రెక్కలు ఊపితే... అది స్నేహ చిహ్నం!

22 Feb, 2015 02:07 IST|Sakshi
రెక్కలు ఊపితే... అది స్నేహ చిహ్నం!

రెక్కల చేతులు
యుద్ధ విమానాలే కాదు, సాధారణ విమానాలు కూడా డిఫెన్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే బయలుదేరాలి. ‘ఫ్రెండ్లీ’ అనే సంకేతాన్ని జారీ చేసిన తర్వాత విమానాలు టేకాఫ్ అవుతాయి. మన గగనతలంలో మనవి కాని విమానాలు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే వాటిని అడ్డగించడానికి మన ఎయిర్ క్రాఫ్ట్‌ను పంపించాలి. అందుకోసం యుద్ధ విమానాలు సిద్ధంగా ఉంటాయి. అది అనుమానాస్పద విమానానికి ఎదురుగా వెళ్లి రెక్కలు ఊపుతుంది.

ఇలా రెక్కలను కదిలించడం అంటే... నీ కదలికలను అనుమానిస్తున్నామని ఎదుటి విమానంలోని పైలట్‌కి సంకేతం ఇవ్వడం! శత్రు విమానం అయితే ఈ సంకేతానికి స్పందించకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు వెళ్తుంటుంది. సంకేతాలకు స్పందించడం లేదనే సమాచారాన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉన్న పైలట్ మాకు చేరవేస్తాడు. అలాంటప్పుడు పర్యవేక్షణ బృందం తరఫున ఫైరింగ్ ఆదేశాలు జారీ చేస్తాం.
 (మాజీ రింగ్ కమాండర్ టి.జె.రెడ్డి ఇచ్చిన సమాచారంతో)

మరిన్ని వార్తలు