ఇంత దుర్మార్గం మీకే సాధ్యం

26 Oct, 2018 01:10 IST|Sakshi

సమకాలీనం

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నమే దారుణమంటే, సదరు భౌతిక దాడి కన్నా ఈ ‘సామూహిక ప్రచారం’ అత్యంత ప్రమాదకర ధోరణికి సంకేతాలిస్తోంది. ఇటు డీజీపీ మాట్లాడిన కొంత వ్యవధిలోనే అటు మంత్రుల బృందగానం ఎంత నోటికొస్తే అంత అన్నట్టే సాగింది. ఇక సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు జుగుప్సాకరం! నిర్హేతుకమైన నిందలతో పాటు అర్థంపర్థం లేని ప్రశ్నలన్నీ సంధించారు. ఎవరికివారుగా పని చేయాల్సిన శాసన, కార్యనిర్వాహక, స్వతంత్ర మీడియా వ్యవస్థలు ఎంతలా కలగలిసి పోయాయో, అన్నింటినీ రాజకీయం చేయడం ఎంత యధేచ్ఛగా సాగుతోందో తేటతెల్లమైంది. 

విచారణకు పూర్వమే తీర్పి చ్చినట్టుంది ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్పీ ఠాకూర్‌ మాట తీరు. ఇక... ఆయన కింది అధికారులు జరిపే దర్యాప్తు, తేల్చే నిజాలు, కేసు ముగింపు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించవచ్చు! విశాఖ విమా నాశ్రయంలో విపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగి గంటలు గడవక ముందే... ‘ఇది ప్రచారం కోసం చేసినట్టుంది’ అనడం, ‘ప్రాథమిక సమాచారాన్ని బట్టి నిందితుడు బాధితుడికి అభిమానిగా తెలుస్తోంద’నడం సాధారణ తెలివితేట లున్న వారికి కూడా విస్మయం కలిగించింది.

బాధ్యతా రాహిత్యమే కాకుండా, రాజకీయ వ్యవస్థతో అంటకాగ డానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. నిందితుని జేబులో ఓ ఉత్తరం ఉందని చెప్పీ, అయిదు గంటల జాప్యంతో వెలువరించి తదుపరి కథ నడిపే ఎత్తుగడకు ఆయన జీవం పోశారు. కత్తితో దాడి చేసి హత్యాయత్నా నికి తలపడిన వ్యక్తి, గాయపడిన జగన్‌మోహన్‌రెడ్డిని కలగలిపి ఫోటోలు సృష్టించి, స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పాలకపక్షీయులు జరిపిన విస్తృత ప్రచారం ‘గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడు ముకున్నట్టుంది’. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, ‘దాడే ఉత్తమ రక్షణ’ అనే సూత్రాన్ని ఏలికలు అక్షరాలా పాటిస్తున్నారు. ఇందులో సీఎం కార్యాలయ సన్నిహిత వ్యవస్థ, మంత్రివర్గ సభ్యులు, ఇతర ముఖ్య నాయ కులు, అనుకూల మీడియా, చివరకు స్వతంత్రంగా దర్యాప్తు జరపాల్సిన పోలీసు బాసు.. అంతా ఒకే మాట, ఒకే బాట అన్నట్టు వ్యవహరించిన తీరు దారు ణం.

కొన్ని గంటల వ్యవధిలోనే ఒకటికి తోడుగా మరొ కటి పుట్టుకొచ్చిన పరిణామాల్ని బట్టి ఇదెంత పథకం ప్రకారం జరుగుతోందో ఇట్టే బోధపడింది. హత్యాయ త్నమే దారుణమంటే, సదరు భౌతిక దాడి కన్నా ఈ ‘సామూహిక ప్రచారం’ అత్యంత ప్రమాదకర ధోరణికి సంకేతాలిస్తోంది. ఇటు డీజీపీ మాట్లాడిన కొంత వ్యవధి లోనే అటు మంత్రుల బృందగానం ఎంత నోటికొస్తే అంత అన్నట్టే సాగింది. ఇక సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు జుగుప్సాకరం! నిర్హేతుకమైన నిందలతో పాటు అర్థంపర్థంలేని ప్రశ్న లన్నీ సంధించారు. ఎవరికివారుగా పని చేయాల్సిన శాసన, కార్యనిర్వాహక, స్వతంత్ర మీడియా వ్యవస్థలు ఎంతలా కలగలిసి పోయాయో, అన్నింటినీ రాజకీయం చేయడం ఎంత యధేచ్ఛగా సాగుతోందో తేట తెల్లమైంది. పౌర పోలీసు, ఇంటలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసు, నేర పరిశోధన... వంటి విభాగాలన్నీ కలగాపులగమై రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేస్తున్న తీరుకు ఇది పరాకాష్ట! ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారి!

నిలువెల్లా నిస్సిగ్గుతనం
తుని రైల్వే దుర్ఘటన కడప జిల్లా రౌడీల పనే అని మొన్న, విశాఖ ఎజెన్సీలో ఎమ్మెల్యేని హతమార్చిన మావోల చర్య వెనుకా ప్రత్యర్థి పార్టీ ప్రమేయముందని నిన్న స్వయానా ముఖ్యమంత్రి పేర్కొన్నా దిక్కులేని పరిస్థితి! అది తప్పని నిర్దారణ అయినా... కనీసం  క్షమాపణ కోరకపోవడం సీఎం తెంపరితనం! విపక్ష నేతపై దాడి వారికి వారే జరుపుకున్నారంటూ నేడు నిరాధార నింద మోపడానికైనా వెనుకాడని బాధ్యతా రాహిత్యం ముఖ్యమంత్రిది. దర్యాప్తుకు ముందే, అన్నీ తానే తేల్చి ఇక ఏ దర్యాప్తూ అక్కర్లేదన్న దబాయింపు ఆయనది.

‘సంఘటన ఎక్కడ జరిగింది? సీఐఎస్‌ఎఫ్‌ నియంత్రణలో కాదా, మాకేం సంబంధం...?’ అంటూ, ‘ఏయ్‌ నువ్‌ చెప్పవయ్యా!’అని విలేకరిని గద్దించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అదే రన్‌వే అంతటా తన పోలీసు పటాలాన్ని దించి, ఎయిర్‌ క్రాఫ్ట్‌ వరకు మోహరించి, ఇదే జగన్‌మోహన్‌రెడ్డిని నిర్బంధిచడం ఎలా మరచిపోయారు? ఎంతటి పచ్చి అబద్దాన్నయినా అల వోకగా పలుకొచ్చు. సిగ్గు–బిడియం లేకుండా విస్తృ తంగా ప్రచారం చేయొచ్చు, అందుకనుకూలంగా పాలనా వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగ పరచవచ్చ న్నది ఇప్పుడు వారి ధీమా! జరిగిన దారుణాన్ని ఖండించి, పాలనాపరంగానో, నైతికంగానో బాధ్యత తీసుకోవాల్సింది పోయి, ఎదురుదాడులతో దుష్ప్ర చారానికి దిగుతున్న తీరు ఏహ్యంగా ఉంది. ‘ఆపరేషన్‌ గరుడ’ కూడా ఈ విశాల కుట్రలో భాగమే అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి.

తమ ప్రచార వ్యూహంలో బాగంగా పాత వీడియోలను ఇప్పుడు మళ్లీ తెరకెక్కిం చారు. ముఖ్యమంత్రితో సహా కీలకమైన, బాధ్యతాయు తమైన స్థానాల్లోని వారు ఎన్ని అబద్దాలు ఆడి అయినా తమ దాష్టికాల నుంచి తప్పుకోవచ్చు! వైఫల్యాల నుంచి వైదొలగొచ్చు! ‘తాన అంటే తందాన’ అనే అనుకూల మీడియా సహకారంతో వాటిని వేయినోళ్లతో ప్రచారం చేయాలంతే! ఇదే వ్యూహంతో రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడం కూడా ఇప్పుడు వారికి రివాజయింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ప్రతిష్టను గంగలో కలిపిందీ ఈ ‘రాజకీయ కాలు ష్యమే!’ పొరుగు రాష్ట్రం ఒడిశాలో 17 జిల్లాల్లో తుఫాను ముందు జాగ్రత్త–సహాయక చర్యలు సజావుగా సాగితే, ఏపీలో పావుజిల్లాలోనూ ఎక్కడికక్కడ విఫలమయ్యారు.

పట్టుమని రెండొందల గ్రామాల్లోనూ సహాయక చర్యల్ని ఓ కొలిక్కితీసుకు రాలేక ప్రభుత్వం ఘోరంగా విఫల మైంది. ప్రజలు నేటికీ అల్లాడే దుస్థితికి ఈ మితిమీరిన ‘అతి రాజకీయ’ జోక్యమే కారణమని తేటతెల్లమవు తోంది. అధికారుల్ని స్వేచ్ఛగా పనిచేసుకోనీయని అతి జోక్యం వారిదయితే, వారి కనుసన్నల్లో పనిచేస్తూ విధిని ర్వహణకు సంబంధించిన కనీస ‘ప్రోటోకాల్స్‌’ను మరిచి ఊడిగం చేయడం వీరి పంథా అయింది.

ఏ ఎత్తుగడ వెనుక ఎవరున్నారో..!
విమానాశ్రయంలో కత్తి దాడి ఏ విధంగా చూసినా భద్రతా వైఫల్యమే! అయితే, అది మాత్రమే ముఖ్యం కాదు. అంతకు మించి, ఈ దాడి వెనుక ఉద్దేశ్యమేమిటి? ఎందుకు జరిగింది? సదరు చర్య వెనుక ఎవరున్నారు? అన్నది చాలా ముఖ్యం. అది తగిన దర్యాప్తుతోనే తేలు తుంది. కానీ, ఆ దర్యాప్తునకు ఆస్కారాన్ని, సానుకూ లతను ముఖ్యమంత్రి స్వయానా పనిగట్టుకొని భగ్నం చేస్తున్నారు. ముందస్తు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ భవిష్యత్‌ దర్యాప్తు ప్రక్రియనే దారి మళ్లించే కుట్రను వ్యూహాత్మకంగా చేపట్టారు.

ఆయన, ఆయన మను షులు ముందుగానే ఎవరెవరికో ఉద్దేశ్యాలు ఆపాదిస్తు న్నారు. ఇంకెవరెవరినో తప్పించేందుకు యత్నిస్తున్నా  యధేచ్చగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. దొంగ ఫోటోలు రూపొందిస్తు న్నారు. అంతకు ముందు నుంచే నిందితుడు శ్రీనివాస్, బాధితుడు జగన్‌మోహన్‌రెడ్డి కలిసి ఉన్నట్టు ఓ ఫోటోను ‘సాంకేతికత’తో సృష్టించి, స్వయంగా మంత్రులే విలేకరుల సమావేశంలో ప్రద ర్శించారు. అలాంటి సృష్టి ఎవరైనా చేయొచ్చు.... సదరు నిందితునితో చంద్రబాబు ఉన్నట్టు, ఆయన కుమారుడైన మంత్రి లోకేష్‌ ఉన్నట్టు కూడా సృష్టించడం ఎంత తేలికో సామాజిక మాధ్యమాల్లో నిమిషాల్లోనే ప్రత్యక్షమైంది! దాంతో, పాలకపక్షం నిందల వ్యాప్తి భాగోతం బట్టబ యలైంది.

ఇలాంటి ప్రాణహాని లేని హత్యాయత్నం విపక్షనేతపై జరుగుతుందని ‘ఆపరేషన్‌ గరుడ’లో ఇదివరకే చెప్పారనే ఒక వీడియో క్లిప్పిం గును మళ్లీ ప్రచారంలోకి తెచ్చారు. ‘చూశారా! చెప్పినట్టే జరిగింద’నే వాదనను తెరకెక్కించారు. కానీ, సదరు ‘ఆపరేషన్‌ గరుడ’లో అంత కీలకమైన విషయాలు అప్పుడే వెలుగు చూస్తే, ప్రభుత్వం ఏం చేసింది? నిజమని భావిస్తే ఆ ‘డ్రామా’ను ముందే ఎండగట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు? తప్పని భావిస్తే, అటువంటి ప్రచారాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చట్టపరంగా చర్య తీసుకోకుండా ఎందుకు ఉపేక్షించి చోద్యం చూసింది? ఇది పాలకపక్షం కనుసన్నల్లో జరుగుతున్న విస్తృత కుట్రలో భాగంగా భావించాలా? విమానాశ్రయంలో కత్తి దాడి కూడా ఇందులో భాగ మేనా? దాడి విజయవంతమైతే తామాశించిన భౌతిక నిర్మూలన లక్ష్యం నెరవేరుతుంది.

రాజకీయంగా తమ కిక ఎదురుండదు. ఏ పరిస్థితుల్లోనయినా దాడి విఫల మైతే.... ‘అదుగో ఆపరేషన్‌ గరుడలో మేం ముందే చెప్పాం, ఇది వారికి వారు చేసుకున్న దాడి, మేమన్నట్టే జరిగింది’ అని దుష్ప్రచారం చేయొచ్చన్నది వారి ద్విముఖ వ్యూహమా? అదే నిజమైతే, ఇప్పుడిది తేలాలి. ఇది నిర్దారణ అయితే తప్ప, ‘ఆపరేషన్‌ గరుడ’కు ముఖ్యమంత్రిది డైరెక్షన్, శివాజీది ‘యాక్షన్‌’ అని జరుగుతున్న ప్రచారంలోని నిజానిజాలు తేలవు!

నిన్నొక నీతి నేడొక రీతి! 
విమానాశ్రయంలో వ్యక్తుల, వీఐపీల భద్రతకు సంబం ధించి ఎవరి బాధ్యత ఎంత? అనే విషయంలో రాష్ట్ర– కేంద్ర పోలీసు బలగాలు పరస్పరం అవతలివారి వైపు వేలెత్తి చూపుతున్నారు. సాధారణ తనిఖీలు నిర్వహించి, ప్రయాణీకుల గుర్తింపును ఖరారు చేస్తాం, వ్యక్తిగత భద్రత మా బాధ్యత కాదని కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎసెఫ్‌) ఉన్నతాధికారులంటున్నారు. సదరు బలగాల నియంత్రణ, అంటే ఏకంగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెబుతున్నారు.

‘మాకేం సంబంధం..?’ అని దబాయి స్తున్న ముఖ్యమంత్రి, ప్రత్యేక హోదా నిరసన కార్యక్ర మంలో పాల్గొనడానికి హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చిన విపక్షనేతను లోగడ రాష్ట్ర పోలీసులతో అడ్డగించి నపుడేం జరిగిందో మరచిపోయినట్టున్నారు. నగరపో లీసు కమిషనర్‌తో సహా రాష్ట్ర పోలీసు సిబ్బంది విమానాశ్రయం రన్‌వే వరకు మోహరించి, విపక్ష నేతను నిర్భందించారు. విమానాశ్రయం బయటకు రానీకుండా అడ్డగించి, అక్కడ్నుంచే విమానంలో హైద రాబాద్‌ తిరిగి పంపించారు. అదంతా మరచిపోయి, ఇప్పుడు, మారిన రాజకీయ సమీకరణాల్లో ఫక్తు రాజ కీయంగా మాట్లాడటం ముఖ్యమంత్రి నైజాన్నే వెల్లడి చేస్తోంది.

జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నాన్ని చిన్నది చేసి చూపే కుట్రకు పూనుకున్న ఓ వర్గ మీడియా పక్కన పెద్దగీత గీస్తూ తిమ్మరుసు నీతికి దిగింది. రాష్ట్ర ప్రభు త్వాన్ని అస్థిరపరిచే యత్నం జరుగుతోందని నెత్తీనోరూ మొత్తుకుంటూ పాలకపక్షంతో స్వరం కలిపింది. గంపెడు బాధను గుండెలోనే దిగమింగి కూడా వైఎస్సా ర్‌సీపీ శ్రేణులు, అభిమానులు సంయమనం పాటిం చారు. ఇంత జరిగినా.... ఎదుటివారి కుట్ర సామాన్యు లకూ తెలిసి రావాలనో! తమ నేత పిలుపునకు వారి చ్చిన గౌరవమో! ఎక్కడా ఒక అవాంఛనీయ ఘటనా చొటు చేసుకోలేదు.

పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిని, నలభై ఏళ్ల రాజకీయం అని జబ్బలు చరుచుకోవడం కాకుండా హైకోర్టు న్యాయమూర్తితోనో, తటస్థ దర్యాప్తు సంస్థతోనో ఈ కేసు విచారణ జరిపించి నిజాయితీని నిరూపించుకోవాలి. తాను మోపిన నిందల్ని నిరూ పించాలి. అది జరిగితే సరేసరి! జరక్కపోయినా.... ప్రజాకవి కాళోజీ నారాయణ రావు అన్నట్టు ‘కాలమ్ము రాగానే కాటేసి తీరాలి....’ అని ఏపీ రాష్ట్ర ప్రజలు కాచు కొని ఉన్నారు. తస్మాత్‌ జాగ్రత్త!

దిలీప్‌ రెడ్డి, ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

మరిన్ని వార్తలు