‘పింఛనుదారులు గుర్తులేరా?’

16 May, 2018 03:05 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 65 ఏళ్లు నిండిన పింఛనుదారుల పట్ల కూడా ఇంత కఠినంగా ఉండటం సబబేనా? ఇలాంటి వారికి 15 శాతం క్వాంటం పింఛను అమలు చేస్తానని ఆయన 2014 ఎన్నికల సమ యంలో హామీ ఇచ్చారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరి చారు. కానీ జరగలేదు. 2013 నుంచి అమలులో నికి వచ్చిన పదో వేతన సవరణ సంఘం 70 ఏళ్లు నిండిన పింఛనుదారులకు 15 శాతం క్వాంటం పింఛను సిఫారసు చేసింది. 27.2.2017 తేదీన విజయవాడలో పింఛనదారుల 40వ వార్షికో త్సవం జరిగినప్పుడు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సభలోనే క్వాంటం పింఛను ఉత్తర్వులు జారీ చేయడానికి హామీ ఇచ్చారు. మేమంతా కరతాళ ధ్వనులతో స్వాగతించాం. కానీ నేటికీ ఆయన మాట కార్యరూపం దాల్చ లేదు. అలాగే ఎయిడెడ్‌ ఉన్నత విద్యా సంస్థలలో పనిచేస్తున్న సిబ్బందికి ఆర్జిత సెలవులను నగ దుగా మార్చుకునే వీలు కల్పిస్తూ జీవో ఎంఎస్‌ నం 154 ఇచ్చారు.  దీని అమలుకు సంబంధిం చిన ఉత్తర్వు 4.5.2010న వెలువడాలి. కానీ 27.5.2017 నుంచి ఆ జీవో అమలుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం విచారకరం. ఇందుకు నిరసనగా పలువురు న్యాయస్థా నాన్ని ఆశ్రయించారు. శాసన మండలి సభ్యుల విజ్ఞప్తి మేరకు 4.5.2010–26.11.2017 మధ్యకా లంలో ఉద్యోగ విరమణ చేసినవారి వివరాలు సేకరణ పేరుతో ఆర్థిక శాఖ కాలయాపన చేసింది. ఈ రెండు పరిణామాలు పింఛనుదారులకు వేదన కలిగించేవే. కానీ వివరాల సేకరణ పేరుతో కాల యాపన చేసి, పింఛనుదారులను వేధిస్తున్నారు. ఇకనైనా ఈ కాలయాపన వ్యూహాలకు స్వస్తి పలికి సమస్య పరిష్కారానికి సీఎం చొరవ తీసుకోవాలి. పింఛనుదారుల సమస్యను పరిష్కరించాలి.
                                                                                                                   ఆశం సుధాకరరావు, గూడలి, నెల్లూరు జిల్లా

మరిన్ని వార్తలు