టారో వారఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు)

28 Jul, 2019 08:44 IST|Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
సుస్థిరతను సాధిస్తారు. జీవితాన్ని మరింత పకడ్బందీగా తీర్చిదిద్దుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే సమస్యలను చాతుర్యంతో పరిష్కరించుకుంటారు. ఇతరులకు నచ్చచెప్పి వారి ద్వారా మీకు కావలసిన రీతిలో పనులు జరిపించుకోవడంలో సఫలమవుతారు. చాలాకాలంగా మనసులో మెదులుతున్న ఆలోచనను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో సంతోషభరితమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలను తలపెడతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జోడీ దొరికే అవకాశాలు ఉన్నాయి. గురువులకు కానుకలు ఇస్తారు.
లక్కీ కలర్‌: గులాబి

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఉత్సాహంతో ఉరకలేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సారథ్య బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. లక్ష్య సాధన దిశగా మీ బృందాన్ని ముందుకు నడుపుతారు. అయితే, మితిమీరిన పనిభారం వారాంతంలో కొంత ఇబ్బందిపెట్టే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు. తిరిగి పుంజుకోవడానికి విశ్రాంతి అనివార్యమయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. ఆర్థిక విజయాలు సాధిస్తారు. స్వల్పకాలిక పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. సన్నిహితులతో తగాదాలు సంబంధాలను దెబ్బతీసే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తలెత్తవచ్చు.
లక్కీ కలర్‌: మీగడ రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారు మీపై పెట్టుకున్న ఆశలను వమ్ము కానీయరు. వృత్తి ఉద్యోగాల్లో సంచలనాత్మక విజయాలను సొంతం చేసుకుంటారు. భారీ లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు. రాజకీయ రంగంలోని వారికి ఈర్షా్యళువులైన ప్రత్యర్థుల నుంచి విమర్శలు, దుష్ప్రచారాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు సృష్టించడానికి కొందరు కుయుక్తులు పన్నవచ్చు. అప్రమత్తంగా లేకుంటే అనుబంధాలు దెబ్బతినే సూచనలున్నాయి.
లక్కీ కలర్‌: బంగారు రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
జీవనసరళిలో పెద్ద మార్పులే ఉంటాయి. వేకువ ముందు చీకటిలాంటి గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. ఆశాకిరణాలు ప్రసరించి అదృష్టం మీ కళ్ల ముందే సాక్షాత్కరిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్యసాధనలో కార్యదక్షతను నిరూపించుకుంటారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సంకల్పమే సగం బలం అని తెలుసుకుంటారు. సడలని సంకల్పబలంతోనే అసాధ్యాలను సుసాధ్యం చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలసి సుదూర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళతారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఉజ్వలమైన భవితవ్యానికి నాంది మొదలవుతుంది. ప్రజలకు చేరువగా ఉండే రంగాల్లోని వారికి అభిమానులు రెట్టింపవుతారు. అదే సమయంలో మీపై వదంతులకూ విపరీతమైన ప్రచారం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వెనుకంజ వేయకుండా ఎలాంటి సవాళ్లనైనా వెంటనే స్వీకరిస్తారు. కొత్తగా పరిచయమైన ఒక వ్యక్తితో శరవేగంగా పెనవేసుకున్న అనుబంధం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కుటుంబ కలహాలను సామరస్యంగా పరిష్కరిస్తారు. అనుభవంలోను, వయసులోను మీ కంటే పెద్దవాళ్లు సైతం మీ సలహాలు కోరుకుంటారు.
లక్కీ కలర్‌: ఎరుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అధికారంతో కూడిన పదోన్నతులు లభిస్తాయి. వ్యసనాల నుంచి బయటపడటానికి ప్రయత్నాలను ప్రారంభిస్తారు. దాయాదులతో ఆస్తి తగాదాలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. మీకు దక్కాల్సిన హక్కుల కోసం పట్టుబట్టకుంటే నష్టం తప్పకపోవచ్చు. మొహమాటం విడిచిపెట్టి ఆచరణాత్మక పరిష్కారాల కోసం ప్రయత్నించడం మంచిది. సాంస్కృతిక కళా రంగాల్లోని వారికి ప్రభుత్వ సత్కారాలు, పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: తుప్పు రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మార్పులను స్వీకరించడానికి మీరు సంసిద్ధంగా లేకపోయినా, మార్పులు అనివార్యమవుతాయి. కాలంతో పాటే మారక తప్పదని సర్దిచెప్పుకుంటారు. అతిథుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చాకచక్యంగా గడువులోగా లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆరోగ్యం క్షీణించడం పట్ల కలత చెందుతారు. ఆస్తుల కొనుగోలు, పెట్టుబడుల నిర్ణయాలను ఈ వారంలో వాయిదా వేసుకోవడం క్షేమం. ఆలయాలను సందర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: ఊదా

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మీ నుంచి ఆర్థిక సాయం కోరుకునేవారు మిమ్మల్ని మొహమాటంలో పడేయడానికి చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. సన్నిహితులతో చిన్న చిన్న తగాదాలే చినికి చినికి గాలివానలా మారే సూచనలు ఉన్నాయి. వీలైనంత వాగ్వాదాలకు దూరంగా ఉన్నట్లయితే ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి తప్పించుకోగలుగుతారు. ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతారు. సద్గురువుల ఆశీస్సులు లభిస్తాయి.
లక్కీ కలర్‌: ఎరుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
సాదాసీదాగా సాగిపోతున్న జీవితంలో అసాధారణమైన మార్పులు సంభవిస్తాయి. ఆర్థిక పరిపుష్టిని పెంచే లాభసాటి అవకాశాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో వేతన పెంపు సూచనలు ఉన్నాయి. మొండిబాకీలు వసూలవుతాయి. స్వల్పకాలిక పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు దక్కుతాయి. స్థిరాస్తులను గాని, వాహనాన్ని గాని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. నైపుణ్యాలను మెరుగుపరచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ప్రేమికులకు పెద్దల ఆమోదం లభిస్తుంది.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
అందచందాలపై అతిగా దృష్టిపెడతారు. అలంకరణలకు ప్రాధాన్యమిస్తారు. నలుగురిలోనూ ప్రత్యేకంగా కనిపించాలనుకుంటారు. పొగడ్తల మైకంలో మునిగి తేలుతారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను స్వీకరించడానికి తటపటాయించకండి. సవాళ్లను స్వీకరించడానికి ఏమాత్రం వెనుకాడినా అద్భుతమైన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. సన్నిహితులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. పనులను వాయిదా వేసుకుని మరీ విహారయాత్రల్లో గడుపుతారు. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ముదురు ఎరుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
విజయ పరంపరను కొనసాగిస్తారు. కఠోర పరిశ్రమకు తగిన ప్రతిఫలం, గౌరవం పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు దక్కకుండా చిరకాలం సాగించిన కృషికి సత్ఫలితాలు మొదలవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ రంగంలోని వారికి జనాదరణ పెరుగుతుంది. పని నుంచి విరామం తీసుకుని విహారయాత్రలకు వెళతారు. జీర్ణకోశ సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల పట్ల జాగ్రత్తలు అవసరం. అనుకోని వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదన సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్విగ్నభరితమైన విజయాలను ఆస్వాదిస్తారు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆలోచనలను ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో స్థాయికి మించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. స్థిరాస్తుల్లోని పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలను అందుకుంటారు. విలక్షణమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశాల నుంచి మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: లేతనీలం
- ఇన్సియా, టారో అనలిస్ట్‌

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు)

బీ47 గదిలో ఏముంది?

అరే సీనుగా.. పెళ్లిబువ్వరా.!

సిరా చుక్క.. నెత్తుటి మరక...

రైటర్‌ కాపీరోవా ఆండ్రూ కథనం ప్రకారం..

గడ్డిపరకా..! నీకు కూడా చులకనయ్యానా?!

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!