కరుణామయుడు శిలువనెక్కిన రోజు

8 Apr, 2017 23:36 IST|Sakshi
కరుణామయుడు శిలువనెక్కిన రోజు

మానవుల పాప పరిహారం కోసం కరుణామయుడైన ఏసుక్రీస్తు శిలువనెక్కిన రోజును మంచి శుక్రవారం (గుడ్‌ ఫ్రైడే) అంటారు. ఏసుక్రీస్తు మరణం ఎంతో వ్యధాభరిత సంఘటన. సాధారణ మనుషులు ఎవరైనా మరణిస్తే దానిని ‘మంచి’ అనుకోము కదా! అలాంటిది ఏసుక్రీస్తు మరణించిన దినాన్ని మంచిదిగా ఎందుకు పరిగణిస్తున్నారంటే... అందుకు ఏసుక్రీస్తు జీవితాన్ని, మానవుల పాప పరిహారం కోసం ఆయన చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

పాపుల కోసం ప్రాయశ్చిత్తంగా...
దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు ఒక సంపూర్ణ మానవుడిగా జీవించాడు. మానవుడు ఈ లోకంలో ఎలా జీవించాలో అలా జీవించాడు. అలాంటి సంపూర్ణ జీవితమే మానవుల పాప పరిహారానికి తగిన బలి. మానవులు పాపం చేసి దేవుని తీర్పునకు తగినవారుగా ఉన్నారు. మానవుల పాపానికి పరిహారం ఏమిటి? మానవుల కోసం ఒకరు చనిపోవాలి. కానీ, ఏ ఒక్కరూ మానవుల పాపానికి చనిపోదగ్గవారు కాదు.

ఎందుకంటే, దేవుని దృష్టిలో అందరూ పాపులే. పాపుల పాప పరిహారం కోసం పాపులు మరణించలేరు. మానవుల పాపానికి దేవుడే పరిహారం చేయగలడు. అందుకే దేవుడు తన కుమారుడైన ఏసుక్రీస్తును శిలువ మీద చనిపోయి, మానవుల పాపానికి ప్రాయశ్చిత్తం చేసినట్లు చేశాడు. యెషయా ప్రవక్త క్రీస్తుపూర్వం ఏడువందల సంవత్సరాల నాడే ఈ విధంగా ప్రవచించాడు... ‘మనమందరం గొర్రెలవలె తోవ తప్పితిమి. మనలో ప్రతివాడును తనకు ఇష్టమైన తోవకు తొలగెను.

యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను’ (యెషయా 53:6) ఏసుక్రీస్తు మరణం ద్వారా మానవులు పాప క్షమాపణను, దేవునితో సహవాసమును పొందగలరు. ఇందువల్లనే ఏసుక్రీస్తు మరణాన్ని మంచిదిగా పరిగణిస్తున్నారు. మరణించిన మూడు రోజుల తర్వాత క్రీస్తు పునరుత్థానం చెందాడని, పునరుత్థానం తర్వాత నలభై రోజులలో పది వేర్వేరు సందర్భాలలో ఐదువందల కంటే ఎక్కువ మంది శిష్యులకు క్రీస్తు కనిపించినట్లు ఆయన శిష్యులు లోకానికి వెల్లడించారు. క్రీస్తు ప్రాయశ్చిత్త మరణంలో, పునరుత్థానంలో మానవాళికి మేలు, క్షేమం, సమాధానం లభించాయి.

గుడ్‌ఫ్రైడే అంటే యేసయ్య చనిపోయిన రోజు. మన పాపాల్ని క్షమించడానికి బ్లడ్‌ అంతా కార్చారు.
మనల్ని హెవెన్‌కు
తీసుకు వెళ్లడానికి
జీసస్‌ క్రాస్‌పై
మరణించారు.
జాన్‌ లివింగ్‌స్టన్‌

మనకు సాల్వేషన్‌
ఇవ్వడం కోసం జీసస్‌ చనిపోయారు. అందుకే మనం ‘గుడ్‌’ ఫ్రైడే అంటాం. మనం చేసిన మిస్టేక్స్‌కు జీసస్‌ను పనిష్‌ చేశారు. జీసస్‌కు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం.

జాన్‌ మార్క్‌ విలియమ్‌
మనందరి కోసం జీసస్‌ చనిపోయారు. మన కోసం దెబ్బలు తిన్నారు. జీసస్‌కు నేనంటే చాలా ఇష్టం. అందరూ అన్నా కూడా ఇష్టమే! ఆయన అందరికీ దేవుడు.
అక్సా ట్రైఫీనా

గుడ్‌ ఫ్రైడే అంటే మంచి
శుక్రవారం. ఎందుకంటే జీసస్‌ చనిపోయారు మూడో రోజున బతికారు.
జీసస్‌ క్రాస్‌పై మనకోసమే చనిపోయారు. ఆయన చేతులకు, కాళ్లకు మేకులు కొట్టారు. ముళ్ల కిరీటం పెట్టారు. కొరడాలతో కొట్టారు.
క్రిసలైట్‌ ఆలివ్, అమూల్యా గ్రేస్‌

మరిన్ని వార్తలు