11 Oct, 2018 01:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అభిప్రాయం

‘భరత్‌ అనే నేను’ అన్న సినిమాలో అనుకోకుండా హీరో ముఖ్యమంత్రి అవు తాడు. గందరగోళంగా ఉన్న ట్రాఫిక్‌ను చూసిన అతను జరిమానాలను విప రీతంగా పెంచేస్తాడు. జరి మానాలను పెంచడం అవ సరమా? ఇప్పుడున్న పరిస్థి తులకు అనుగుణంగా, పడిపోయిన రూపాయి విలు వకు దగ్గర్లో ఈ జరిమానాలు ఉన్నాయా? అనే సందే హాలు సహజంగానే వస్తాయి. డబ్బును జప్తు చేసు కోవడమే జరిమానా. కోర్టులు విధించే జరిమానాకు గాను ముద్దాయి చెల్లించే రుసుము. ట్రాఫిక్‌ జరిమా నాలు నేరాలే అయినా ఆ నేరాలు చేసిన వ్యక్తులు నేర స్తులు కాదు. చట్టాన్ని ఉల్లంఘించినవారుగా వారిని పరిగణిస్తారు. జరిమానా అనేది ఆర్థికంగా నష్టం కలి గిస్తుంది కానీ అది సమాజంలో ఆ వ్యక్తిపై మచ్చగా ఉండదు. జైలుకు వెళ్లినప్పుడు కలిగే మనోవ్యథ జరిమానా చెల్లించడంలో ఉండదు. సంస్కరణ అనేది సాధ్యం కాని కేసుల్లో కోర్టులు సాధారణంగా నేర స్తులకి జరిమానాలను విధిస్తాయి. దానివల్ల ఆ వ్యక్తి మళ్లీ ఆ నేరాలు చేయకుండా ఉంటాడన్న భావనతో కోర్టులు అలా జరిమానాలు విధిస్తుంటాయి. ఇప్పుడు మనకు చాలా శాసనాలు వచ్చేశాయి. గతంలో ఉన్న శాసనం ఒక్కటే. అది భారతీయ శిక్షాస్మృతి. అది తయారు చేసినప్పుడు జరిమానా గురించి చాలా చర్చలు జరిగాయి. కొన్ని నేరాలకు జరిమానా విధించడమే సరైన శిక్ష అని వారు నిర్ధా రణకి వచ్చి, ‘‘ప్రపంచవ్యాప్తంగా జరిమానాలు విధించడం అనేది ఉంది. దాని వల్ల చాలా ప్రయో జనాలు ఉన్నాయి. అందుకని జరిమానాలని కోర్టులు విధించాలని మేం ప్రతిపాదిస్తున్నాము!’’ అని అభి ప్రాయపడ్డారు. భారత శిక్షాస్మృతి కోసం మెకాలే 1861లో గట్టి పునాదిని వేశారు. చాలా నేరాలకి జరిమానాలను ఆయన ప్రతిపాదించారు. స్వాతం త్య్రం వచ్చాక మెకాలే రూపొందించిన శిక్షాస్మృతికి కొనసాగింపుగా భారతీయ శిక్షాస్మృతి నడుస్తోంది. 

నేరస్తులను జైల్లో ఉంచడం వల్ల ప్రభుత్వ ఖజా నాకి నష్టం ఎక్కువ జరుగుతుంది. అందుకని కొన్ని నేరాలకి ఎక్కువ జరిమానాలు విధించడం వల్ల ఆ నేరాలు తిరిగి చేయడానికి మనుషులు వెనుకంజ వేస్తారనీ, ఇంకా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని మెకాలే భావించారు. అయితే, నేరస్తుని ఆర్థిక స్తోమతను దృష్టిలో ఉంచుకుని కోర్టులు జరి మానాలను విధించాలని ఆయన చెప్పారు. భార తీయ శిక్షాస్మృతిలోని నేరాలను గమనిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. తాగి రోడ్డు మీద గొడవ చేస్తే 10 రూపాయల జరిమానాను కోర్టులు విధిం చాలి. స్వచ్ఛందంగా ఎవరైనా గాయపరిస్తే రూ. 500 జరిమానాని, అదే వి«ధంగా వ్యక్తుల ప్రాణాలకి, రక్ష ణకి హాని కలిగిస్తే రూ.200 జరిమానాను, ఒక మందుకు బదులు మరో మందు విక్రయిస్తే రూ.100 జరిమానాను కోర్టు విధించే విధంగా శిక్షాస్మృతిలో నిబంధనలు ఏర్పరిచారు. భారతీయ శిక్షాస్మృతిని రూపొందించింది 1860లో. అంటే 158 సంవత్స రాల క్రితం అన్నమాట.

అప్పుడున్న రూపాయి విలువని పోలిస్తే ఈ జరిమానా అధ్వానంగా అనిపి స్తుంది. అందుకే 158 ఏళ్ల క్రితం నిర్ణయించిన 10 రూపాయల జరిమానాను తగ్గిన రూపాయి విలువ కారణంగా ఎంతకు పెంచాలోనని ఆలోచిస్తే కాస్త భయం వేసినా, పెంచడం అవసరమనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జరిమా నాల విషయంలో అవసరమైన సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జరిమానాను విధించే సమయంలో కోర్టులు నేర తీవ్రతను, ముద్దాయి గత చరిత్రను పరిగణనలోకి తీసుకుంటాయి. జైలు శిక్షను లేదా జరిమానాను లేదా రెండింటినీ విధించే అవకాశం ఉన్న కేసులో అవసరమని భావించినప్పుడు కోర్టులు రెండు శిక్షలనూ ఖరారు చేస్తాయి. జరిమానా విధించే విషయంలో ముద్దాయి ఆర్థికస్తోమతని కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి. అదే విధంగా ఆర్థిక నేరాలు చేసే వ్యక్తుల విషయంలో వైట్‌కాలర్‌ నేరాలు చేసే వ్యక్తుల విషయంలో జరి మానాలను భారీగానే విధించాల్సి ఉంటుంది. వారు మళ్లీ అలాంటి నేరాలు చేయ కుండా నిరోధించడానికి ఇది అవసరం. జరిమానా చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి ఒకే సంఘ టనలో రెండు మూడు నేరాలు చేసినప్పుడు ఆ శిక్షలు ఏకకాలంలో అమలయ్యే విధంగా కోర్టులు ఆదేశించే వీలుంది. కానీ జరిమానా చెల్లించనపుడు అనుభవిం చాల్సిన శిక్ష మాత్రం వాటి తోబాటు ఏకకాలంలో అమలయ్యే అవకాశమే లేదు. నేరానికి వేసిన శిక్షలు అమలయ్యాక ఈ శిక్ష కొనసాగుతుంది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 64 ఈ విషయం చెబుతోంది. 1860లో తయారైన ఈ శిక్షా స్మృతిలో జరిమానా విష యంలో ఇంత బాగా ఆలోచించారు. మన శాసన వ్యవస్థకి ఈ జరిమానాలపై ఆలోచించే తీరుబడి లేదు. జైల్లో ఉంచితే ఆ భారం రాజ్యం మీద పడుతుందని గ్రహిస్తే మంచిది. జరిమానాలను ముద్దాయి ఆస్తి నుంచి వసూలు చేసే అవకాశం ఉంది.


మంగారి రాజేందర్‌ 
వ్యాసకర్త కవి, రచయిత ‘ 94404 83001

 

మరిన్ని వార్తలు