ఘోరం.. చదువుల సారం

16 Feb, 2018 02:17 IST|Sakshi

ఇప్పుడు వాస్తవంగా ఎదురవుతున్న సమస్య విద్యా ప్రమాణాల స్థాయి. మన పాఠశాలలు అందిస్తున్న విద్య స్థాయి అత్యంత నిరాశాజనకంగా ఉన్నదని ఆ నివేదిక వెల్లడించింది. 14–18 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలబాలికలు తమ మాతృభాషలో ఉన్న వచనాన్ని కూడా చదవలేకపోతున్నారు. నిజానికి మాతృభాషలో ఉన్న వాక్యాలను చదవగలిగే సామర్థ్యం వారికి ఎనిమిదేళ్లు నిండే సరికే రావాలి. ఈ సర్వే పరిధిని బట్టి 57 శాతం బాలబాలికలు ప్రాథమిక అంకగణితంలో లెక్క కూడా పరిష్కరించలేక పోతున్నారు. అంటే 591ని 4తో భాగహారం కూడా చేయలేకపోతున్నారు.

దేశంలో విద్యా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో విశదీకరించే పెద్ద నివేదికలు రెండు  గడచిన మాసంలో వెలువడ్డాయి. ఇందులో ఒకటి అధికారికమైనది కాగా, రెండోది అనధికారిక నివేదిక. ఈ రెండూ కూడా ఇప్పుడు బోధిస్తున్న విద్య దేశానికి ఏమి ఇస్తున్నదో ఒక సమగ్ర చిత్రాన్ని మన కళ్ల ముందు రూపు కట్టిస్తాయి. పాఠశా లల్లో బోధించే వివిధ పాఠ్యాంశాల నుంచి పిల్లలు ఏం నేర్చుకున్నారు అనే విషయాన్ని అధికారిక నివేదిక వివ రించింది. పిల్లలు ఏం చదువుకున్నప్పటికీ వాళ్ల సామ ర్థ్యం ఏపాటిది అనే విషయానికి అనధికారిక నివేదిక అద్దం పట్టింది. మరేదైనా ఇతర దేశంలో ఎక్కడైనా సరే, ఈ నివేదిక వ్యవహారం పత్రికలలో పతాకశీర్షికగా చోటు దక్కించుకునేది. భవిష్యత్తును గురించి లోతుగా ఆలో చించే మరే ఇతర దేశంలో అయినా ఇలాంటి సర్వేలను విశ్లేషిస్తూ పుంఖానుపుంఖాలుగా వార్తలు వెలువడేవే కూడా. ఇండియాలో తప్ప మరెక్కడైనా అయితే ఈ అంశం మీద గంటల తరబడి టీవీ చానళ్లలో చర్చలు జరి గేవి. కానీ ఇంకా విడుదలకు నోచుకోని ఒక సినిమా గురించీ, ఒక కల్పిత పాత్రను గురించీ చర్చించడానికి మాత్రం మనకు బోలెడు సమయం ఉంటుంది. కానీ భావి భారత పౌరుల శ్రేయస్సు కోసం చర్చించేందుకు మనకు సమయం ఉండదు. భారతీయులం మాత్రమే ఇలా వ్యవహరించగలం.
 
విద్య నాణ్యాతా ప్రమాణాలే లక్ష్యంగా
విద్య స్థితిగతుల వార్షిక నివేదిక –2017 (ఏఎస్‌ఆర్‌) పేరుతో వెలువడినది–అనధికారిక సర్వే. దీనిని ప్రఖ్యాత ప్రభుత్వేతర సంస్థ ‘ప్రాథమ్‌’ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలలో విద్యా ప్రమాణాలలోని లోటు పాట్లను అందరి దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతో ప్రాథమ్‌ దశాబ్దకాలంగా ఇలాంటి నివేదికలను విడుదల చేస్తు న్నది. ఈసారి వెలువరించిన నివేదిక మరీ ప్రత్యేకమై నది. దీనికి ‘మూలసూత్రాలకు ఆవల’ అని పేరు పెట్టారు. 14–18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న విద్యార్థులు విద్యను ఆకళింపు చేసుకుంటున్న స్థాయిల మీద ఈ నివేదిక ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. దేశంలోని 24 రాష్ట్రాలలో ఒక్కొక్క జిల్లా వంతున సర్వే కోసం ఎంచుకున్నారు. యువతీయువకులను ప్రశ్నలను అడిగేందుకు మొత్తం 23,000 ఇళ్లను ఎంపిక చేశారు. పక డ్బందీగా రూపొందించిన ఈ సర్వే కొంతమేర అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సర్వే ఉద్దేశం విద్యలో నాణ్యతా ప్రమాణాలు కాబట్టి ప్రశ్నలు అందుకు తగ్గట్టు కొన్ని తేలికగా ఉన్నాయి.

రెండవది, అంటే అధికారిక సర్వే విద్యా పరిశోధన, శిక్షణ జాతీయ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) విడుదల చేసి నది. ఎంతో ప్రతిష్ట ఉన్న నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే ఇది. అంటే జాతీయ స్థాయిలో విద్య సాధించిన విజ యాల మీద నివేదిక. ఈ సర్వే చాలా విషయాలలో విస్తృత స్థాయిలో ఉంటుంది. ఇది దేశంలోని 701 జిల్లా లను తన పరిధిలోకి తీసుకున్న నివేదిక. లక్షా పదివేల పాఠశాలలు, 21 లక్షల విద్యార్థుల విద్యా ప్రమాణాలను గురించి వివరించింది. ఈ సర్వేకు ఉన్న విలువ ఏమి టంటే, ఇది చాలా విశ్వసనీయమైన గణాంకాలను అంది స్తుంది. అయితే చాలా కీలకాంశాలు గ్రాఫ్‌లు, పట్టికల వెనుక అందీఅందకుండా ఉంటాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సర్వే జాతీయ నివేదికను వెల్లడించ రాదని ఎన్‌సీఈఆర్‌టీ భావించింది. ఇప్పుడు మనకు లభ్యమైన సర్వేలు కేవలం జిల్లా స్థాయికి సంబంధించి నవే. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి 12 నివేదికలు ఉంటాయి. ఇవి చదవడం కొంచెం కష్టమే.
 
నిరాశాజనకమైన విద్య
మనందరం భావిస్తున్నట్టే పిల్లలు పాఠశాలలో చేరడం ఇప్పుడు విద్యారంగాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య కాదని విద్య స్థితిగతుల వార్షిక నివేదిక –2017 కూడా పేర్కొ న్నది. ఎందుకంటే ప్రస్తుతం పాఠశాలలో చేరకుండా ఉండిపోయిన పిల్లలు 14 శాతమే. ఇప్పుడు వాస్తవంగా ఎదురవుతున్న సమస్య విద్యా ప్రమాణాల స్థాయి. మన పాఠశాలలు అందిస్తున్న విద్య స్థాయి అత్యంత నిరా శాజనకంగా ఉన్నదని ఆ నివేదిక వెల్లడించింది. 14–18 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలబాలికలు తమ మాతృభాషలో ఉన్న వచనాన్ని కూడా చదవలేకపోతు న్నారు. నిజానికి మాతృభాషలో ఉన్న వాక్యాలను చదవ గలిగే సామర్థ్యం వారికి ఎనిమిదేళ్లు నిండేసరికే రావాలి. ఈ సర్వే పరిధిని బట్టి 57 శాతం బాలబాలికలు ప్రాథమిక అంకగణితంలో లెక్క కూడా పరిష్కరించ లేకపోతున్నారు. అంటే 591ని 4తో భాగహారం కూడా చేయలేకపోతున్నారు. ఇందులో చాలామంది పాఠశా లలో కొద్దిపాటి ఇంగ్లిష్‌ను కూడా చదువుకుంటున్నారు. కానీ వారిలో దాదాపు సగం మంది ‘వాటీజ్‌ ది టైమ్‌’ వంటి సులభమైన వాక్యాలను కూడా చదవలేకపోతు న్నారు. ఆ వయసు పిల్లలు వాళ్ల వాళ్ల పాఠశాలల్లో నేర్చు కున్న దానిని బట్టి దేశానికి ఏమి ఇవ్వగలరో ఒక్కసారి పరిశీలిద్దాం. ఇది కూడా మనకున్న నమ్మకం స్థాయిని ఏ మాత్రం పెంచేదిగా లేదు.

డబ్బులు కూడా లెక్కపెట్టలేరు
పాఠశాలలకు వెళుతున్న ఆ వయసు పిల్లల్లో కనీసం నాలుగో వంతు మంది డబ్బులు లెక్కపెట్టలేరు. 40 శాతం మంది చేతి గడియారం చూసి సమయం ఎంత యిందో చెప్పలేరు. 60 శాతం మంది సమయం, పొడవు వెడల్పులను గణించి చెప్పలేరు. ఏదైనా ఒక ప్యాకెట్‌ మీద రాసిన నిబంధనలను చదవలేనివాళ్లు 46 శాతం ఉన్నారు. వీరంతా పాఠశాలలకు వెళ్లిన విద్యావంతులని చెప్పుకోదగినవారే. 36 శాతం మందికి మార్కెట్‌ అంచ నాలు తెలియవు. ఇంకా ఆశ్చర్యం, భారత దేశ పటం చూపించి మీ రాష్ట్రం ఎక్కడుందో గుర్తించమంటే గుర్తించ లేని వారు 58 శాతం ఉన్నారు.

ఇంకా విశ్వసనీయమైన సర్వేను డీకోడ్‌ చేసి పరి శీలిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ప్రాథమిక విషయాలే మనలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ సర్వే చూసిన తరువాత వివిధ కాలాలలో వివిధ స్థాయిల లోని విద్యార్థులను గురించి బేరీజు వేసి చూడడానికి ఈ సర్వే మనకు అవకాశం ఇస్తుంది. కానీ ఇందులో విని పించే ఒక శుభవార్త కూడా ఉంది. సాధించడం అనే అంశానికి సంబంధించి బాలబాలికల మధ్య అంతరం గణనీయంగా తగ్గింది. ఆ మాటకొస్తే కొన్ని పాఠ్యాంశా లకు సంబంధించి బాలుర కంటే బాలికలే ముందంజలో ఉన్నారని కూడా చెప్పాలి. పట్టణ–గ్రామీణ ప్రాంతాల పాఠశాలలు; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యా ర్థులకు– అభివృద్ధి చెందిన వర్గాలకు చెందిన కుటుం బాల నుంచి వచ్చిన విద్యార్థులకు నడుమ అంత రం మాత్రం చాలా హెచ్చుగా కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య అంతరం కూడా ఎక్కువగానే ఉంది. ఈసారి వచ్చిన జాతీయ స్థాయి సాధన సర్వేలో బాగా కలవరపెట్టే అంశం విద్యా ప్రమా ణాలలో దారు ణమైన పతనం.

గ్రామీణ ప్రాంత పాఠశాలలను చూస్తే చాలు
నిజానికి ఈ సర్వేలు వెల్లడిస్తున్న అంశాలు దేశానికి కొత్తేమీ కావు. దేశంలోని సాధారణ పాఠశాలల స్థితి గతులను గురించి అవగాహన ఉన్నవారు ఈ సర్వే ఫలితాలను చూసి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం కూడా జరగదు. ముఖ్యంగా గ్రామీణ భారతంలోని పాఠశాల లను చూస్తే అసలు ఆశ్చర్యం కలగదు. కానీ ఈ సర్వేల ఫలితాలు మన పాఠశాల విధానంలోని లోటుపాట్లకు అద్దం పడుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. ఈ దుస్థితి నుంచి చదువును రక్షించుకోవడానికి జిల్లా స్థాయిలో తీసుకోవలసిన చర్యల గురించి ఈ నివేదికలు హెచ్చ రిస్తున్నాయి. అయితే నిజంగా వేసుకోవలసిన ప్రశ్న ఒకటి ఉంది. ఇదంతా ఎవరు వింటారు? విద్యాభివృద్ధి గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ, బడ్జెట్‌లో మాత్రం  అరకొరగా కేటాయింపులు చేసే చోట ఈ ప్రశ్నకు ఆశా జనకమైన సమాధానాన్ని ఆశించడం  సాధ్యం కాదు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తరు వాత పరిస్థితి ఇది. విద్యను ఒక హక్కుగా ప్రకటించు కున్నాక కూడా నాసిరకం విద్యతోనే తరం తరువాత తరం పాఠశాలల ప్రాంగణాలను వీడి వస్తున్నాయి. ఆప రేషన్‌ బ్లాక్‌బోర్డ్‌ సహా, ఎన్నో కమిషన్లు మన విద్యారం గాన్ని క్షాళన చేయడానికి ఉద్దేశించినవే. కానీ ఫలితం మాత్రం ఆశాజనకంగా లేదని ఈ తాజా సర్వేలు నిర్ద్వం ద్వంగా వెల్లడిస్తున్నాయి. భావి భారతదేశం తరగతి గదులలోనే రూపుదిద్దుకుంటుందన్న వాస్తవం గ్రహించ డానికి మన రాజకీయ నాయకత్వానికి ఇంకా ఎంత సమయం కావాలో తెలియడం లేదు. విద్యారంగానికి కేటాయింపులు తక్కువగా చేయడమే కాదు, ఆ మంత్రిత్వ శాఖలను కూడా సరైన వ్యక్తులకు అప్పగిం చడం లేదు. సరైన వ్యక్తులు వచ్చినప్పటికీ విద్యను ఖర్చుగా పరిగణించే వాతావరణం ఎక్కువగా కనిపిం చడం వల్ల వారు చేయగలిగింది కూడా చేయలేకపోతు న్నారు. భారత్‌ కీర్తి పతాక అంతర్జాతీయంగా రెపరెప లాడుతున్నదని చెబుతున్న నాయకత్వం గ్రామీణ భార తంలోని విద్య స్థితిగతులను పట్టించుకొనకపోతే; బడుగు వర్గాలకు, ఉన్నత వర్గాలకు మధ్య విద్యాపర మైన అంతరాలు తొలగకపోతే ఎదురయ్యే పరిణామాలు దేశ భవిష్యత్తును మసకబారుస్తాయి.

వ్యాసకర్త స్వరాజ్‌ అభియాన్, జైకిసాన్‌ సంస్థల్లో సభ్యులు ‘ 98688 88986
యోగేంద్ర యాదవ్‌

మరిన్ని వార్తలు