మానవీయ స్పర్శ ఏది?

14 Jun, 2020 02:48 IST|Sakshi

అభిప్రాయం

అనుకోని ఆపద వచ్చిపడి నప్పుడు ఆందోళన పడటం కంటే ఆత్మవిశ్వాసంతో వుండటం చాలా అవ సరం. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ మూడునెలల్లో వ్యక్తుల ఆదాయాలతో పాటు వ్యవస్థల, సంస్థల ఆదాయాలు పూర్తిగా తుడి చి పెట్టుకుని పోయాయి. మన దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటి పరిస్థితి కూడా ఇదే. ఈ కల్లోలం నుంచి ఉపశమనం కలిగించడానికి మన కేంద్ర ప్రభుత్వం తొలి విడత లక్షా 80 వేల కోట్ల రూపాయలు ప్యాకేజీగా ప్రకటించింది. ఆ తదుపరి చాలా ఆలస్యంగా మలివిడత ప్యాకేజీని భారీ అంకె లతో... అంటే  రూ. 21 లక్షల కోట్లతో, ఆకర్షణీయ మైన పేరుతో–ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటూ ప్రక టించింది. తొలి ప్యాకేజీ–ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్, మలి ప్యాకే జీ–ఆత్మ నిర్భర్‌ భారత్‌ కలిసి దేశ స్థూల ఉత్పత్తిలో 10 శాతం అవుతుందని లెక్కలు చెప్పారేగానీ, ఇది రూ. 30 లక్షల 42 వేల 230 కోట్ల వార్షిక బడ్జెట్‌లో భాగమా అని అడిగితే బీజేపీ నేతలు నోటికి పనిచెబుతున్నారుగానీ, లెక్కలు చెప్పడానికి సిద్ధప డటం లేదు. ‘భారీ ప్యాకేజీ’ ప్రకటించినప్పటి నుంచి బీజేపీ మేధా వులు ‘ఆహా ఓహో’ అంటూ శ్లాఘిస్తున్నారు. వ్యతి రేకించిన వారిని నిందిస్తున్నా రు. కానీ ఆరెస్సెస్‌ అనుబంధ కార్మిక సంఘమైన భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) నిశితంగా విమర్శిస్తుంటే ఏం మాట్లాడాలో ఈ పెద్దలకు అర్థం కావడం లేదు. ఆ సంస్థ విమర్శించడంతో సరి పెట్టలేదు, కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికుల్ని సంఘటితం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించింది. 

కరోనా వల్ల వచ్చిపడిన కష్టం నుంచి దేశాన్ని ఆర్థి కంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం మంచిదే. కానీ ఆచరణలో ‘ఆత్మ నిర్భర్‌’ అందుకు ఎలా ఉపయోగ పడుతుం దన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న. దేశం ఆర్థికంగా బల పడాలంటే అన్ని రకాల ఉత్పత్తులు జరగాలి. వినిమయం పెరగాలి. అది సాధ్యం కావాలంటే ప్రజల వద్ద డబ్బు వుండాలి. అందుకవసరమైన ఆదాయ మార్గాలుండాలి. ప్రజల పొదుపు పెరగాలి. దశాబ్దాలుగా కార్మికుల రక్తం, స్వేదంతో బల పడిన బొగ్గు, రైల్వేలు, ఉక్కు, విద్యుత్, టెలికం, బ్యాంకింగ్, రక్షణ, తపాలా తదితర రంగాల్లో కొన్ని టిని గంపగుత్తగా, కొన్నింటిలో 75 శాతం వాటా ల్ని, మరికొన్నిటిలో ఇంకా గరిష్టంగా ప్రైవేటుపరం చేయడం ఒక్కటే మంచి అవకాశం అవుతుందా? ఇవి పరాధీనతకు సంకేతమా లేక స్వావలంబనకు నిదర్శనమా?  

దాచేస్తే నిజాలు దాగుతాయా?
తొలి విడత ఉద్దీపనలో బ్యాంకులకు చెల్లించే వాయిదాలను మూడు నెలలు వాయిదా వేస్తామని, వాటిపై వడ్డీ మాఫీ చేస్తామని కేంద్రం ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదు. బ్యాంకులు యథావిధిగా వాయిదాలు కట్టించుకున్నాయి. అందుకు బ్యాంకుల్ని తప్పుబట్ట లేము. అవి డిపాజిటర్లకూ, రుణ గ్రహీతలకూ మధ్యవర్తులుగా వ్యవహరి స్తాయి. కోశాగారం లోటు ఒకపక్క, కేంద్రం చేస్తున్న అప్పులు మరో పక్క పెరిగి అంతర్జాతీయ స్థాయిలో మన దేశం రేటింగ్‌ పడిపోయింది.  2020–21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 1.5 శాతం వుండొచ్చునని కేంద్రమే అంచనా వేసింది. ఇది మైనస్‌ 1.7 శాతం వుండొచ్చునని కొన్ని సంస్థల అంచనా. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) మాత్రం ఇకపై జీడీపీకి సంబం దించిన అంచనాల జోలికి వెళ్లబోమని చెప్పింది.ఇక ‘పీఎం కేర్స్‌’కు జమపడిన విరాళాలెంతో బహిర్గతం చేయకపో వడం మొదలుకొని అనేక అంశాల్లో కేంద్రం పాటిస్తున్న గోప్యత ఎవరికీ అర్ధం కావడం లేదు. 

సమాఖ్య స్ఫూర్తి గల్లంతు
కేంద్రం రాష్ట్రాలతో వ్యవహరిస్తున్న తీరు సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టుగా మారింది. మన రాజ్యాంగ నిర్మాణంలోనే సహకార ఫెడరలిజం అంతర్లీనంగా వుంది. కేంద్ర–రాష్ట్రాలు వేటికవి సర్వసత్తాక సార్వ భౌమాధికారాన్ని కలిగి ఒకదా నితో మరొకటి సహ కరించుకుంటూ జాతీయ సమైక్యతతో ముందు కెళ్లాలన్నది ఫెడరల్‌భావ స్ఫూర్తి. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్‌ రాష్ట్రాల అధికారాలను క్రమేపీ తగ్గించి ఈ స్ఫూర్తిని దెబ్బతీసింది. ఎన్‌డీఏ కూడా దాన్నే కొన సాగి స్తోంది. ఇందువల్ల ప్రజలు తీవ్రంగా నష్ట పోతు న్నారు. మార్చి 24న కేవలం 4 గంటల వ్యవధిలో ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధిం చిన లాక్‌డౌన్‌ వల్ల ఎన్ని సమ స్యలు ఏర్పడ్డాయో మూడు నెలలుగా చూస్తూనే వున్నాం.

అంతకు చాలాముందే 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని, కనుక ఆ వాటా ఇక పెరగ దని సాకు చూపించి అనేక కేంద్ర ప్రాయోజిత పథ కాలు నిలిపివేయడమో, కోత పెట్టడమో జరిగింది. 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాలను కేంద్రమే రూపొందించింది. జనాభాతో ముడిపెట్టి, పన్నుల వాటాను లెక్కించే విధానం వల్ల కొన్ని రాష్ట్రాలకు నష్టం కలగడంతోపాటు, వాటి స్వతంత్ర విధాన నిర్ణయాలలో కేంద్రం జోక్యం చేసుకున్నట్టవుతుంది. జీఎస్టీ ద్వారా కూడా పన్నుల వాటాలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. విద్యుత్‌ సవరణ చట్టం ఈ ధోరణితో రూపొందించిందే. దీనికి పలు రాష్ట్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఇది అమల్లో కొస్తే పేదలకు రాయితీ ధరకు విద్యుత్‌ అందించే రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు గండిపడుతుంది.

మానవత్వమే పరమావధి
సంక్షేమ రాజ్య స్థాపన రాజ్యాంగ లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేస్తూ, తగిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. అందు   కోసం సున్నితత్వంతో, మానవత్వంతో వ్యవహరించాలి. కరోనా నేపథ్యంలో వలసకూలీలు ఎదుర్కొన్న కడగండ్లకు కారణం కేంద్రంలో లోపించిన ఈ సున్నితత్వమే నన్న విమర్శలొ చ్చాయి. కరోనా నేర్పిన పాఠాలతో మన గమ్యం ప్రైవేటీకరణ దిశగా కాకుండా... మెరుగైన ఆరో గ్యం, నాణ్యమైన విద్య, రైతులు, పేదల సంక్షేమం వైపుగా అన్నది స్పష్టమైంది. 2004లోనే స్వర్గీయ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ అందించి దేశానికి దిశా నిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ, 104, 108 పథకాలతో మారుమూల ప్రాంతాల పేదలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందిం చారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌తో నిరుపేదల పిల్లలు ఉన్నత విద్యనభ్య సించే అవకాశం అందిం చారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృ త్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభు త్వంలో విలీనం చేసింది. ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అందించడా నికి పూనుకుంది. చేతివృత్తుల వారికి ఆర్థిక సహా యం అందిస్తోంది. వలస కార్మికుల ఇబ్బందులకు చలించి, వారి ఆకలిదప్పులు తీర్చి, వారిని సగౌర వంగా గమ్యస్థానాలకు చేర్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్‌మోహన్‌ రెడ్డి ఒక్కరే. పాలకులు ఇలా సున్నితత్వంతో, మానవత్వంతో ఆలోచిస్తేనే పౌర సమాజానికి భరోసా కలుగుతుంది. కేంద్రం తన భారీ ప్యాకేజీలో సమూల మార్పులు తెచ్చి, ఫెడరల్‌ సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలి. అప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు అందుతాయి. 


సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీమంత్రి, వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు