అర్థం మార్చుకున్న గాంధీ ‘సర్వీసు’

30 Jan, 2019 00:36 IST|Sakshi

సందర్భం

మూణ్ణెళ్ల క్రితం వినియో గదారుల సమస్యలూ, అవ గాహన వంటి పార్శా్వల గురించి పరిశీలనగా ఆలోచి స్తున్నాను. మూడు దశా బ్దాల క్రితం మనందరికీ తరచు కనబడిన ఒక అంశం గుర్తుకు వచ్చింది. అది ఆకా శవాణి, దూరదర్శన్‌లలో గానీ, పత్రికలలోగానీ తరచూ వినబడేది కాదు, కన బడేది కాదు. కానీ పోస్టాఫీసులలో, బ్యాంకులలో బాగా కనబడేట్టు ప్రదర్శితమయ్యేది. అంతేకాదు కొన్ని దుకాణాలలో సైతం కనబడేది. ‘‘మన ఆవరణలో వినియోగదారుడు చాలా ముఖ్యమైన అతిథి ఆ వ్యక్తి మనమీద ఆధారపడ లేదు, నిజానికి మనమే అతనిమీద ఆధారపడ్డాం/ అతని రాక మనకు ప్రతిబంధకం కాదు, మన పనికి అసలు ప్రయోజనం అతనే అతనికి సేవలందిం   చడం ద్వారా మనం ఎటు వంటి దయ చూపడం లేదు/నిజానికి ఆయనే మన మీద దయచూపుతు న్నాడు–మనకు ఒక అవకాశం ఇచ్చి’’ ఇప్పుడు చాలామందికి గుర్తొచ్చి ఉంటుంది. ‘ఎ కస్టమర్‌ ఈజ్‌...’ అనే ఇంగ్లిష్‌ వాక్యాల సము దాయం, దాని చివరి నుండే మహాత్మాగాంధీ పేరు.

1890లో దక్షిణాఫ్రికాలో ఒక ప్రసంగంలో ఆయన ప్రస్తావించారు ఈ వాక్యాలు. గాంధీ చెప్పని విష యం లేదు. అయితే కొన్ని వ్యాప్తిలోకి వచ్చాయి. మరికొన్ని మరుగునపడి పోయాయి. పర్యావరణం గురించి గాంధీ చెప్పిన విషయాలు అప్పటికన్నా, ఇప్పుడు ఎంతో ప్రయోజనకరమని పర్యా వరణ శాస్త్రవేత్త, పర్యావరణ ఉద్యమ నిర్మాత అనిల్‌ అగర్వాల్‌ రెండు దశాబ్దాల క్రితం స్పష్టంగా పేర్కొ న్నారు. అలాగే గాంధీ అనగానే ఆధ్యాత్మికత, భక్తి, మతం అనే ధోర ణిలో పడిపోయి సైన్స్‌ దృష్టి, సైన్స్‌ ప్రయోగధోరణి వంటి వాటి గురించి పూర్తిగా గమనించలేదు. ఈ భావాలు ఒకటి, రెండు దశా బ్దాలుగా ప్రపంచస్థాయిలో చర్చను లేపుతున్నాయి. అయితే మన దేశం లోగానీ, తెలుగు ప్రాంతాల్లోగానీ, వీటిని చర్చించిన దాఖలాలు లేవు. 3 దశాబ్దాలలో మన ఆలోచనా ధోర ణిలో చాలా మార్పులు వచ్చాయి. సర్వీస్‌ అనే మాట గతంలో ఒక రకంగా స్ఫురిస్తే, ఇప్పుడు ఇంకోలా ధ్వనిస్తుంది. కంప్యూటర్లు, నెట్‌ వగైరా వచ్చాక సర్వీస్‌ అనే మాట కొత్త అర్థంతో రావడమే కాదు. ‘సర్వీస్‌ చార్జ్‌’ అనే కొత్త పదబంధం ప్రచారం లోకి వచ్చింది. ఇదివర కటి సర్వీసు అనే అర్థం నేడు కావాలంటే ‘వాలంటరీ సర్వీసు’ అనే పదబంధం వాడాలి.

ఇప్పుడు మనం గాంధీజీ 150వ జయంతి సంవత్సరంలో ఉన్నాం. గాంధీజీ సహిష్ణుతమూ, సమన్వయానికీ, సాధారణ జీవితానికీ, ఒళ్లు వంచి కష్టపడటానికీ, సత్యసంధతతకూ, ప్రచా రం లేని సేవకూ ప్రతిరూపం. ఆయన ధరించిన గోచిపంచె మన ప్రాంతం నుంచి స్వీకరించినది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆయన కొల్లాయి గుడ్డ ధారణలో కూడా ఆంధ్రదేశ ప్రేరణ ఉందని చరిత్రజ్ఞులు చెబుతారు. ఒకసారి ఆయన ఆంధ్రదే శంలో పర్యటన చేస్తుం డగా, అది రాయలసీమ ప్రాంతమంటారు, బీడు వారిపోతున్న నేలలు, దైన్యమూ, దారిద్య్రమూ, అంతులేని శ్రమ పెట్టుబడులుగా జీవన వ్యాపారం చేస్తున్న కర్షకులను, కార్మికులను, పశువుల కాపరులను, ఒంటినిండా బట్ట ధరించ లేని వారిని వారి కార్యక్షేత్రాలలో చూసి ఎంతో పరితాపం పొంది నట్లూ– ఇంతటి పేదరికంతో అల మటిస్తున్న అభాగ్యులెందరో నా దేశంలో ఉండగా వాళ్లకు ప్రాతి నిధ్య సంకేతికంగా తాను మాత్రం ఒంటినిండా వస్త్రం ఎందుకు ధరిం చాలి? అని కఠోర నిర్ణయానికి ఆయన వచ్చినట్లు గాంధీజీ సన్నిహితులు రాశారు. సరే, వినియోగదారుడు వగైరా విషయం నేడు ఎలా ఉంది? అప్పులు ఇస్తాం, వస్తు వులిస్తాం, అది స్తాం, ఇదిస్తాం– అని చెవిలో ఫోన్‌ పోరుబెట్టి, పిమ్మట అంటగట్టి, ఇక ఆ తర్వాత చుక్కలు చూపించడం పరిపాటి. అలాగే ఒక వస్తువు కొన్న తర్వాత, ఏ చిన్న భాగం పాడయినా మోదే సర్వీసు చార్జీలు, విడి భాగాల ఖరీదూ విపరీతం. ఇటువంటి హింస ఎవరైనా, ఎంతైనా చెబుతారు నేడు. వినియోగదారుల చట్టాలు, న్యాయస్థానాలు, తీర్పులు ఎన్నో ఉన్నా పీడన మాత్రం మరింత సృజ నాత్మకంగా మారిపోతోంది. కానీ దీనికి ముందు గాంధీ చెప్పినట్టు ‘సేవలందించే వ్యక్తి ధోరణి’ మారితే తప్పా ప్రయోజనం ఉండదేమో అనిపి స్తుంది. గాంధీ జయంతి 150వ సంవత్సరం వేళ ఆయన దార్శనికత మరింత అర్ధవంతంగా కనబడు తోంది. అంతేకాదు మనం దానికి మరింత దూరమ వుతున్నామని కూడా బోధపడుతోంది.
(నేడు గాంధీజీ వర్ధంతి)
వ్యాసకర్త డైరెక్టర్, రీజినల్‌ అకాడమీ, ఆకాశవాణి, హైదరాబాద్‌ ‘ మొబైల్‌ : 94407 32392


డా‘‘ నాగసూరి వేణుగోపాల్‌
 

>
మరిన్ని వార్తలు