నయవంచనపై హస్తినలో సమరభేరి

27 Dec, 2018 06:48 IST|Sakshi

సందర్భం

విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించా లని, రాజధానిని సజా వుగా నిర్మించాలని, పోల వరం ప్రాజెక్టులో అవకత వకలు లేకుండా అవినీతి రహితంగా నిర్మించాలని, సేద్యపు నీటి ప్రాజెక్టు లను తగు ప్రాధాన్యతతో నిర్మించాలని రైతు ప్రయోజనాలు కాపాడాలని నిత్యం నినదించిన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నేడు ఢిల్లీ కేంద్రంగా నరేంద్ర మోదీ, చంద్రబాబు రాష్ట్రా నికి ప్రత్యేక హోదా గురించి అవలంబించిన మోసంపై సమర శంఖారావం పూరించను న్నారు. ప్రత్యేక హోదా ప్రాముఖ్యతను వైఎస్‌ జగన్‌ గుర్తించినంతగా రాష్ట్రంలో ఏ పార్టీ నాయ కుడు గుర్తించలేదు. హోదా సాధనకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెడుతూ.. కొన్ని సందర్భా లలో ఆమరణ దీక్ష కూడా చేపడుతూ ఆయన పోరాటాలు చేశారు. తన ప్రజాసంకల్ప యాత్రలో ప్రత్యేక హోదా ప్రాముఖ్యతపై, కేంద్రంలో నాలుగేళ్లు అధికారంలో కొనసాగి హోదా సాధించని బాబు వైఫల్యంపై ప్రసం గాలు చేశారు. మోదీ, వెంకయ్య, పవన్‌కల్యాణ్, బాబు జోడీ కట్టిన 2014 ఎన్నికలలో హోదాని ఎన్నికల వాగ్దానంగా తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు. ఈ నలుగురూ తమకు మాత్రమే సాధ్యమైనరీతిలో అవకాశవాద కపట రాజకీయాలకు పాల్పడి ప్రత్యేక హోదాను అట కెక్కించడానికి వివిధ పద్ధతులలో ప్రయత్నాలు చేశారు.

ఉండవల్లి, జయప్రకాష్‌ నారాయణ, పవ న్‌కల్యాణ్‌ ఈమధ్య ఒక వేదికగా కొనసాగిన సమయంలో.. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ పార్లమెంట్‌లో మోదీకి వ్యతిరేకంగా అవి శ్వాస తీర్మానం ప్రవేశపెడితే, వివిధ రాష్ట్రాలలో పర్యటించి 50 మంది పార్లమెంట్‌ సభ్యులకు మించి మద్దతు కూడబెడతానంటూ పవన్‌ కల్యాణ్‌ ప్రధాన ప్రతిపక్ష నేతకు సవాల్‌ విసి రారు. దానికి ప్రతిపక్ష నేత తనదైన శైలిలో, తమ పార్టీ ఎంపీలతో అవిశ్వాస తీర్మానాన్ని మోదీకి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రవేశ పెట్టడా నికి సిద్ధమేనని, అయితే పవన్‌కల్యాణ్‌ హోదా అంశంపై తన రాజకీయ స్నేహితుడైన చంద్ర బాబు మద్దతు కూడగట్టాలని లేదా బాబుతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా, దానికి తాము మద్దతు ఇస్తామని జగన్‌ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నిజాయితీకి హోదా పట్ల నిబ ద్ధతకు ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా? ఆ సవాల్‌ను బాబు, ఆయన రాజకీయ కవచమైన పవన్‌కల్యాణ్‌ ఇద్దరూ స్వీకరించలేదు. పైగా వైఎస్సార్‌సీపీ లోక్‌సభలో అనేక పార్టీల మద్దతు కూడగట్టి అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చి లోక్‌సభలో జరిపిన ఆందోళనకు మద్దతు ఇవ్వ కుండా బాబు తనదైన విద్రోహకరమైన నైపు ణ్యంతో పలాయనవాదం చేపట్టారు. పంచపాం డవుల్లా ఏపీ భవన్‌లో ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలను బాబు కానీ నేటి ఆయన రాజకీయ స్నేహితుడు రాహుల్‌గాంధీ పార్టీ సభ్యులుగానీ పరామర్శిం చలేదు. మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ కాగా, ఆ పార్టీ తీర్మా నాన్ని అంగీకరించి చర్చించడానికి మోదీ ప్రభుత్వం సాహసం చేయలేదు. పైగా వైఎ స్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలను అంగీకరించ డంలో విపరీతమైన జాప్యం చేసి హోదాపై ఉప ఎన్నికలలో ప్రజాభిప్రాయం తమకు వ్యతిరే కంగా ఉంటుందని వారి రాజీనామాలు అల స్యంగా అంగీకరించారు. ఈ చర్య తమ పార్టీ తప్పిదమని ఈ అంశం పై తమ పార్టీలో చర్చ జరిగిందని, చర్చకు అవకాశం ఇచ్చి రాజీనామా లకు ఆమోదం తెలిపి ఉండాల్సి ఉందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహ రావు ఓ సందర్భంలో బాహాటంగానే అంగీకరిం చారు. ఒకవైపు ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ తన రాజకీయ పోరాట ప్రస్థానం కొనసాగి స్తూనే ఉంది. మరోవైపు విద్రోహాలలో ఆరితేరిన బాబు హోదాపై.. విభజన హామీలు అమలు పరచడంలో మోదీ వైఫల్యంపై తానూ పోరాడు తున్నాననే భావన కల్పించడానికి విపరీతంగా శ్రమిస్తున్నారు. 

పోలవరం ప్రాజెక్టులో నాణ్యత ప్రమా ణాలు పాటించలేదని ఇనుము, ఉక్కు నాసిరక మైనవి వాడారని కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం రాత పూర్వకంగా ఇచ్చిన నివేదిక బాబు నిజాయితీ బండారాన్ని తెలియజేస్తుంది. 

(రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మోసంపై నేడు ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం సందర్భంగా)


-ఇమామ్‌
(వ్యాసకర్త కదలిక సంపాదకులు)
మొబైల్‌ : 99899 04389

మరిన్ని వార్తలు