మట్టి మనుషుల మనిషి బి.యన్‌.

9 May, 2019 01:18 IST|Sakshi

భూమినే నమ్ముకొని జమీందారులు, జాగీర్‌దార్లు, దేశ్‌ముఖ్‌ల అరాచకాల కింద బతుకుతున్న మట్టి మనుషులకు భూమి, భుక్తి, వెట్టిచాకిరి నుండి విముక్తి కావాలని, నిజాం నవాబు దుర్మార్గపు పాలనను మట్టుపెట్టాలని సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సేనాని బి.యన్‌. ఆయన పేరు వినగానే శత్రువుల గుండెలు గుబేలుమంటాయి. ఆయనను స్మరించుకుంటేనే సాయుధ పోరాట స్మృతులు ఉప్పెనలా ఎగిసిపడతాయి. భీమిరెడ్డి నర్సింహ్మరెడ్డి (బి.యన్‌) దున్నే వానికే భూమి కావాలని, విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఏర్పడాలని, తెలుగు జాతి ప్రజల ఐక్యత కోసం తపించిన గొప్ప వ్యక్తి. 

1922లో నల్గొండ జిల్లా (ప్రస్తుతం సూర్యాపేట జిల్లా) తుంగతుర్తి మండలం, కర్విరాల కొత్తగూడెం గ్రామంలో భీమిరెడ్డి చొక్క మ్మ–రామిరెడ్డి దంపతులకు మొదటి సంతానం బి.యన్‌. ఆయన బాల్యమంతా అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే గడిచింది. ఆ రోజులలో గ్రామాలలో విద్యావకాశాలు లేకపోవడంతో నాల్గో ఫారమ్‌ చదవటానికి సూర్యాపేట చేరాడు. తెలుగు చదవాలనే మమకారం ఉన్నప్పటికి ఉర్దూ చదవక తప్పలేదు.

నల్గొండ జిల్లాలో 8వ తరగతి వరకు చదివి, తరువాత  హైదరాబాద్‌లో బంధువుల సహకారంతో 9,10 తరగతులు ఒకేసారి పరీక్ష  రాసి ద్వితీయ శ్రేణిలో పాసైనాడు. చదువుతున్న కాలంలోనే జాతీయంగా వందేమాతర ఉద్యమం, అంతర్జాతీయంగా ప్రపంచ యుద్ధం బి.యన్‌.లో రాజకీయ ఆసక్తిని పెంచాయి. సరిగ్గా అదే సమయంలో నిజాం పాలనకు వ్యతిరేకత ప్రభంజనంలా మారటం మొదలైంది. 1941–42లో నిజాంకు వ్యతిరేకంగా విద్యార్థులను సమీకరించడానికి బి.యన్‌. నడుం బిగించారు. 1942 వరంగల్‌లో జరిగిన 9వ ఆంధ్ర మహాసభలో తోబుట్టువులతో, అనుచరులతో కలిసి వాలంటీర్‌గా పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీ్ట స్ఫూర్తితో ఎర్రజెండా నీడన గ్రామాలలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి.  బి.యన్‌ ఆధ్వ ర్యంలో రావుల పెంట, కోటపాడు, చివ్వెంల గ్రామాలలో జరిగిన దాడులతో సేకరించిన ఆయుధాల ద్వారా పోరాటం ముందుకు సాగింది.

1947 అధికార మార్పిడి తరువాత ఇటు నిజాం సైన్యాలతో, అటు యూనియన్‌ సైన్యాలతో తలపడవలసి వచ్చింది. దళాలను మైదాన ప్రాంతాల నుండి అడవి ప్రాంతాలకు మలిపి గోదావరి పరీవాహక ప్రాంత రెండు వైపులా  సుమారు 200 గ్రామాలలో ఉద్యమాన్ని విస్తరింప జేశారు. ఉన్నతమైన ఆశయాలతో ఏర్పడిన మార్క్సిస్టు పార్టీలో ‘సామాజిక న్యాయం’ కొరవడడంతో సొంతంగా సీపీఎం (బి.యన్‌) పార్టీని స్థాపించారు. తరువాత మద్దికాయల ఓంకార్‌ ఏర్పరచిన ఎంసీపీఐ(యు)లో తన పార్టీని విలీనపరిచి చివరి వరకు పొలిట్‌ బ్యూరో సభ్యునిగా కొనసాగారు. 2008 మే 9న బి.యన్‌. అమరులైనారు. ఆ మట్టి మనుషుల మనిషికి సామాన్యులెందరో జోహార్లు పలికారు.  
(నేడు బి.యన్‌. 11వ వర్ధంతి) 

-వనం సుధాకర్, ఎంసీపీఐ(యు)
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
మొబైల్‌: 99892 20533 

 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గంజాయిపూత పండితే..!

‘గుజరాత్‌ మోడల్‌’ మారేనా?

చే లాంటి యోధుడు మళ్ళీ పుట్టడు

నాగరిక చట్టం అడవికి వర్తించదా?

హక్కులు దక్కితేనే రైతుకు రక్ష!

కనీస మద్దతు ధర ఒక భ్రమ

నయవంచన వీడని ‘నారా’గణం

లక్షమంది బీసీలకు గురుకులాల విద్య

‘కమలం’ ఆశలు ఫలిస్తాయా?

ధిక్కార స్వరం గిరీష్‌

ప్రత్యేక హోదా ఏపీ జీవనాడి

సోనియా గాంధీ(యూపీఏ) రాయని డైరీ

ఉగ్రరూపం దాలుస్తున్న వాయు కాలుష్యం

వడివడి అడుగులు!

రెపో రేటు తగ్గింపు వృద్ధి సంకేతమేనా?

శాపనార్థాలకి ఓట్లు రాలవ్‌

క్రికెట్‌లో ‘బలిదాన్‌’ ఎందుకు?

ప్రజాప్రయోజనాలు రహస్యమా? 

త్రిభాషా శిరోభారం ఇంకెన్నాళ్లు?

ప్రగతికి పనిముట్టు పుస్తకం

‘సబ్‌కా విశ్వాస్‌’లో వాళ్లకు చోటుందా?

ప్రేమతత్వాన్ని ప్రోదిచేసే ఈద్‌

పచ్చగా ఉండాలంటే.. పచ్చదనం ఉండాలి

నిష్క్రమణే నికార్సయిన మందు!

స్వయంకృత పరాభవం

‘ఏపీ అవతరణ’ తేదీ ఎప్పుడు?

విదురుడిలా! వికర్ణుడిలా!

నితీశ్‌ కుమార్‌ (బిహార్‌ సీఎం)

పెడధోరణికి సమాధి–ప్రగతికి పునాది

అభివృద్ధి అర్థాలు వేరు బాబూ!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గాయకుడు రఘు, డ్యాన్సర్‌ మయూరి విడాకులు

అందుకే నానాకు క్లీన్‌ చిట్‌

విశాల్‌... నా ఓటు కోల్పోయావ్‌

భార్గవ రామ్‌ @ 1

సిస్టరాఫ్‌ జీవీ

కరీనా సరేనా?