‘మలయాళ వెండితెర’పై మరక!

11 Jul, 2018 01:22 IST|Sakshi

‘అమ్మ’ నిర్ణయం మలయాళ సినీ పరిశ్రమ ‘మాలీవుడ్‌’ గురించి ఏం చెబుతోంది? ఇది స్త్రీలకు అనుకూలం కాదు. ఇది పురుషాధిక్య భావజాలంతో మహిళలను ద్వేషించే రీతిలో నడుస్తోంది. నటులు తమ మేకప్‌ తీసేయగానే సినీ పరిశ్రమ సుందర దృశ్యం కానేకాదని మోహన్‌లాల్, ఆయన సహచరుల బృందం ప్రవర్తన నిరూపించింది. ఈ రంగంలో స్త్రీల స్థానం పురుషులతో పోల్చితే కింది స్థాయిలోనే ఉంది. దిలీప్‌ వంటి శక్తిమంతులైన మగాళ్లే మాలీవుడ్‌లో పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది బాధితుల పక్షాన లేదని తేలిపోయింది. నటీమణులు, మహిళా సాంకేతిక నిపుణులు తమకు ఈ రంగంలో భద్రత ఉందనే భావనతో ఉండేలా చేయడంలో  ‘అమ్మ’ విఫలమైంది.

చేతులకు బేడీలతో ప్రసిద్ధ హాలీవుడ్‌  నిర్మాత హారీ వెయిన్‌స్టీన్‌ సోమవారం న్యూయార్క్‌ కోర్టులో నిలబడి ఉన్న దృశ్యాలను ప్రపంచ ప్రజలందరూ చూశారు. సినిమా అవకాశాల పేరుతో తమను లైంగికంగా, శారీరకంగా లొంగదీసు కున్నాడని వెయిన్‌స్టీన్‌పై 80 మందికి పైగా మహిళలు కిందటేడాది     అక్టోబర్‌ నుంచీ ఆరోపణలు చేయ డంతో అతను కోర్టు విచారణను ఎదుర్కొంటు న్నాడు. ఈ ఆరోపణల ఫలితంగా అమెరికాలో, ప్రపం చవ్యాప్తంగా ఇలాంటి లైంగిక వేధింపులు, బలత్కా రానికి గురయ్యామంటూ వందలాది మంది స్త్రీలు ‘మేము సైతం’ (మీ టూ) పేరుతో సామాజిక మాధ్య మాల్లో తమకు జరిగిన అన్యాయాలను ధైర్యంగా వెల్ల డించారు.

చివరికి ఈ అభియోగాలను పరిగణనలోకి తీసుకుని అత్యాచారం నేరంపై హాలీవుడ్‌కు చెందిన అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ నుంచి వెయిన్‌ స్టీన్‌ను బహిష్కరించారు. కానీ, లైంగిక వేధింపులు, రేప్‌ ఆరోపణలపై మాటలకే పరిమితమైన భారత చలన చిత్ర పరిశ్రమ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేరళలో ప్రముఖ నటి లైంగిక వేధింపులకు గురైన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. అనేక ప్రయోగాత్మక, ప్రగతిశీల సినిమాలకు పుట్టి నిల్లయిన మలయాళ సినీరంగంలో ఇలాంటిది  జర గడం ఎందరినో కలవరపెట్టింది.

బడా నిర్మాత అయిన వెయిన్‌స్టీన్‌పై ఆరోపణలు వచ్చిన విధంగానే కేరళ సినీ పరిశ్రమలో ఇలాంటి నేరానికి పాల్పడిన మలయాళ సూపర్‌స్టార్‌ దిలీప్‌పై కూడా లైంగిక వేధిం పుల కేసు నమోదైంది. ఆయన తనతో నటించిన ప్రముఖ నటిని అపహరించి, ఆమెను లైంగికంగా వేధించేలా కుట్రపన్నారనేది ఆయనపై కిందటి జూలైలో ఆరోపణలు వచ్చాయి. కేరళలోని కొచ్చి సమీ పంలో ఓ సినిమా షూటింగ్‌ ముగించుకుని తిరిగి వస్తుండగా ఆమెను అపహరించి లైంగిక దాడికి పాల్ప డ్డాడు. హీరో దిలీప్‌ను అరెస్ట్‌ చేశాక 85 రోజులు జైల్లో గడిపాడు. 24 ఏళ్ల సినీ జీవితంలో 130కి పైగా సిని మాల్లో నటించిన దిలీప్‌ను అత్యంత శక్తిమంతమైన మలయాళీ సినీ కళాకారుల సంఘం (ఏఎంఎంఏ– అమ్మ) నుంచి బహిష్కరించారు. 

దిలీప్‌ను ఈ సంఘం నుంచి వెలివేయాలని నిర్ణయించినప్పుడు మలయాళ అగ్రశ్రేణి హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌ ‘అమ్మ’ నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. అంటే లైంగిక దాడికి గురైన నటికి మద్దతుగా సినీరంగ ప్రముఖులంతా తమ విభేదాలు విస్మరించి ఏకమయ్యారనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, చివరికి జరిగింది వేరు. ఈ పెద్దలపై పెట్టుకున్న నమ్మకం వమ్మయింది. ‘అమ్మ’ అధ్యక్షునిగా మోహ న్‌లాల్‌ నాయకత్వాన జరిగిన తొలి సమావేశంలో అనూహ్యంగా దిలీప్‌ను మళ్లీ సంఘంలోకి తీసుకోవా లని నిర్ణయించారు. దిలీప్‌పై బహిష్కరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలనే అంశం సమావేశం ఎజెం డాలో ఉందని మోహన్‌లాల్‌ చెబుతున్నా, అది నిజం కాదని ఇతర సభ్యులు అంటున్నారు.

దిలీప్‌కు ‘అమ్మ’లో మళ్లీ స్థానం కల్పించాలని ‘ఏకగ్రీవంగా’ నిర ్ణయించినట్టు ప్రకటించడంతో వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ‘అమ్మ’  నిర్ణయంపై వెంటనే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బుధవారం నలు గురు నటీమణులు ‘అమ్మ’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సంఘం తమ ఆశయాలకు అనుగు ణంగా పనిచేయడం లేదనే విషయం అందరికీ చెప్ప డమే వారి రాజీనామా లక్ష్యం. లైంగిక దాడి నుంచి బయట పడిన నటి తొలుత ఈ నటీనటుల సంఘం సభ్యతం వదులుకున్నారు. 

నా ఫిర్యాదును పట్టించుకోలేదన్న నటి
హీరో దిలీప్‌ కుట్రకు బలైన నటి తన రాజీనామా లేఖలో తన బాధ వ్యక్తం చేశారు. ‘‘నాపై ఈ దాడికి ముందు నా సినిమా అవకాశాలను ఈ హీరో నాకు దక్కకుండా చేశాడు. అప్పుడు ఈ విషయమై నేను చేసిన ఫిర్యాదుపై ‘అమ్మ’ తగిన చర్య తీసుకోలేదు. ఇలాంటి దుర్మార్గమైన ఘటన జరిగినపుడు నేరం చేశాడనే ఆరోపణ వచ్చిన వ్యక్తిని ఈ సినీ నటుల సంఘం కాపాడడానికి ప్రయత్నించింది. ఇలాంటి సంఘంలో నేను సభ్యత్వం కలిగి ఉండడంలో ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసుకుని నేను రాజీ నామా చేస్తున్నాను’’ అని ఆమె వివరించారు.

దిలీప్‌కు మళ్లీ సభ్యత్వం ఇవ్వాలన్న ‘అమ్మ’ నిర్ణయం చట్టపరంగా చూస్తే ఆక్షేపణీయం కాదు. ఎందుకంటే, నేరం రుజువయ్యే వరకూ నిందితుడు అమాయకుడి కిందే లెక్క. కాని నిర్ణయం పూర్తిగా తప్పే. మళ్లీ సభ్య త్వం ఇవ్వడం ద్వారా ఆయన పక్షాన ఉన్నట్టు ఈ సంఘం చెప్పిందనే అభిప్రాయం కలుగుతోంది. దాదాపు ఏడాది పాటు ఈ సంస్థకు దూరంగా పెట్టడం ద్వారా దిలీప్‌కు వేసిన శిక్ష సరిపోతుందని తానే న్యాయమూర్తిననే భావనతో ‘అమ్మ’పై నిర్ణ యం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే, ఈ సంఘం నిర్ణయంపై వ్యతిరేక స్పందన రావడంతో దిలీప్‌ తాను నిర్దోషిగా తేలే వరకూ ‘అమ్మ’కు దూరంగా ఉంటానని ప్రకటించారు.

అయితే, ఇది దిలీప్‌ సమస్య కాదు. ఇది అమ్మ, మలయాళ సినీ పరిశ్రమ, అత్యంత వైవిధ్యభరి తమైన నటునిగా పేరున్న మోహన్‌లాల్‌ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం. ఈ సంఘటన జరిగిన వెంటనే కిందటేడాది ఫిబ్రవరిలో మోహన్‌ లాల్‌ దాడికి గురైన నటిపై ఎంతో సానుభూతితో, నిందితులపైన, అత్యాచారంపైన తీవ్ర ఆగ్రహంతో మాట్లాడిన తీరు చూశాక ఇప్పుడు ‘అమ్మ’ ఇలా వ్యవహరించడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ‘‘ఈ దాడికి పాల్పడిన నేరస్తులు జంతువుల కన్నా హీనం. వారికి తగిన శిక్ష విధించాలి.

ఈ శిక్ష ఇలాంటి నేర మనస్తత్వమున్న దుర్మార్గులకు గుణపాఠంగా ఉండాలి. ఇలాంటి వ్యక్తులను మనుషులని కూడా నేను పిలవను. ఇలాంటి దుర్మార్గాలు జరిగినప్పుడు మనం కేవలం కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన తెలిపే పద్ధతులకు స్వస్తి చెప్పాలి. ఇలాంటి పనులు చేయాలనే ఆలోచన కూడా ఎవరికీ రాకుండా మనం చట్టాల అమలు కట్టుదిట్టంగా జరిగేలా చూడాలి. ఇంతటి సంక్షోభ సమయంలో ఆమెకు నా హృద యపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తున్నా. ఎలాంటి జాప్యం లేకుండా ఆమెకు న్యాయం జరగాలి,’’ అంటూ మోహన్‌లాల్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఉద్వే గపూరితంగా రాశారు.

అయితే, దిలీప్‌ను మళ్లీ ‘అమ్మ’లోకి తీసుకోవాలన్న నిర్ణయంపై ఆయన వివరణ ఇస్తూ, ‘‘సంస్థ సర్వసభ్య సమావేశం ఏక గ్రీవ అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలన్న మౌలిక ప్రజాస్వామిక మర్యాదకు అనుగుణంగా మాత్రమే ‘అమ్మ’ నాయకత్వం ఈ నిర్ణయం తీసు కుంది’’ అని చెప్పిన కారణం దారుణంగా కనిపి స్తోంది. ఈ నటిపై దాడి చేసిన వారు జంతువుల కన్నా ఘోరమైన వ్యక్తులని ఈ సంఘటన జరిగిన వెంటనే వ్యాఖ్యానించిన మోహన్‌లాల్‌ 16 నెలల్లో తన అభిప్రాయం మార్చుకోవడానికి కారణం ఏమి టి? ‘అమ్మ’ తన నిర్ణయం ద్వారా తనకేమీ నైతిక విలువలు లేవని నిరూపించుకుంది. ఈ సంస్థ సన్మా ర్గంలో నడపడానికి మోహన్‌లాల్‌ చేసిందేమీ లేదు.తనను విపరీతంగా అభిమానించే కేరళ ప్రజల ముందు ఈ మలయాళ సూపర్‌స్టార్‌ పలుచన య్యారు. మరీ ముఖ్యంగా ఈ దాడికి గురైన నటి కళ్ల ముందు ఆయన ఇమేజ్‌ దిగజారిపోయింది.

మహిళా వ్యతిరేక సంస్థ ‘అమ్మ’!
‘అమ్మ’ నిర్ణయం మలయాళ సినీ పరిశ్రమ ‘మాలీ వుడ్‌’ గురించి ఏం చెబుతోంది? ఇది స్త్రీలకు అను కూలం కాదు. ఇది పురుషాధిక్య భావజాలంతో మహిళలను ద్వేషించే రీతిలో నడుస్తోంది. నటులు తమ మేకప్‌ తీసేయగానే సినీ పరిశ్రమ సుందర దృశ్యం కానేకాదని మోహన్‌లాల్, ఆయన సహచ రుల బృందం ప్రవర్తన నిరూపించింది. ఈ రంగంలో స్త్రీల స్థానం పురుషులతో పోల్చితే కింది స్థాయిలోనే ఉంది. దిలీప్‌ వంటి శక్తిమంతులైన మగాళ్లే మాలీ వుడ్‌లో పెత్తనం చెలాయిస్తున్నారు. ఇది బాధితుల పక్షాన లేదని తేలిపోయింది. నటీమణులు, మహిళా సాంకేతిక నిపుణులు తమకు ఈ రంగంలో భద్రత ఉందనే భావనతో ఉండేలా చేయడంలో  ‘అమ్మ’ విఫలమైంది.

ఈ దురదృష్టకర సంఘటన జరిగాక మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుకు స్థాపించిన ‘విమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’ అనే సంస్థను ‘అమ్మ’ తన తాజా నిర్ణ యంతో వెక్కిరించినట్టయింది. నిజం చెప్పాలంటే దిలీప్‌పై మాలీవుడ్‌ నిర్ణయం ఆశ్చర్యం కలిగించడం లేదు. ఆయన బాగా జనాదరణ కలిగిన నటుడేగాక నిర్మాత, అనేక సినీ థియేటర్ల యజమాని. అరెస్టుకు ముందు ఐక్య కేరళ సినీ ఎగ్జిబిటర్ల సంఘం ఆయన ఆధ్వర్యంలోనే పనిచేసేది.

ఇక్కడి సినీ పరిశ్రమను ‘అమ్మ’, ఈ చిత్ర ప్రదర్శకుల సంఘంతోపాటు  కేరళ ఫిల్మ్‌ ఉద్యోగుల సమాఖ్య నియంత్రిస్తున్నాయి. ఈ పరిశ్రమ చిన్నదే కావడంతో దానిపై గుత్తాధిపత్యా నికి వీలవుతోంది. ఈ మూడు సినీ సంఘాలూ సూప ర్‌స్టార్ల నియంత్రణలో మాఫియాలా వ్యవహరిస్తు న్నాయని ప్రఖ్యాత నటుడు తిలకన్‌ ఆరోపించాక, ఆయనకు రెండేళ్ల పాటు సినిమాల్లో అవకాశాలు లేకుండా చేశారు. 2012లో ఆయన కన్నుమూసే వరకూ ఆయనను వెలేసినంత పనిచేశారు. కిందటే డాదే, మాలీవుడ్‌కు చెందిన అనేక మంది దిలీప్‌కు బహిరంగంగానే మద్దతు తెలిపారు. వారిలో ‘అమ్మ’ ఉపాధ్యక్షుడు, పాలక ఎల్డీఎఫ్‌ ఎమ్మెల్యే కేబీ గణేశ్‌కు మార్‌ కూడా ఉన్నారు.

గతంలో దిలీప్‌ సాయం పొందినవారంతా ఆయనకు బాసటగా నిలవాలని కూడా ఆయన కోరడం దిగ్భ్రాంతి కలిగించింది. అదృష్టవశాత్తూ, కేరళ రాజకీయ నాయకులు మాత్రం బాధితురాలి పక్షానే నిలబడ్డారు. ‘అమ్మ’ నిర్ణయాన్ని కేరళ ఆర్థికమంత్రి థామస్‌ ఇసాక్‌ వ్యతిరేకించారు. ఇది ‘అమ్మ’ అంతర్గత వ్యవహారంగా చూడడానికి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ నిరాక రిస్తూ, ‘ఈ సంస్థ సభ్యుల ప్రతి చర్యా మలయాళ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది,’ అని తన ఫేస్‌ బుక్‌ పోస్ట్‌లో హెచ్చరించారు. ఇప్పుడు జరిగిన తప్పును సరిదిద్దుకోవడానికి మోహన్‌లాల్‌ నానా పాట్లు పడుతున్నారు.

వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్టు, టీఎస్‌ సుధీర్‌ 

ఈ–మెయిల్‌ : tssmedia10@gmail.com

మరిన్ని వార్తలు