్రులను ఆదుకుంటారు.
లక్కీ కలర్‌: నలుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
వరుస అవకాశాలు వస్తాయి. దేనిని ఎంపిక చేసుకోవాలో అర్థంకాని గందరగోళంలో పడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవలసిన పరిస్థితులు ఉంటాయి. ఉన్నతాధికారులతో వాగ్వాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పోరాట పథాన్నే నమ్ముకుంటారు. మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే అవకాశాలు ఉన్నాయి. 
లక్కీ కలర్‌: మీగడ రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పనులు చేపడతారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి స్థానచలన సూచనలు ఉన్నాయి. చాలా కీలకమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అకాల భోజనం వల్ల ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బందిపెట్టవచ్చు. ప్రియతములతో అనుబంధం జటిలంగా మారే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: బంగారు రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఇంట్లో మార్పులు ఉంటాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జీవనశైలిని మార్చుకుంటారు. అనవసరమైన భయాలతో ఆందోళన చెందవద్దు. అవన్నీ వేకువకు ముందు చీకటిలాంటివి. త్వరలోనే మీ జీవితంలో ఉజ్వల భవిష్యత్తుకు దారితీసే ఆశాకిరణాలు ప్రసరిస్తాయి. ఆర్థిక పరిస్థితులను అదుపులో ఉంచడానికి తగిన నిధులను సమకూర్చుకుంటారు. రుణాలు తీసుకోవాలనే ఆలోచనను వాయిదా వేసుకోవడమే మంచిది. ఆశ్చర్యకరంగా ప్రత్యర్థులనుకున్న వారే మీకు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఆత్మీయుల్లో ఒకరు దూరమవుతారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
వృత్తి ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. పని పట్ల అభిరుచి, అంకితభావమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. స్వయంకృషితోనే సమస్యల నుంచి బయటపడతారు. క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేయాల్సిన మిత్రులు కూడా ముఖం చాటేస్తారు. జీవితం నేర్పిన పాఠాలతో మనుషులను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రేమానుబంధాలపై ఇంతవరకు దృష్టి సారించకపోయినా, అనుకోకుండా ప్రేమలో పడతారు. ప్రేమానుభూతిని అనుక్షణం ఆస్వాదిస్తారు. ఆధ్యాత్మికత ద్వారా మానసిక సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
అదృష్టం తలుపు తడుతుంది. ఒక గొప్ప అవకాశం అయాచితంగానే లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనార్జన వ్యామోహాన్ని రేకెత్తించే పన్నాగాలతో కొందరు మిమ్మల్ని బురిడీ కొట్టించే యత్నాలు చేస్తారు. తెలివిగా వాటిని తిప్పికొట్టకుంటే భారీ నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. వ్యసనాల నుంచి బయటపడటానికి యోగ, ఆధ్యాత్మిక సాధనలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. విహారయాత్రలకు వెళతారు.
లక్కీ కలర్‌: తుప్పు రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పనితీరులో దూకుడు పెంచుతారు. అవరోధాలను అవలీలగా అధిగమించి విజయ పరంపర కొనసాగిస్తారు. విమర్శలు సంధించే ప్రత్యర్థులకు మాటలతో కాకుండా మీ విజయాలతోనే సమాధానం చెబుతారు. క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, అంకిత భావాలతో పాటు మీ అంతస్సౌందర్యమే మిమ్మల్ని ఉన్నతులుగా నిలిపినట్లు గ్రహిస్తారు. నిజాయతీపరులను ప్రోత్సహిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు కొంత చికాకు కలిగిస్తాయి.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
కలలను సాకారం చేసుకోవడానికి కృషి కొనసాగిస్తారు. కొత్త ఆలోచనలతో వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన సమస్యలు సమసిపోతాయి. పరిస్థితులు పూర్తిగా సానుకూలంగా మారుతాయి. ఒక మహిళా భాగస్వామి ఆలోచనల కారణంగా వ్యాపార లాభాలు రెట్టింపవుతాయి. సౌందర్య సాధనాలను కొనుగోలు చేస్తారు. శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి వ్యాయామంపై దృష్టి సారిస్తారు. ఖరీదైన విలాస వస్తువులను ప్రియతములకు కానుకగా ఇస్తారు. 
లక్కీ కలర్‌: ఊదా

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
సాదాసీదాగా సాగిపోతున్న జీవితం అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. ఒడిదుడుకులు ఎదురైనా, సాఫీగానే లక్ష్యాలను చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అదేపనిగా కొందరు మీపై సాగించే దుష్ప్రచారం తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకంజ వేయవద్దు. భవిష్యత్తులో అవే సత్ఫలితాలనిస్తాయి. పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి తగిన సలహాలు, సూచనల కోసం జ్యోతిషులను సంప్రదిస్తారు. గురువుల ఆశీస్సులు అందుకుంటారు.
లక్కీ కలర్‌: నీలం

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
మీదైన రంగంలో మీరు తారలా మెరిసిపోతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అనూహ్యమైన పదోన్నతులు, వేతన వృద్ధి సూచనలు ఉన్నాయి. నాయకత్వ బాధ్యతలను చేపడతారు. వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు కలసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చాలాకాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. అనుకోని వ్యక్తి నుంచి వచ్చే ప్రేమప్రతిపాదన మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. స్నేహితులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు.
లక్కీ కలర్‌: ఎరుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
బాధ్యతలన్నింటినీ సక్రమంగా నెరవేరుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనితర సాధ్యమైన విజయాలను సాధించి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఎటువంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కొంటారు. అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. కళా సాహితీ రంగాల్లోని వారికి అపురూపమైన సత్కారాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను ఆచరణలో పెడతారు. 
లక్కీ కలర్‌: ముదురు గులాబి

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
సానుకూల దృక్పథంతో విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అంకితభావంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి యోగా, వ్యాయామం, ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ఆశ్రయిస్తారు. స్థిరాస్తులలో పెట్టుబడుల నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది. స్వల్పకాలిక పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బహిరంగ వేదికలపై వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రేమికుల అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది.
లక్కీ కలర్‌: నాచురంగు
- ఇన్సియా, టారో అనలిస్ట్‌

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు