ఆ ఇద్దరి కలయిక భవిష్యత్తుకు మలుపు

28 May, 2019 01:04 IST|Sakshi

సందర్భం

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పుకోవా లని  ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌ కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పిలుపుని వ్వడం తెలుగు రాష్ట్రాల భవి ష్యత్తుకు పునాది ఏర్పర్చ నుంది. ముఖ్యంగా జలవనరులను ఎలా పంపిణీ చేసుకోవచ్చో కేసీఆర్‌ ఇచ్చిన సూచన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంతవరకు  అత్యంత ఆవశ్యకమైనది. 

కృష్ణా, గోదావరి నదులు వందలాది కిలోమీటర్ల పరిధిలో జీవనదులను తలపింపజేస్తూ నిరంతరం నీటి ప్రవాహంతో కొనసాగడం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రకృతి ప్రసాదించిన ఓ గొప్ప వరం. జలవనరుల వినియోగం ద్వారా ప్రజలలో భావ సమైక్యతను, అభివృద్ధిని సాధించవచ్చని అపర భగీరథుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులను చేపట్టారు. ఏపీలో అనంత పురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూ బ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు నిరంతర కరువు పీడిత జిల్లాలుగా 1971 ఇరిగేషన్‌ కమిషన్‌ గుర్తించింది. ఈ ప్రాంతాల్లో తాగునీరు, సాగునీటి వసతులు కల్పిం చడం ఒక సవాలుగా గతంలో ఉండేది. జల యజ్ఞంలో చేపట్టిన అనేక పథకాలు తెలుగు గంగ, శ్రీశైలం కుడికా లువ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, అలాగే తెలంగా ణలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ, నెట్టెంపాడు, కల్వ కుర్తి, భీమ, కోయిల్‌ సాగర్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ కేటా యించిన 811 టీఎంసీల పరిధి దాటి మిగులు జలా లతో చేపట్టినవే. ఈ ప్రాజెక్టులకు ఒక సాధికారిక నికర జలాలు కేటాయించి ఆ ప్రాంతాల్లో ప్రజలకు సాగు నీరు, తాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. ఈ వైపుగా గోదావరిలో లభించే వేలాది టీఎంసీల నీటి లభ్యతను మనం పోలవరం ప్రాజెక్టుతో పాటు విని యోగించుకోవాల్సిన అవసరం ఉంది. 

మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీకి కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్నేహపూర్వకంగా కలిసినప్పుడు వారి మధ్యన కృష్ణా, గోదావరి నదుల్లో వేలాది టీఎంసీలు సముద్రం పాలు కావడం గురించి చర్చ చోటు చేసుకోవడం, ఆ నీటిని ఎగువన తెలం గాణ, రాయలసీమ జిల్లాలకు వినియోగించుకోవడం గురించి చర్చ రావడం కరువు పీడిత ప్రాంతాల ప్రజ లకు ఓ వరం. కృష్ణా, గోదావరి నదులలో నీటి లభ్యత ఉండడం, ఆ నీటిని వినియోగించుకోవడానికి ఇప్ప టికే పులిచింతల, కృష్ణా బ్యారేజ్, నాగార్జున సాగర్‌ లాంటి ప్రాజెక్టులు ఎగువన ఉండటం, నీటిని ఎగు వకు తరలించడానికి కావాల్సిన ఎత్తిపోతల సాంకేతిక పరిజ్ఞానం మన వద్ద ఉండడం మరో అనుకూల అవకాశం. ప్రాణహిత, చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లాంటి అనేక పథకాలు ఎత్తిపోతల ప్రాతి పదికగా చేపట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. దిగు వన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల వినియోగం కోసం ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలతో చర్చలు జరిపి, కృష్ణా, గోదావరి జలాల వినియోగం కోసం సానుకూలమైన వాతావరణంలో చర్చించాలి. నిజంగా ఆ వైపుగా కేసీఆర్, వైఎస్‌ జగన్‌ చర్చలు జరపడం చాలా  సంతోషించదగ్గ పరిణామం. 

నీరే సంపద, నీరే సంస్కృతి, నీరే చైతన్యం, నీరే జీవితం కాబట్టి నాగరికతలు అభివృద్ధి జరగాలన్నా నీటి వినియోగం ఆయా ప్రాంతాల్లో జరగాలి. తక్కువ నీటితో ఎక్కువ వినియోగం జరపడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకాలు ఉన్నాయి. వీటితో వ్యవసాయాభివృద్ధి, తాగునీటి సమస్యలు పరిష్కరించవచ్చు. జాతీయ అవసరాలు, జాతీయ, ప్రాంతీయ అభివృద్ధి సమస్యలు, ఒక ఎజెం డాగా చర్చ జరపాల్సిన ఆవశ్యకత గురించి ఇటీవల ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రస్తావించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు నేడు తమ మధ్య నున్న అంతర్యాలు తొలగించుకుని విభ జన విసిరిన సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని, పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీకి అండదండగా ఉంటామని, అభిప్రాయభేదాలు రాజ కీయ పార్టీల మధ్య ఉన్నవే కానీ, ప్రజల మధ్య స్నేహ సంబంధాలు బలంగానే కొనసాగుతున్నాయని పేర్కొ నడం చాలా ఆరోగ్యకరమైన పరిణామం. 

నిజంగా ఆంధ్రప్రదేశ్‌ గత ఐదేళ్లుగా చంద్రబాబు పాలనలో ఎలాంటి అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయి, ప్రజలు ఎంతటి దుర్మార్గమైన పాలనను ఎదుర్కొన్నారో మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పు తేట తెల్లం చేస్తోంది. తెలుగురాష్ట్రాల చరిత్రలో 50 శాతానికి మించి జనాభా ఒకే ఒక పార్టీకీ, వైఎస్సార్‌సీపీకి అను కూలంగా, బాబుకు వ్యతిరేకంగా నిలవడం గత పాలన పట్ల ప్రజాగ్రహం తీరుతెన్ను లను స్పష్టం చేస్తోంది. ఇచ్చిన మాట నుంచి పక్కకు తప్పనని, ప్రజా తీర్పు తర్వాత కూడా విస్పష్టంగా ప్రక టించిన జగన్‌మోహన్‌రెడ్డి లాంటి నాయకుడిని ఏపీ సీఎంగా ఎన్నుకున్న ప్రజలకు నా జేజేలు.


ఇమామ్‌ 
వ్యాసకర్త కదలిక సంపాదకులు
మొబైల్‌ : 99899 04389

మరిన్ని వార్తలు