ఈ సప్త అంశాలూ అత్యంత కీలకం

4 Mar, 2018 01:59 IST|Sakshi

అవలోకనం
మన దేశంలో సొంత ప్రచారం కోసం ప్రభుత్వాలు వాణిజ్య ప్రకటనల రూపంలో చేసే ఖర్చు అంతా ఇంతా కాదు. అన్నిటికన్నా భారీయెత్తున ప్రచారానికి వ్యయం చేసేది కేంద్ర ప్రభుత్వమే. గత ఏడాది కేంద్రం ఇందుకోసం చేసిన వ్యయం రూ. 1,280 కోట్లు. డియోడరెంట్లు మొదలుకొని లక్స్‌ సబ్బు, తాజ్‌మహల్‌ టీ వరకూ అన్నిటినీ ఉత్పత్తి చేసే హిందూస్తాన్‌ యూనీలీవర్‌ సంస్థ వార్షిక ప్రకటనల వ్యయం రూ. 900 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్వీయ ప్రచారానికి బాగానే నిధులు కేటాయిస్తున్నాయి.

ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలపై ఈ వారంలో కనబడినంత ఆసక్తి దేశంలో మును పెన్నడూ లేదు. అలవాటు ప్రకారం నేను శనివారం వేకువజామునే లేచి 7 గంట లకు న్యూస్‌చానెళ్లను గమనించేసరికి ఆశ్చర్యం కలిగింది. అందరూ వారి వారి నిపు ణులతో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం సిద్ధంగా ఉన్నారు! ఇదొక మంచి పరిణామం. కొన్నేళ్లక్రితం ‘ఇండియా టుడే’ మాగజిన్‌ రాసిన సంపాదకీయ వ్యాఖ్య నాకు గుర్తుంది.

మన దేశం ఈశాన్య భారతాన్ని ఏవిధంగా నిర్లక్ష్యం చేస్తున్నదో చెప్పడం ఆ వ్యాఖ్య సారాంశం. చిత్రమే మంటే ఎనిమిది రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల గురించిన కథనాలున్న ఆ సంచిక ముఖపత్రంపై కేవలం అయిదు పెద్ద ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలకు సంబం ధించిన వివరాలున్నాయితప్ప అదే సమయంలో జరుగుతున్న ఈశాన్య రాష్ట్రాల ప్రస్తావనే లేదు. ఇప్పుడు ఈ వైఖరి మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే దీన్ని మంచి పరిణామమని అన్నాను.

ఈ ఫలితాలు... ముఖ్యంగా త్రిపుర ఫలితాలు ఆసక్తిదాయకమైనవి. ప్రపం చంలోని ప్రధాన ప్రజాస్వామ్య వ్యవస్థల్లో క్రియాశీల కమ్యూనిస్టు పార్టీలు పనిచే స్తున్న దేశాల్లో మనది ఆఖరుదని చెప్పుకోవాలి. ఇంతక్రితంతో పోలిస్తే ఒక శక్తిగా కమ్యూనిస్టుల ప్రాధాన్యం తగ్గి ఉండొచ్చుగానీ వారి వల్ల రాజకీయాలకు విలువ పెరుగుతోంది. అయితే నేనివాళ కాంగ్రెస్‌పై కేంద్రీకరిస్తాను.

గత నెలలో రాజస్థా న్‌లో వెలువడిన కొన్ని ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ ‘రాష్ట్రాలు గెలుచుకోవాలంటే మీరు మున్సిపల్‌ ఎన్నికల్లో, వార్డు ఎన్నికల్లో నెగ్గాలి. ఆ ఎన్నికలు ఒక సంస్థకు పునాదిలాంటివి. మనం రాష్ట్రాలు నెగ్గాలి. రాష్ట్రాల్లో మంచి సంఖ్యలో సీట్లు గెల్చుకోకుండా ఏ పార్టీ కూడా జాతీయ స్థాయిలో న్యూఢిల్లీని గెల్చుకోవాలన్న ఆలోచన చేయలేదు’ అన్నారు.

జాతీయ పార్టీలకు రాష్ట్రాల్లో గెలుపు ఎందుకంత ముఖ్యం? ప్రాంతీయంగా ఉండే అధికారానికి ఉండే ప్రాముఖ్యతేమిటి? చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అధికారం లేకుండా పోయింది గనుక వీటి గురించి పరిశీలించక తప్పదు. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల తర్వాత ఇందులో కొంత మార్పు ఉండొచ్చు. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి

ఎందుకు కీలకమైనవి?
మొదటి ప్రయోజనం స్పష్టమైనదే. అధికారంలో ఉండటమే రాజకీయాల పర మార్ధం. అధికారంలో ఉండే పార్టీ తన సిద్ధాంతంలోని నిర్దిష్టతలను అమల్లోకి తెచ్చి ఎజెండాను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు బీజేపీ హర్యానా, మహారాష్ట్రల్లో పశు మాంసాన్ని, పశువధను నిషేధించడం ద్వారా దాన్ని జాతీయ స్థాయి అంశంగా మార్చింది.

కార్పొరేషన్‌లు, రాష్ట్ర అసెంబ్లీల్లో అధికారం ఉంటే రాజకీయ నాయ కులకు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం రెండో ప్రయోజనం. పొద్దస్తమానం ప్రజలు విద్యుత్‌ కనెక్షన్లు మొదలుకొని తమ పిల్లల అడ్మిషన్ల వరకూ ఎన్నో అంశాల కోసం రాజకీయ నాయకులపై ఒత్తిళ్తు తెస్తుంటారు. అధికారంలో ఉన్న పార్టీ ఇవన్నీ చేయగలదు తప్ప ప్రతిపక్షం చేయ లేదు. మూడోది–నిధుల సేకరణ. ఇది రెండు మార్గాల్లో పనిచేస్తుంది.

వాస్తవం ఏమంటే రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా అవినీతిపరులు కాకపోయినా తమ పార్టీ కోసం విరాళాలు తీసుకుంటారు. ప్రముఖ జర్నలిస్టు స్వర్గీయ ధీరేన్‌ భగత్‌ మాజీ ప్రధాని వీపీ సింగ్‌పై తాను రాసిన ‘కాంటెంపరరీ కన్సర్వేటివ్‌’ పుస్తకంలో దీన్ని గురించి చక్కగా చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీకి కార్పొరేట్ల నుంచి అధి కారికంగానే నిధులు ప్రవహిస్తాయి.

అలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియ నిది కాదు. నాలుగో అంశం– ఆ వచ్చిన నిధుల్ని అభ్యర్థులు ఖర్చు పెట్టడానికి సంబంధించిన విషయం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీచేసే వారు ఇతోధికంగా నిధులు ఖర్చు పెట్టలేరు. ఇది వారిని రంగంలో తగిన పోటీ దారుగా నిలపలేదు. అయిదో అంశం– అధికారంలో ఉన్నవారికి సమాచారాన్ని చేరేసే ప్రక్రియను నియంత్రించే శక్తి ఉండటం. ఉదాహరణకు ప్రభుత్వాలు వాణిజ్య ప్రకటనలకు చేసే వ్యయం.

దేశంలో భారీగా ఖర్చు చేసే ప్రకటనకర్త కేంద్ర ప్రభుత్వం. గత ఏడాది అది ప్రధాని, ఆయన పథకాల ప్రచారం కోసం రూ. 1,280 కోట్లు వ్యయం చేసింది. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే... డియోడరెంట్లు మొదలుకొని లక్స్‌ సబ్బు, తాజ్‌మహల్‌ టీ వగైరాల వరకూ అన్నిటినీ ఉత్పత్తి చేసే హిందూస్తాన్‌ యూనిలీవర్‌ సంస్థ వార్షిక వాణిజ్య ప్రకటనల వ్యయం రూ. 900 కోట్లు. దేశంలోని టెలికాం సంస్థలు అన్నీ కలిసి వాణిజ్యప్రకటన కోసం చేసే ఖర్చు కేంద్ర వ్యయం కన్నా చాలా తక్కువ.

రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సొంత ప్రచారం కోసం తగిన నిధుల్ని కేటాయిస్తుంటాయి. ఢిల్లీలోని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం 2015లో ప్రచారం కోసం రూ. 526 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఆరోది–ఇలా ప్రచారం కోసం భారీ యెత్తున చేసే వ్యయమంతా మీడియాను పాలకపక్షం వైపు నిలుపుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పత్రికల విషయంలో ఇది వాస్తవం. ఉదాహరణకు దేశంలో కోటిన్నరమంది పాఠకులుండి ఏడో స్థానంలో నిలిచిన ‘రాజస్థాన్‌ పత్రిక’ వసుం ధర రాజే ప్రభుత్వం తమకు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

బహుశా ఆ ప్రభుత్వానికి ‘రాజస్థాన్‌ పత్రిక’ అనుకూలంగా లేకపోవడమే ప్రకటనలు ఆపడానికి కారణం కావొచ్చు. ఏడోది, ఆఖరుది–ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం. ఎన్నికల సంఘం దీనిపై కొంతవరకూ కన్నేసి ఉంచుతోంది. కానీ ఎన్నికల తేదీలు ప్రకటించాకే అది మొదలవుతుంది. మిగిలిన అయిదేళ్లూ అధికారంలో ఉన్న పార్టీ పోలీసుల్ని ఉపయోగించుకోవచ్చు.

అస్మదీయులకు పదవులు పంచిపెట్టొచ్చు. ప్రభుత్వ విభాగాల న్నిటినీ వినియోగించుకోవచ్చు. దుర్వినియోగం కూడా చేయొచ్చు. అడిగేవారుం డరు. రాజకీయ పార్టీలను పోషించే, నిలబెట్టే అంశాలు మన దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. స్థానిక అధికారం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ నిలకడగా, క్రమబద్ధంగా శక్తి పుంజుకుని కొనసాగనట్టయితే 2019లో రాహుల్‌గాంధీ జాతీయ స్థాయిలో స్వత స్సిద్ధమైన పోటీదారుగా మారడం కష్టం.

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
ఆకార్‌ పటేల్‌
aakar.patel@icloud.com

>
మరిన్ని వార్తలు