పరమత సహనానికి ప్రతిరూపం కంచి పీఠం

20 May, 2018 02:32 IST|Sakshi

ఈ శతాబ్ది సమాజం జ్ఞాన సమాజం. ఆ జ్ఞానాన్ని వెలికితీయాలంటే ఉన్నత ప్రమాణాలుగల విద్యాసంస్థలు, పరిశోధన అవసరం. ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే కంచి పీఠం వారు భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వారి దూరదృష్టిని మనం గమనించాలి. రెండవది.. వివిధ వర్గాల మధ్య సంఘర్షణ కాదు సామరస్యం అవసరమని కంచి పీఠం నిరూపిస్తున్నది. మఠం పక్కనే మసీదు ఉంది. ప్రతీరోజూ సాయంత్రం మసీదు నుండి వినపడే ‘నమాజు’ సమయంలో మఠంలోని సందడిని శాంతింపజేయడం గమనిస్తే పీఠం వారి పరమత సహనాన్ని గుర్తించవచ్చు. ‘‘మానవసేవే మాధవ సేవ’’ అన్న మాటల్ని కంచి పీఠం నిజం చేసింది.

ఇటీవల కంచి పీఠం వారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాను. భారత దేశంలో ఎన్నో ధార్మిక సంస్థలు ఉన్నాయి. ఆయా రంగాలకు పరిమితమై అవి సేవచేస్తున్నాయి. కానీ కంచి పీఠం వారు బహుముఖీయంగా చేస్తున్న సేవను కళ్ళారా చూసిన తర్వాత కదిలిపోయాను. ఒకవైపు ఆధ్యాత్మి కమైన క్షేత్రంగా భాసిల్లుతూనే మరోవైపు సామాజిక సంక్షే మంలో భాగంగా విద్య, వైద్య రంగాల్లో కంచి పీఠం చేస్తున్న సేవ, వారి కృషి వెనకాల ఉన్న సామాజిక çస్పృహ, పేద వర్గాల పట్ల వారి దృక్పథం స్ఫూర్తి దాయకమైనవని అర్థం చేసుకున్నాను.

కంచి పీఠం వారి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలలో సామాజికాభివృద్ధికి, ప్రమాణాల పెంపునకు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏయే చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూచించమని చెప్పడానికి నన్ను ఆహ్వానించారు. నేనూ, నాలాంటి భావజాలంతోనే ఉన్న వందేమాతరం ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు రవీందర్‌తో కలిసి రెండు రోజులపాటు కంచిలో అక్కడి విద్య, వైద్య, సేవా సంస్థలను దర్శించాను. 

అమెరికాలో స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీని అన్ని రకాలైన వనరులున్న ప్రదేశంలో ఏర్పాటు చేశారు. దాంతో అక్కడి విద్యార్థులు, అక్కడ చుట్టు పక్కల ఉన్న కంపెనీలతో కోర్సులో భాగంగా అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొని మంచి ఉపాధి అవకాశాలను పొందారు. విద్యార్థులకు తెలివితేటలు ఉండవచ్చు. కానీ వారి ఆలోచనల్ని, ఆశయాల్ని ఒక నిర్ది ష్టమైన కార్యరూపంలోకి తీసుకొని రావడానికి తగిన పెట్టు బడి అవసరం. ఆర్థికపరంగా సంపన్నమైన అమెరికాలో ఆ పనిని బహుళజాతి కంపెనీలు చేశాయి. వర్ధమాన దేశాలలో ఆ పనిని ప్రజాప్రభుత్వాలు నిర్వహించాలి. 

ఈ నేపథ్యంలో లాటిన్‌ అమెరికా దేశాలు తమ విద్యా వ్యవస్థను పటిష్టపరుచుకొని అభివృద్ధిలో ముందుకు దూసు కెళుతున్న పరిణామాల్ని గుర్తించిన కంచి పీఠం 21వ శతా బ్దిలో దేశానికి అవసరమైన విద్యార్థులను నైపుణ్యంగల మానవ వనరులుగా మార్చడానికి తమ సంస్థలలో అమల వుతున్న విద్యా విధానాన్ని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమీక్షిస్తున్నది. 

ఈ శతాబ్ది సమాజం జ్ఞాన సమాజం. ఆ జ్ఞానాన్ని వెలి కితీయాలంటే ఉన్నత ప్రమాణాలుగల విద్యాసంస్థలు, పరిశోధన అవసరం. ఆ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే కంచిపీఠం వారు భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందిస్తు న్నారు. వారి దూరదృష్టిని మనం గమనించాలి. రెండవది వివిధ వర్గాల మధ్య సంఘర్షణ కాదు సామరస్యం అవస రమని నిరూపిస్తున్నది. మఠం పక్కనే మసీదు ఉంది. ప్రతీ రోజూ సాయంత్రం మసీదు నుండి వినపడే ‘నమాజు’ ఆ సమయంలో మఠంలోని సందడిని శాంతింపజేయడం గమనిస్తే పీఠం వారి పరమత సహనాన్ని గుర్తించవచ్చు. 

పరస్పర సహనం, సహకారమే శాంతికి మూల మంత్రం. కంచి పీఠం ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం దాకా విద్యాసంస్థలు కొనసాగుతు న్నాయి. అందులో ఇంజనీరింగు, మెడికల్, ఆయుర్వేదిక్, వైదిక, ఆర్ట్స్, గ్రూపులతో పాటు, శిల్పశాస్త్రానికి సంబంధిం చిన కళాశాల కూడా ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు వైద్యరంగానికి సంబంధించి కంచిలో ఉన్న శంకరనేత్రా లయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రోజూ వేలాది మంది కంటి పరీక్షలకోసం, ఆపరేషన్ల కోసం వస్తుంటారు. 

అంతేకాదు దేశంలోని వివిధ ప్రాంతాలలో పీఠం ఆధ్వర్యంలో నెలకొల్పిన ప్రాథమిక వైద్యశాలలు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాల్ని అందిస్తుంది. కంచి పీఠం ముఖ్యంగా గర్భవతులైన పేద స్త్రీలకు, అలాగే పసిపిల్లలకు పౌష్టిక ఆహారాన్ని సమకూరు స్తున్నది. ప్రాథమిక విద్యాభ్యాస కాలంలోనే పిల్లలలోని కంటి లోపాల్ని గుర్తించినట్లయితే వారికి సత్వరమే వైద్య సహాయాన్ని అందించవచ్చు. ఆ స్ఫూర్తితో మొదలైన శంకర నేత్ర వైద్యాలయం ఇవాళ మరింత విస్తరించింది. 

ముఖ్యంగా వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడు తున్న మనుషుల పట్ల వారు చూపిస్తున్న శ్రద్ధాసక్తులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ‘‘మానవసేవే మాధవ సేవ’’ అన్న మాటల్ని కంచి పీఠం నిజం చేసింది. ఆధ్యాత్మికతకు సామాజిక న్యాయాన్ని జోడించినప్పుడు కొత్త విలువలు గల నవశకం ఆవిష్కారమవుతుంది. 

గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల వల్ల పట్టణీకరణ పెరిగింది. వలసలు పెరిగాయి. గ్రామాలు స్వయం సమృద్ధంగా లేనప్పుడు అక్కడి నుంచి రాజకీయ పరమైన నాయకత్వం రాదు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవ కాశాల కారణంగా వలస వెళ్తున్న తరానికి గ్రామాల్లోని పెద్ద తరానికీ మధ్యన పెద్ద అగాధం ఏర్పడింది. ఒక దశ దాటిన తర్వాత జంతువుల మధ్య అనుబంధాలు కొరవడుతున్న ట్లుగా మన సమాజంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కుటుంబ సంబంధాలు అదృశ్యమవుతున్నాయి.

ఈ ధోరణి మన సంస్కృతిని పూర్తిగా ధ్వంసం చేస్తు న్నది. అందుకే మన దేశంలో కల్చర్‌కూ, అగ్రికల్చర్‌కూ మధ్య అనుబంధం పెరగాలి. అది పెరిగితేనే అభివృద్ధి సాధ్య మవుతుంది. అదే ఆది భౌతికతకూ, ఆది దైవికానికీ ఉండే సంబంధం. ఏదైనా ఒక సమస్య పరిష్కారానికి సంబంధించి తొందరపడి నిర్ణయం తీసుకోవడం కన్నా లోతుగా ఆలో చించాలి. అప్పుడే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వ గలుగుతాం. ఎలాంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా ఎదుటి వారికి చేతనైన సహాయం చేయడం కంటే మించిన మానవ ధర్మం లేదని నిరూపించారు. 

బాహ్యప్రపంచానికి కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపించే కంచిపీఠంలో వ్యవస్థలా సామాజిక సేవా కార్య క్రమాలు కొనసాగుతున్నాయి. పెరియార్‌ చంద్రశేఖరేంద్ర స్వాములవారు దేశవ్యాప్తంగా పాదయాత్ర సలిపి భక్తినీ, ధర్మాన్నీ ప్రబోధించడమే కాకుండా తన యాత్ర పర్యటన సందర్భంగా గమనించిన ప్రజల కష్ట సుఖాలను దృష్టిలో పెట్టుకొని, వాటి పరిష్కారానికై విద్య, వైద్య, సేవా సంస్థల్ని నెలకొల్పారు. ఆ స్ఫూర్తినే స్వామి జయేంద్ర సరస్వతి కొన సాగించారు. ఆ మార్గంలోనే ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ విజ యేంద్ర సరస్వతి స్వామి వారు నిర్వహిస్తున్నారు. అందుకే కంచి మఠం  ఒక సామాజిక సేవాపీఠం అని మనవి చేస్తున్నాను.

చుక్కా రామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త,శాసనమండలి మాజీ సభ్యులు 

మరిన్ని వార్తలు