పూలూ – పడగలూ

1 Sep, 2018 01:21 IST|Sakshi

అక్షర తూణీరం

చాలాసార్లు చిన్నపిల్లలకి వచ్చేలాంటి సందేహాలు పెద్దవాళ్లకి రావు. ఎందు కంటే పెద్దవాళ్ల అభిప్రా యాలు, ఆలోచనలు లక్కలా బిడిసి, గట్టిగా స్థిర పడి పోయి ఉంటాయి. ప్రతి కల్పాంతంలోనూ భయంక రమైన జలప్రళయం వస్తుంది. అప్పుడీ సృష్టి మొత్తం జల సమాధి అయిపోతుంది. మళ్లీ నూతన సృష్టికి అంకురార్పణ జరుగుతుంది. అందుకు దేవుడు సృష్టి లోని సమస్త జీవకోటి శాంపిల్స్‌ని, విత్తనాలని ఒక పెద్ద పడవలోకి చేర్చి జాగ్రత్త పరిచాడు. ఈ పురాణ గాథని మరింత ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఉన్న ట్టుండి క్లాసులో ఓ పిల్లవాడు లేచి, ‘టీచర్‌ మరైతే పడవలో ఉన్న పులి అందులోనే ఉన్న మేకని తినె య్యదా?’ అని అడి గాడు. నిజమే, వాడొక శాంపిల్‌ చెప్పాడు గానీ ఇంకా కప్పని పాము, పాముని గద్ద మింగేస్తాయి కదా. అప్పుడు చాలా శాంపిల్స్‌ అడ్రస్‌ లేకుండా పోతాయి గదా. పిల్లలంతా నా జవాబు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేనేవన్నా ప్రవచనకారు డినా అప్పటి కప్పుడు ఆశువుగా వాడి సందేహం తీర్చ డానికి. కనీసం రెండు శ్లోకాలైనా పఠిస్తే, వాటిని గడగడ పుక్కిలించి, తోచిన అర్థంతో తరగతిని భయపెట్టి బయ టపడేవాణ్ణి. ఓ క్షణం దిక్కులు చూసి, ‘అఘో రించావ్‌. ఈ తెలివి మాత్రం ఉంది. కూర్చో’ అని గద్దించి, ఆ గండం గట్టెక్కాను.

మొన్నామధ్య టీవీ వార్తలు చూస్తుంటే, పది పన్నెండేళ్ల పక్కింటి పిల్ల నాకూడా ఉంది. కేరళ వరదల్ని చూసి భయపడింది. చాలా జాలిపడింది. చూస్తున్నంత సేపూ అయ్యో పాపం అనుకుంటూనే ఉంది. మళ్లీ తర్వాత వేరే వేరే వార్తలు వచ్చాయి. చివరంటా నాతో పాటు వార్తలు చూసింది. ‘మరి... అయితే ఢిల్లీలో ఉండే మంత్రులు గొప్పవాళ్లా, ఇక్కడ ఉండే మన మంత్రులు గొప్పవాళ్లా’ అని అడిగిందా అమ్మాయి. ‘అంతా ఒకటే, కాకపోతే వాళ్లు అక్క డుండి దేశం సంగతులు చూస్తారు. వీళ్లు ఇక్కడ ఉండి రాష్ట్రం సంగతులు చూసుకుంటారు’ అని చెప్పాను. ‘మరైతే... మనవాళ్లు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా డోలంత పెద్ద పూలగుత్తుల్ని తీసికెళ్లి వాళ్లకిచ్చి దణ్ణం పెడతారెందుకు’ అని సూటిగా అడిగింది. వెంటనే జవాబు స్ఫురించలేదు. ‘మర్యాద.. అదొక మర్యాద’ అన్నాను. ‘ప్రతిసారీ మంచి ఖరీదైన పట్టు శాలువా కూడా ఢిల్లీ మంత్రులకు కప్పుతారు’ అన్నది. అవి లాంఛనాలు... అలాగే ఉంటాయన్నాను. మనలో మనకి అవన్నీ దేనికని ఎదురుప్రశ్న వేసింది. ఏదో సర్దిచెప్పి, ఒడ్డున పడ్డాను.

పాపం, పుణ్యం, శ్లేషార్థాలు ఏమీ తెలియని పిల్ల కాబట్టి, హాయిగా సందేహాలు అడిగింది. నిత్యం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఒక్కొక్క మంత్రి చేతుల్లోకి ఎన్నెన్ని ఖరీదైన బొకేలు వస్తాయో.. ఒక్క క్షణం కూడా ఆయన చేతిలో ఉండదు. శాలువా కప్పగానే, అదేదో మిడతో, పురుగో భుజంమీద వాలి నట్టు దాన్ని తీసి పక్కన పడేస్తారు. ఈ రాజ లాంఛనాలేమిటో అనిపి స్తుంది. దేవాలయాల్లో దేవు డికి వచ్చే వస్త్రాలను ఏటా వేలం వేస్తారు. ఈ శాలు వాలు కూడా అలా వేసి, ప్రభుత్వ ఖజానాకి జమ వేస్తే బాగుండు. సగటున ప్రతి మంత్రి నిత్యం పది శాలువాలు కప్పించుకుంటాడు. పదిహేను పూల గుచ్ఛాలు అందుకుంటాడు. మనలో మనకి ఈ మర్యాదలేంటని అందరూ ఒక్కమాట అను కుంటే, కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవు తుంది. పోనీ, వీళ్లకి వాళ్లకి మధ్య నిజంగా గౌర వాలు, అభిమానాలు ఉంటాయా అంటే రవ్వంత కూడా ఉండవు. బయటకు రాగానే మీడియా మైకుల్లో నిర్భ యంగా చెరిగి పడేస్తారు.

రాష్ట్ర గవర్నర్‌ ఉన్నతస్థాయి అధికారి. ఆయన కూడా ప్రజా సేవకే ఉన్నారు. ఆయనని కలవడానికి లేదా దర్శించడానికి వెళ్లినప్పుడల్లా మద్దెలంత పూల గుచ్ఛం స్వయంగా మోసుకు వెళ్లాలా? ఇవన్నీ ఎవరు నిర్దేశించారు. వీటి అమలు వెనుక అంతరార్థమేమిటి? ప్రధాని మోదీ ‘మనసులో మాట’ పేరుతో చాలా అర్థ వంతమైన ప్రసంగాలు ఆకాశవాణిలో చేస్తుంటారు. సందేశాలు, సలహాలు ఇస్తారు. ఇలాంటి కృత్రిమమైన మర్యాదల్ని, లాంఛనాల్ని ఎందుకు నిశ్శేషంగా వదిలిం చరో అర్థం కాదు. ముందసలు అన్నిచోట్ల కుప్పలుగా పడివున్న శాలువాలని వెంటనే కేరళకి పంపండి. కొంత పాపం శమిస్తుంది.


(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ

 

మరిన్ని వార్తలు