వారఫలాలు (8 సెప్టెంబర్‌ నుంచి 14 సెప్టెంబర్‌ వరకు)

8 Sep, 2019 08:29 IST|Sakshi

వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకున్న కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. మీ అంచనాలు నిజమవుతాయి.  ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.  వ్యాపారాలు సంతృప్తికరంగా ఉండిలాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు నూతన అవకాశాలు. వారం ప్రారంభంలో బంధువులతో  వివాదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
పనుల్లో ఊహించని  విజయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు.  వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలలో  అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు,   సన్మానాలు. వారం మధ్యలో  ఆరోగ్యసమస్యలు. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శత్రువులు సైతం  అనుకూలురుగా మార్చుకుంటారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. భూములు, భవనాలు కొంటారు. మీ ఆశయాలు కొన్ని నెరవేరే సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ఈతిబాధలు తొలగుతాయి. పదోన్నతులు సైతం దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం  మధ్యలో శ్రమాధిక్యం. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతన వ్యక్తుల పరిచయాలు. కుటుంబసభ్యులతో  ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో ఉత్తరప్రత్యుత్తరాలు. మీఖ్యాతి మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వాహనయోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక  విదేశీయానం. వారం చివరిలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిళ్లు. ఆరోగ్యభంగం.  తెలుపు, గులాబీ రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులలో పురోగతి కనిపిస్తుంది. బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. మీసేవలకు గుర్తింపు పొందుతారు. . తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులకు  భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనసౌఖ్యం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.  వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఉద్యోగాలలో ఎదురుండదు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు, నూతన పదవులు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తితో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. తండ్రి తరఫు నుంచి ఆస్తి లాభ సూచనలు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు మరింత పెరుగుతాయి. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
బంధువుల సలహాలతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా మరింత అభివృద్ధి కనిపిస్తుంది. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. గృహ, వాహనయోగాలు. నూతన విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.  వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. పసుపు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనుల్లో అవాంతరాలు. కష్టిస్తే గానీ ఫలితం కనిపించదు.  బంధువర్గంతో స్వల్ప తగాదాలు. ఆస్తి వివాదాలు నెలకొని ఇబ్బందిపడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి  ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి.  వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. నిరుద్యోగులు సత్తా చాటుకుని ఉద్యోగాలు సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.  వాహనయోగం. కుటుంబానికి సంబంధించి కొన్ని  నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో  ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. బంధువుల నుంచి శుభవర్తమానాలు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబసభ్యుల చేయూతతో కొన్ని  పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  కొత్త బాధ్యతలు చేపడతారు. కళాకారులకు మరింత ఉత్సాహం. వారం  మధ్యలో మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుట్టి సమయానికి పూర్తి చేస్తారు. మీ ఖ్యాతి మరింత పెరిగి అందరిలోనూ గుర్తింపు పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల పరిష్కారంలో సోదరుల సహాయం స్వీకరిస్తారు. విద్యా, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. పసుపు, చాక్లెట్‌ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. ఎంతటి వారినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు లభించే వీలుంది. ఇతరులకు సైతం సాయపడతారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కే ఛాన్స్‌. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

- సింహంభట్ల సుబ్బారావు  జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు