ఆ బలానికి కారణం దేశభక్తి

12 May, 2020 01:13 IST|Sakshi

సందర్భం

భారత్‌ వేల సంవత్సరాల క్రితమే ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది. ప్రఖ్యాత తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాల్లో వేలాదిమంది విద్య అభ్యసిం చేవారు. క్రీ.పూ. 600 నుంచి క్రీ.శ. 500 దాకా అప్పటి గాంధార దేశం (ప్రస్తుతం పాకిస్తాన్‌లోని రావల్పిండి) లో విలసిల్లిన తక్షశిల ప్రపంచంలోనే మొదటి విశ్వ విద్యాలయం అని ప్రసిద్ధి. ఇక్కడ చైనా, అరేబియా దేశాల విద్యార్థులతో సహా 10,500 మంది విద్యను అభ్యసించేవారు.

అంతేకాకుండా ప్లాస్టిక్‌ సర్జరీలతో పాటు గర్భిణుల సుఖ ప్రసవం కోసం సిజేరియన్‌ ఆపరేషన్లు చేసిన తొలి శస్త్రచికిత్స వైద్యుడు కూడా భారతీయుడే. అతడే సుస్రూతుడు. గణిత శాస్త్రంలో కీలకమైన ‘0’(సున్న), ‘పై’ కచ్చితమైన విలువ కను క్కున్న ఆర్యభట్ట కూడా భారతీయుడే. వరాహమిహి రుడు గొప్ప గణిత శాస్త్రవేత్తయే కాకుండా ఖగోళ శాస్త్ర వేత్త కూడా. గ్రహణాల కదలికలను అధ్యయనం చేసిన, ఆయన రచించిన పంచ సిద్ధాంతిక, బృహత్‌ సంహిత గ్రంథాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

అయితే భారతదేశం పైకి దండెత్తి వచ్చిన మొఘ లులు, డచ్‌వారు, ఫ్రెంచివారు, బ్రిటిష్‌ వారు ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపై దాడి చేశారు. ముఖ్యంగా బ్రిటిష్‌ వాళ్లు ఇక్కడి ఘనమైన విద్యా విధానాన్ని మార్చకపోతే భారతీయులు తమ చరిత్ర కారణంగా ఎదురుతిరిగే అవకాశం ఉందని భావిం చారు. అందుకే ఇప్పటికీ ఎంతోమంది విద్యావేత్తల మని భావించేవారికి కూడా మన ఘన చరిత్ర తెలియదు.

అందువల్లే పలువురు కుహనా మేధావులు ఈ దేశం ఏ రోజూ ఒక దేశం కాదనీ; ఆర్యులు, అందరూ విదేశాల నుంచి వచ్చిన వారేననీ ఒక తప్పుడు చరిత్ర కథలు చెబుతుంటారు. సముద్రంలో ద్వారక బయటపడేదాకా రామాయణ, మహాభార తాలు కూడా పుక్కిటి పురాణాలని కొట్టిపారేసేసే వారు. వీరంతా చైనాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టే రకాలు; కరోనా సంక్షోభ సమయంలో కూడా రాజకీయాలు చేసే ‘తుక్‌డే తుక్‌డే’ గ్యాంగులు.

కానీ మానవత్వానికి పెద్ద పీట వేసే భారత్‌ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషిచేస్తోంది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారు వివిధ పార్టీలకు చెందిన వారైనప్పటికీ, ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటుతూ ప్రజల ప్రాణాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఒకే మాట, ఒకే బాట చందంగా సాగడం అభినందించదగ్గ విషయం. అమెరికా తది తర దేశాల నేతల్లా భారత ప్రధాని మోదీ కూడా ఆర్థిక సంక్షోభం అని ఆలోచిస్తూ కూర్చుంటే మనదేశంలో శవాల దిబ్బలు పెరిగేవి. కచ్చితమైన నిర్ణయాలు సకా లంలో తీసుకోగలిగే ప్రధాని ఉంటే ప్రజలు ఎంత నిశ్చింతగా ఉండగలరో భారతదేశం నిరూపించింది. అలాంటి నాయకుడు ఎలాంటి పిలుపునిచ్చినా ప్రజలు ఎలా పాటిస్తారో మోదీ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరు రుజువు చేసింది. 

అయితే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం ఆయనకు ఎలా లభిస్తుందనేది చాలా మందిలో ఉదయించే ప్రశ్న. దానికి సమాధానం ఆయన అవలంబించిన సిద్ధాంతం. ఏకాత్మ మానవ తావాద సిద్ధాంతకర్త పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపా ధ్యాయ, కశ్మీర్‌ కోసం ప్రాణాలర్పించిన శ్యాంప్రసాద్‌ ముఖర్జీ, స్వర్ణ చతుర్భుజి, గ్రామీణ సడక్‌ యోజన చేపట్టిన వాజ్‌పేయి, అయోధ్యకు రథయాత్ర చేప ట్టిన లాల్‌ కృష్ణ అద్వానీ, అమిత్‌షా లాంటి వారిని తీర్చిదిద్దింది ఈ సిద్ధాంతమే. అదే దేశభక్తి. నేషన్‌ ఫస్ట్‌. వీళ్లందరూ దాన్ని ఔపోసన పట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ శాఖల్లోనే. 

ప్రతిరోజూ గంటసేపు జరిగే శాఖ కేవలం ఒక ఆటస్థలం కాదు. అది ఒక వ్యక్తి నిర్మాణ కర్మాగారం. అందుకే దేశానికి ఎక్కడ ఆపద వచ్చినా ముందుండి పనిచేసేది స్వయంసేవకులే. దివిసీమ తుపాను సమ యంలోనూ, కేరళ వరదల సందర్భంలోనూ, ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ ప్రజలకు అండగా నిలిచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది ఆపా దించినట్లుగా ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ సంస్థలు మతతత్వ సంస్థలైతే ఇంతటి విశాల దృక్పథాన్ని ఆచ రించడం సాధ్యమేనా!
వ్యాసకర్త: శ్యాంసుందర్‌ వరయోగి, బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ కో కన్వీనర్‌

మరిన్ని వార్తలు