కోర్టులకూ జంతువులపై ప్రేమేనా..?

31 Jan, 2018 00:52 IST|Sakshi

ఈ మధ్య కాలంలో హిందువుల పండుగలపై కొంతమంది పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారు. రాజకీయ అలజడుల కారణంగా హిందూ పండుగలపై రోజురోజుకు ఆంక్షలు మితి మీరుతున్నారు. సంప్రదాయాలకు చట్టాలతో ముడి పెడుతున్నారు.  పూజపై..పండుగపై లెక్కలేనన్ని ఆంక్షలు వేస్తున్నారు. సంక్రాంతికి సంబరాలు నిర్వహించాలన్నా.. వాకిట్లో కళ్లాపి చల్లి ముగ్గులు వేయాలన్నా.. సంప్రదాయ బద్ధమైన గంగిరెద్దులను ఆడించాలన్నా జంతు ప్రేమికుల నుంచి అనుమతి పొందాలి. పతంగులు ఎగరేయాలన్నా.. దారాలకు తట్టుకుని పక్షులు చనిపోతాయని ఆరోపణలు. కోడిపందేలు ఆడించాలన్నా ఆంక్షలే.. దీపావళికి టపాసులు కాల్చాలన్నా, జల్లికట్టు ఆడాలన్నా కోర్టు అనుమతి కావాలి.

వినాయకుడికి పూజలు చేయాలన్నా.. నిమజ్జనం చేయా లన్నా.. నాగుల చవితికి పుట్టలో పాలు పోయాలన్నా, పుష్క రాల్లో స్నానం చేయాలన్నా కోర్టు అనుమతి కావాలి. నమ్మిన దేవుడికి పాలాభిషేకం చేయాలంటే ఆంక్షలు. చివరకు హోళీ ఆడాలన్నా కూడా! ఇలా  హిందువుల పండుగలు అంటేనే ప్రకృతి విరుద్ధమని, వాటిని నిషేధించాలనే ప్రచారం జోరుగా సాగుతోంది. కోడి పందేలు లేనిదే ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగలేదు. ఏడాది కోసారి హుషారుగా.. ఉల్లాసంగా సంప్రదాయ బద్దంగా నిర్వహించే ఈ పండు గపైనా జంతు ప్రేమికులు ఆంక్షలు నిప్పులు గక్కుతున్నారు. కానీ, కోడి పందెం అనేది గ్రామీణ ప్రాంతాల్లో రైతాం గాన్ని.. పల్లె సీమలను ఒక్కటి చేసే పండుగ.

తర తరాలుగా వస్తున్న సంప్రదాయం. అయితే దీన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేసేవారికి చికెన్‌ సెంటర్లు కనపడవా..? పర్యావరణానికి ముప్పుగా సంక్రమి స్తున్న పశువధను ఆపేందుకు ఎవరూ కదలడంలేదు. కానీ జల్లికట్టు ఆట అనగానే.. కోడి పందేలు వినగానే తోక తొక్కిన పాములా ఎగిరి దూకుతున్నారు. కాబట్టి వీటిపై పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు స్పందించాలి. హిందు త్వంపై జరుగుతున్న విష ప్రచారాన్ని అరికట్టాలి.
– పగుడాకుల బాలస్వామి, హైదరాబాద్‌
మొబైల్‌ : 99129 75753

మరిన్ని వార్తలు