బయ్యారం ఉక్కు భిక్ష కాదు.. హక్కు

10 Jul, 2018 01:48 IST|Sakshi
బయ్యారం (ఫైల్‌ ఫోటో)

అభిప్రాయం

రాష్ట్రాల పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణం అంశాన్ని స్పష్టంగా పొందుప ర్చారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఆంధ్రాని ఒప్పిం చడానికి వారికి పోలవరం ప్రాజెక్ట్‌ హామీనిచ్చిన కేంద్రం పోలవరం ప్రాజెక్ట్‌ కింద నాటి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ముంపుకు గురౌతున్నం దున ఖమ్మం జిల్లాకు ఊరడింపుగా ఉక్కు పరిశ్ర మను ఇస్తామని చట్టంలో చేర్చింది. విభజన చట్టం లోని 13వ క్లాజులో ఖమ్మం జిల్లాలో 30 వేల కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటిం చారు. దీనికి సంబంధించిన ప్రక్రియను 6 నెలల్లో ప్రారంభిస్తామని కూడా అందులో పేర్కొన్నారు. అప్పటినుంచి టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్‌ కమిటీలను వేస్తూ, సర్వేలు చేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు.

త్వరలో బయ్యారానికి తీపి కబురు చెపుతామని కేంద్ర ఉక్కుగనుల శాఖ మంత్రి మీడియా ముందు ప్రకటించటం, బయ్యారం ఉక్కు పరిశ్రమకు అవసర మైన వనరులన్నీ సమకూర్చుతామని, ముడి ఖనిజం రవాణా కోసం జగదల్‌పూర్‌ నుంచి రైల్వే లైన్‌ నిర్మా ణానికి పరిశీలన కోసం 2 కోట్లు కేటాయించామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రకటించడం ఇలా ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వాలు 4 ఏళ్ల నాటకానికి తెర వేస్తూ తాజాగా పరిశ్రమ పెట్టే అవకాశమే లేదని స్పష్టీక రిం చారు. ఇది విభజన హామీని తుంగలో తొక్కి తెలం గాణ ప్రజలను మోసం చేయడమే.

యూపీఏ ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమ విభజన చట్టంలో పొందుపర్చిన తరువాత జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమల నిర్మాణంపై మొదటినుండి సాకులు చెపుతూ కాలం గడుపుతూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం వనరులు సమకూర్చడం లేదని, బయ్యారం ఇనుప ఖనిజంలో నాణ్యత లేదని ఉన్న ఖనిజం కూడా పరిశ్రమ నిర్విఘ్నంగా నడవడానికి సరిపోదని తదితర సాకులు చెబుతూ వస్తున్నది.  కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట వాస్తవమేనను కున్నా రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా నుంచి నాణ్యత కలిగిన ఇనుప ఖనిజాన్ని దిగుమని చేసుకుంటామని, అందుకు రైలు మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉంది. అయినా, పరిశ్రమ పెట్టడానికి అభ్యంతరమేమిటి?

2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్‌ ఆమోదించిన విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచబడిన ఉక్కు పరిశ్రమ కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదన్నదే నిజం. అప్పుడప్పుడు మాట వరసకు బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి వల్లెవేయడం తప్ప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేసీఆర్, ఆయన ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేసింది లేదు. పైగా సెయిల్‌ ముందుకు రానందున బయ్యారం స్టీల్స్‌ను జిందాల్‌కు ఇస్తామని, సిద్ధంగా ఉండమని ఆ కంపెనీ అధికారులకు మీడియా ముందే చెప్పారు.

విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు పరి శ్రమను ఏర్పాటు చేయకుండా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే తెలంగాణకు చట్ట బద్ధంగా రావల్సిన ఉక్కు పరిశ్రమపై మాట్లాడకుండా ఉక్కు పరిశ్రమను ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్ని స్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నది.బయ్యారం ఉక్కు పరిశ్రమ ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛ, దీని కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. ఇక్కడి ఉక్కును పాలకులు ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నాలను ప్రజా ఉద్య మాల ద్వారా అడ్డుకున్న చరిత్ర ఉంది. 1 లక్షా 46 వేల ఎకరాల పరిధిలోని ఇనుప ఖనిజాన్ని రక్షణ స్టీల్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేసిన సందర్భంలోనే ప్రైవేటు కంపెనీలకు ఇవ్వవద్దని ప్రభుత్వ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది.

సీపీఐ (ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ ఈ ఉద్యమంలో ముందు భాగాన ఉన్నది. తెలంగాణ ఉద్యమ శక్తులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాయి. బయ్యారం ఉక్కు పరిశ్రమ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాయిష్టాల సమస్య కాదు. అది అనేక ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రానికి లభించిన చట్టబద్ధ హక్కు, దానిని కాదనే అధికారం ఎవరికీ లేదు. ఈ హక్కు సాకారం అయ్యేవరకు ఐక్యంగా ఉద్యమించాలి.

గౌని ఐలయ్య, కన్వీనర్, బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కమిటి, జడ్పీటీసీ ‘ 94907 00955

మరిన్ని వార్తలు